Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గంభీర్.. ధోనీ ముందు నువ్వో బచ్చాగాడివి.. మండిపడుతున్న ఫ్యాన్స్!

MS Dhoni Fans slam Gautam Gambhir for his latest tweet on Sanju Samson

హైదరాబాద్: టీమిండియా మాజీ ఓపెనర్, ప్రస్తుత బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్‌పై భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. ధోనీ ముందు గంభీర్ ఓ బచ్చాగాడంటూ ఘాటుగా కామెంట్ చేస్తున్నారు. ధోనీని ప్రశంసిస్తే గంభీర్‌కు ఎక్కడో కాలుతదని, అవకాశం దొరికితే విమర్శలు గుప్పించడానికి సిద్దంగా ఉంటాడని ఫైర్ అవుతున్నారు., ధోనీ పట్ల అణువణువు విద్వేశం పెంచుకున్నాడని ట్రోల్ చేస్తున్నారు.

ఇంతకీ విజయం ఏంటంటే..?

కింగ్స్‌ఎలెవన్ పంజాబ్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మన్ సంజూ శాంసన్‌ (42 బంతుల్లో 4ఫోర్లు, 7సిక్సర్లతో 85) ఆకాశమే హద్దుగా చెలరేగి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ మ్యాచ్‌ల్లో అదరగొట్టిన సంజూ శాంసన్‌పై యావత్ క్రికెట్ ప్రపంచం ప్రశంసల జల్లు కురుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ కేరళ క్రికెటర్.. టీమిండియా భవిష్యత్తు ధోనీ అంటూ కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ ప్రశంసించాడు. అయితే ఈ కాంగ్రెస్ ఎంపీ కామెంట్స్‌పై బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. మరొకరిలా అవ్వాల్సిన అవసరం సంజూ శాంసన్‌కు లేదని, అతనెప్పుడూ భారత క్రికెట్లో సంజూ శాంసన్‌గానే ఉండాలని గంభీర్ కౌంటర్ ఇచ్చాడు.

అవకాశం దొరికితే..

అంతేకాకుండా చెన్నై సూపర్ కింగ్స్ గత రెండు మ్యాచ్‌ల్లో ఓడటానికి ధోనీనే కారణమంటూ కూడా విమర్శలు గుప్పించాడు. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 217 పరుగుల లక్ష్యచేధనలో కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించాల్సిందిపోయి ఏడో స్థానంలో వచ్చాడని, అది ఏమాత్రం సమంజసం కాదని మండిపడ్డాడు. అంతకుముందు కూడా చాలా సార్లు మహీపై విమర్శలు గుప్పించాడు. 2011 ప్రపంచకప్ ధోనీ ఒక్క సిక్స్‌తోనే రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇవన్నీ మనసులో పెట్టుకున్న మహీ అభిమానులు.. సంజూశాంసన్‌ను ఉద్దేశించి గంభీర్ చేసిన తాజా కామెంట్స్‌ను అవకాశంగా తీసుకుంటూ విరుచుకుపడ్డారు.

గంభీర్.. కుళ్లుకోకు..

‘గంభీర్ .. ధోనీకి దక్కుతున్న గౌరవం పట్ల కుళ్లుకోకు. ధోనీ సాధించిందానిలో నువ్వు ఒక్క శాతం కూడా అందుకోలేదు. ధోనీ ముందు నువ్వో బచ్చాగాడివి. అతగా వాగకు. సంజూశాంసన్ స్పూర్తి పొందిందే ధోనీ నుంచి అనే విషయం గుర్తు పెట్టుకో'అని ఓ అభిమాని ఘాటుగా కామెంట్ చేశాడు. ‘ధోనీ పేరు వినిపిస్తే నీకు ఎక్కడో కాలుద్దిగా.. గంభీర్'అంటూ మరొకరు ఫన్నీమీమ్ ట్రెండ్ చేశారు. ‘గంభీర్.. మీరంటే నాకు గౌరవం. కానీ ఒకరని ఆదర్షంగా తీసుకోవడంలో తప్పు లేదు. సంజూ.. ధోనీ నుంచి స్పూర్తి పొందాడు. అతని సారథ్యంలో ఆడాలని కలలు కన్నాడు'అని మరొకరు కామెంట్ చేశారు.

ధోనీ పేరు కనబడితే చాలు..

ఇక ధోనీ పేరుతో ట్వీట్ కనబడితే చాలు గంభీర్ ఏగేసుకొని వస్తాడని మరొకరు ట్రోల్ చేశారు. ‘ధోనీ గురించి శాంసన్‌ను అడిగితే చెప్తాడు. మహీ నుంచి అతనెంతో స్పూర్తి పొందాడో. రిటైర్మెంట్ తర్వాత కూడా గంభీర్ తన విద్వేషాన్ని అనుచుకోవడం లేదు. భారత్‌లో ఇద్దరు వ్యక్తులంటే గంభీర్‌కు ఈర్ష్యా. క్రికెట్‌లో ధోనీ అయితే రాజకీయాల్లో కేజ్రీవాల్'అని మరొకరు గంభీర్ తీరును విమర్శించారు.

Story first published: Monday, September 28, 2020, 18:28 [IST]
Other articles published on Sep 28, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+