న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆడుతుంది ధోనీ 2.0.. కొంచెం టైమ్ పడుతుంది: సౌరవ్ గంగూలీ

Sourav Ganguly says Dhoni will need time to get his touch back

దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్‌తో రీఎంట్రీ ఇచ్చిన భారత మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ అంచనాలను అందుకోలేకపోతున్నాడు. అటు బ్యాటింగ్, ఇటు కెప్టెన్సీలోనూ తన మార్క్‌ను చూపించడంలో తడబడుతున్నాడు. దాంతో సీఎస్‌కే వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. దీంతో ధోనీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే మహీకి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అండగా నిలిచాడు. ఏడాదిన్నర తర్వాత బ్యాట్‌ పట్టిన ధోనీ పూర్వ వైభవాన్ని అందుకోవడానికి కొంచెం టైమ్ పడుతుందని అన్నాడు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న దాదా.. మీడియాతో మాట్లాడాడు.

అంత సులువు కాదు..

అంత సులువు కాదు..

‘ధోనీ తన పూర్వ వైభవాన్ని అందుకోవడానికి కొంచెం సమయం పడుతుంది. ఏడాదిన్నర విరామం తర్వాత అతను మ్యాచ్‌లు ఆడుతున్నాడు. సుదీర్ఘ విరామం తర్వాత ఎంత ఫిట్‌గా ఉన్నా గతంలో మాదిరిగా ఆడటం అంత సులువు కాదు. దానికి కొంచెం టైమ్ పడుతుంది.'అని అన్నాడు. ఇక ధోనీ కెప్టెన్‌గా మంచి ఫామ్‌లో ఉన్న సమయంలో కామెంటేటర్‌గా ఉన్న తాను.. ధోనీని నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వెళ్లాలని సూచించానని గుర్తు చేసుకున్నాడు.

గ్రాండ్ ఫేర్‌వెల్ ఇవ్వాలి..

గ్రాండ్ ఫేర్‌వెల్ ఇవ్వాలి..

అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన ధోనీకి ఫేర్‌వెల్ మ్యాచ్‌ నిర్వహించాలనే అభిమానుల కోరికతో దాదా ఏకీభవించాడు. ‘ఆటకు వీడ్కోలు పలికిన రోజు ధోనీతో నేను మాట్లాడాను. ప్రస్తుతం ధోనీ బయో బబుల్‌లో ఉండటం వల్ల కలిసి మాట్లాడే అవకాశం లేదు. దేశం కోసం ఎన్నో ఘనతలు సాధించిన మహీకి ఘనమైన వీడ్కోలు దక్కాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల వల్ల భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఊహించలేం. గతంలో మాదిరిగా మీరు ఇక్కడికి వచ్చి ఆడాలని చెప్పలేం'అని దాదా చెప్పుకొచ్చాడు.

భారత్‌లో క్రికెట్‌ రిస్టార్ట్..

భారత్‌లో క్రికెట్‌ రిస్టార్ట్..

కరోనాతో దేశంలో స్తంభించిన క్రికెట్‌‌ను పున:ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నామని దాదా చెప్పుకొచ్చాడు. ‘అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు దేశవాళీ క్రికెట్‌ తిరిగి ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నాం. వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న ఇంగ్లం సిరీస్‌ను భారత్‌లోనే నిర్వహించేలా ప్రణాళికలు రచిస్తున్నాం. కరోనా పరిస్థితులతో దేశంలో సిరీస్‌లు జరగకపోతే యూఏఈలో నిర్వహిస్తామని చెప్పినప్పటికీ.. యూఏఈలో మూడు స్టేడియాలు మాదిరిగానే ముంబైలోనూ మూడు మైదానాలు ఉన్నాయి.

సీసీఐ, వాంఖడే, డీవై పాటిల్‌ స్టేడియాలు వాడుకోవచ్చు. ఇక్కడ కూడా బయోబబుల్‌ను నిర్వహించవచ్చు. కరోనా పరిస్థితుల్ని పర్యవేక్షిస్తున్నాం. దేశవాళీ క్రికెట్‌ను వీలైనంత తర్వగా ప్రారంభిస్తాం'అని దాదా పేర్కొన్నాడు. ఇక వచ్చే ఏడాది జనవరి-మార్చిలో ఇంగ్లండ్‌తో భారత్‌ ఐదు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సి ఉంది.

గంభీర్.. ధోనీ ముందు నువ్వో బచ్చాగాడివి.. మండిపడుతున్న ఫ్యాన్స్!

Story first published: Monday, September 28, 2020, 22:35 [IST]
Other articles published on Sep 28, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X