న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ vs స్మిత్.. బెస్ట్ ఎవరో చెప్పిన ఆరోన్ ఫించ్.. భారత్-ఆసీస్ ఆల్‌టైమ్ వన్డే టీమ్ ప్రకటన!

Virat Kohli vs Steve Smith, Aaron Finch weighs in on best batsman debate

సిడ్నీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్ స్మిత్‌లలో ఎవరు గొప్ప ఆటగాడనే ప్రశ్నకు ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. టెస్ట్‌ల్లో స్మిత్ గొప్ప బ్యాట్స్‌మన్ అయితే లిమిటెడ్ ఓవర్ల ఫార్మాట్ కోహ్లీ బెస్ట్ అని తెలిపాడు. ఇక కోహ్లీ-స్మిత్‌, విరాట్-రోహిత్‌లో ఎవరు గొప్ప అనే చర్చ తరుచూ జరుగుతున్నదే. మూడు ఫార్మాట్లలో నిలకడగా ఆడే విరాట్ కోహ్లీనే గొప్ప అని కూడా చాలా మంది అభిప్రాయపడ్డారు. కొన్ని కారణాలతో స్మిత్‌కు ఓటేశారు. కోహ్లీ, రోహిత్‌లలో కూడా విరాటే గొప్ప అని స్పష్టం చేశారు.

చర్చ తెగకుండా.. ముందుకు సాగకుండా..

చర్చ తెగకుండా.. ముందుకు సాగకుండా..

అయితే ఫించ్ మాత్రం ఈ చర్చ తెగకుండా.. ముందుకు సాగకుండా సమాధానమిచ్చాడు. తాజాగా ఆజ్‌తక్ స్పోర్ట్స్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యలో మాట్లాడుతూ.. సంప్రదాయక ఫార్మాట్‌లో స్మిత్ ప్రదర్శన అసాధారణమని కొనియాడాడు. అలాగే ఇంగ్లండ్ గడ్డపై కోహ్లీ ఆడిన తీరు అమోఘమన్నాడు. ‘టెస్ట్ క్రికెట్‌లో ఇద్దరు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. స్వదేశీ, వీదేశాల్లో రికార్డులు సృష్టిస్తున్నారు. గతంలో ఇంగ్లండ్‌ గడ్డపై జిమ్మి అండర్సన్‌తో కఠిన పరిస్థితులు ఎదుర్కొన్న కోహ్లీ అద్భుతంగా పుంజుకొని వారిపై ఆధిపత్యం చెలాయించాడు. ఇక స్మిత్ ఎక్కడా తడబాటుకు గురవ్వడు. అతనో అసాధారణమైన టెస్ట్ క్రికెటర్. ఈ ఇద్దరూ నిలకడగా రాణిస్తూ క్రికెట్ ప్రపంచంపై ఆధిపత్యం చలాయిస్తున్నారు. అయితే టెస్ట్ క్రికెట్‌లో కోహ్లీ కన్నా స్మిత్ కొంచెం ముందున్నాడు.'అని ఫించ్ తెలిపాడు.

 బెస్ట్ లిమిటెడ్ ఫార్మాట్ ప్లేయర్ కోహ్లీ..

బెస్ట్ లిమిటెడ్ ఫార్మాట్ ప్లేయర్ కోహ్లీ..

ఇప్పడు కాకపోయినా కోహ్లీ తన కెరీర్ ముగిసేలోపు బెస్ట్ వన్డే ప్లేయర్‌గా నిలుస్తాడని ఫించ్ జోస్యం చెప్పాడు. ‘కోహ్లీ కెరీర్ ముగించేలోపు ఆల్‌టైమ్ బెస్ట్ వన్డే ప్లేయర్‌గా నిలుస్తాడు. అతనితో ఆడటం చాలా కష్టం. కానీ కోహ్లీ ఆట చూడముచ్చటగా ఉంటుంది. సచిన్ టెండూల్కర్ ఎక్కువ సెంచరీలు చేయడం వల్ల అతని ఖాతాలో ఎక్కువ పరుగులు చేరాయి. కానీ కోహ్లీ చేజింగ్‌లో నిలకడగా పరుగులు చేస్తూ సెంచరీలు సాధించడం గొప్ప విషయం. టీ20 క్రికెట్‌లో కూడా స్మిత్ కన్నా విరాట్‌దే పైచేయి. అయితే స్మిత్ కన్నా విరాట్ ఎక్కువ మ్యాచ్‌లు ఆడటమే దీనికి కారణం'అని ఫించ్ అభిప్రాయపడ్డాడు.

ఊతప్ప వ్యాఖ్యలపై శ్రీశాంత్ ఫైర్

భారత్-ఆసీస్ ఆల్‌టైమ్ వన్డే..

భారత్-ఆసీస్ ఆల్‌టైమ్ వన్డే..

ఇక ఫించ్ భారత్-ఆస్ట్రేలియా ఆల్‌టైమ్ అత్యుత్తమ వన్డే జట్టును ఎంపిక చేశాడు. ఈ టీమ్ ఓపెనర్లుగా ఆడమ్ గిల్‌క్రిస్ట్, వీరేంద్ర సెహ్వాగ్‌ను ఎంపిక చేసిన ఫించ్.. తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. సెహ్వాగ్ కాదని రోహిత్‌ను తీసుకున్నాడు. ‘నా తొలి ప్రాధాన్యత సెహ్వాగే. అతను బౌలర్లపై పూర్తిగా ఆధిపత్యం చెలాయించే ఆటగాడు. అయితే అతని ఆట ముగిసింది కనుక రోహిత్‌ను తీసుకుంటున్నా. అతని రికార్డు అద్భుతం. కానీ నాకు మాత్రం గిల్‌క్రిస్ట్‌తో సెహ్వాగ్ ఓపెనింగ్ చేయడమే చూడాలనుంది. రికీపాంటింగ్, విరాట్ కోహ్లీ 3,4 ‌స్థానాలకు సరిపోతారు.'అని ఫించ్ చెప్పుకొచ్చాడు. ఇక ఆల్‌రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, ఆండ్రూ సైమండ్స్ తీసుకున్న ఫించ్.. బ్రెట్ లీ, జస్‌ప్రీత్ బుమ్రా, గ్లేన్ మెక్‌గ్రాత్‌లతో పేస్ విభాగాన్ని పూర్తి చేశాడు.

 ధోనీ ఆటను చూడటం ఇష్టం..

ధోనీ ఆటను చూడటం ఇష్టం..

వన్డే ప్రపంచకప్ అనంతరం జట్టుకు దూరమైన భారత సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ భవితవ్యంపై మాట్లాడటానికి ఫించ్ నిరాకరించాడు. కాకపోతే అతని ఆటను చూడటం తనకు చాలా ఇష్టమని మాత్రం చెప్పుకొచ్చాడు. ‘ధోనీ భవితవ్యంపై నేను మాట్లాడలేను. నిజాయితీగా నాకు ధోనీ గురించి తెలియదు. అతనో అద్భుతమైన ఆటగాడు. అతని ఆటను చూడటం నాకు ఇష్టం. కానీ అతని భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలపై మాత్రం నేను స్పందించలేను'అని ఫించ్ సున్నితంగా తిరస్కరించాడు.

నటాషా నన్ను చూసి ఈ వింత మనిషి ఎవరనుకుంది.. అది మా ఫ్యామిలీకే తెలియదు: పాండ్యా

Story first published: Friday, June 5, 2020, 10:46 [IST]
Other articles published on Jun 5, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X