Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నటాషా నన్ను చూసి ఈ వింత మనిషి ఎవరనుకుంది.. ఎంగేజ్‌మెంట్ గురించి మా ఫ్యామిలీకే తెలియదు: పాండ్యా

Hardik Pandya reveals how he first met Natasa Stankovic

న్యూఢిల్లీ: తన కాబోయే భార్య, ప్రియురాలు నటాషా స్టాన్‌కోవిచ్ తొలిసారి తనను చూసి ఈ వింత మనిషి ఎవరా? అని అనుకుందని టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తెలిపాడు. జనవరి 1న దుబాయ్‌లో సెర్బియా నటి, మోడల్‌ అయిన నటాషా, పాండ్యా నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆకస్మాత్తుగా వచ్చిన ఈ ఎంగేజ్‌మెంట్ ప్రకటనతో అప్పట్లో అభిమానులంతా షాక్ అయ్యారు. ఇక తన కుటుంబానికి కూడా ఆఖరివరకు ఈ నిశ్చితార్థం గురించి తెలియదని ఈ స్టార్ ఆల్‌రౌండర్ చెప్పుకొచ్చాడు.

మా పేరేంట్స్‌కే తెలియదు..

మా పేరేంట్స్‌కే తెలియదు..

ప్రముఖ కామెంటేటర్ హర్షాబోగ్లే హోస్ట్‌గా క్రిక్ బజ్ నిర్వహించిన లైవ్ సెషన్‌లో పాల్గొన్న ఈ విధ్వంసక ఆల్‌రౌండర్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఈ సందర్బంగా హర్షా బోగ్లే.. హార్దిక్-నటాషాల ఎంగేజ్‌మెంట్ గురించి ప్రశ్నించాడు. అయితే తన నిశ్చితార్థం గురించి తన కుటుంబ సభ్యులకు కూడా తెలియదని, ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు కూడా చెప్పలేదన్నాడు. ఎంగేజ్‌మెంట్‌కు రెండు రోజుల ముందు తన సోదరుడు కృనాల్ పాండ్యాకు ఈ విషయం తెలియజేశానన్నాడు.

‘నా నిశ్చితార్థం విషయం మా తల్లితండ్రులకు కూడా తెలియదు. ఎంగేజ్‌మెంట్‌కు రెండు రోజుల ముందే కృనాల్‌కు చెప్పా. ‘ఇక ఈ బ్యాచిలర్ లైఫ్ చాలు. నాకు నచ్చిన అమ్మాయి దొరికింది. నేను బాగుపడే రోజులు వచ్చాయి'అని కృనాల్‌తో చెప్పాను. వారంతా నాకు అండగా నిలిచారు. నీకు నచ్చింది, కావాల్సింది చేయమన్నారు.'అని హార్దిక్ చెప్పుకొచ్చాడు.

నేనేవరో కూడా నటాషాకు తెలియదు..

నేనేవరో కూడా నటాషాకు తెలియదు..

ఇక నటాషాను ఎలా కలుసుకున్నావని, ఆమెకు నీవు తెలుసా? అని పాండ్యాను హర్షా ప్రశ్నించాడు. దీనికి బదులిస్తూ పాండ్యా తన ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టాడు. ‘అసలు నేనేవరో కూడా ఆమెకు తెలియదు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో నేను టోపీ, చైన్, వాచ్‌తో కనిపించడాన్ని చూసి.. ఈ వింత మనిషి ఎవరు..? ఎక్కడ నుంచి వచ్చాడు..? అనుకుందట. అయితే.. నేను తనతో మాట్లాడిన తర్వాతే.. ఒకరి గురించి మరొకరం తెలుసుకున్నాం. ఆ వెంటనే డేటింగ్, డిసెంబర్ 31న ఎంగేజ్‌మెంట్ అలా జరిగిపోయాయి'అని హార్దిక్ పాండ్యా వెల్లడించాడు.

వర్ణ వివక్షకు మేమూ బాధితులమే: భారత క్రికెటర్లు

టెస్టులు ఆడటం నాకు సవాలే

టెస్టులు ఆడటం నాకు సవాలే

వెన్ను నొప్పికి శస్త్రచికిత్స తర్వాత టెస్టు క్రికెట్‌ ఆడటం తనకు సవాలేనని హార్దిక్‌ పాండ్యా చెప్పుకొచ్చాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో జట్టుకు తన అవసరమున్నందున సుదీర్ఘ ఫార్మాట్‌ కోసం తాపత్రయపడి ప్రమాదం కొనితెచ్చుకోనని స్పష్టం చేశాడు. ‘టెస్టుల్లో నన్ను బ్యాకప్‌ సీమర్‌గా భావిస్తారని తెలుసు. కానీ వెన్నునొప్పి చికిత్స తర్వాత టెస్టులాడటం నాకు పెద్ద సవాలే. కేవలం నేను టెస్టు స్పెషలిస్టునే అయితే రిస్క్‌ చేసి అయినా సుదీర్ఘ ఫార్మాట్‌లో ఆడేవాడిని. కానీ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో జట్టుకు నా అవసరం ఉంది' అని ఈ బరోడా క్రికెటర్ వెల్లడించాడు.

తండ్రికాబోతున్న పాండ్యా..

తండ్రికాబోతున్న పాండ్యా..

ఈ ఏడాది జనవరి 1న సెర్బియన్ నటి నటాషా స్టాంకోవిచ్‌‌తో నిశ్చితార్థం జరిగినట్లు తెలిపిన హార్దిక్ పాండ్యా.. మే 31న తాను తండ్రి కాబోతున్నట్లు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. పెళ్లి కాకుండానే పిల్లలేంటి..? అని కొందరు సోషల్ మీడియాలో ప్రశ్నించగా.. నీ పెళ్లిలో నీ పిల్లలే డ్యాన్స్ చేస్తారంటూ మరికొందరు సెటైర్లు పేల్చారు. మొత్తంగా.. హార్దిక్ పాండ్యా తండ్రి కాబోతుండటంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా తలనొప్పిగా మారింది. ఫన్నీ మీమ్స్, జోకులు , సెటైర్లు హల్‌చల్ చేశాయి.

2016, జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన హార్దిక్ పాండ్యా.. ఇప్పటి వరకూ 11 టెస్టులు, 54 వన్డేలు, 40 టీ20 మ్యాచ్‌లాడాడు. అద్భుత ఆల్‌రౌండర్ విధ్వంసకర ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఈ క్రూరమైన పనులేంటి..? ఏనుగు మరణం కలిచివేస్తోంది: కోహ్లీ, రోహిత్

Story first published: Thursday, June 4, 2020, 14:37 [IST]
Other articles published on Jun 4, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+