న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నాలుగో నెంబర్ చర్చ చిరాకు తెప్పిస్తోంది: శ్రేయస్ అయ్యర్

Shreyas Iyer Says The number four debate gets irritating sometimes


ముంబై: పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో టీమిండియాను వెంటాడిన సమస్య నాలుగో నంబర్. మాజీ క్రికెటర్ యువరాజ్‌ సింగ్ తర్వాత ఆస్థాయి బ్యాట్స్‌మన్ టీమిండియాకు దొరుకలేదు. నాలుగో నంబర్ కోసం టీమిండియా మేనేజ్‌మెంట్ చేయని ప్రయోగాలు లేవు, పరీక్షించని బ్యాట్స్‌మెన్ లేడు. ఏకంగా తొమ్మిది మంది బ్యాట్స్‌మెన్ నాలుగులో నిలదొక్కుకోవడంలో విఫలమయ్యారు. ఈ సమస్యతోనే వన్డే ప్రపంచకప్ సెమీస్‌లో ఓటమిని చవిచూశారు. ఈ ఓటమితో గుణపాఠం నేర్చుకున్న భారత టీమ్‌మేనేజ్‌మెంట్ యువ ఆటగాళ్లను పరీక్షించింది. చివరకు శ్రేయస్ అయ్యర్ రూపంలో ఈ సమస్యకు పరిష్కారం లభించింది.
నాలుగు కీలకం..

నాలుగు కీలకం..

క్రికెట్‌లో ఏ జట్టుకైనా నాలుగో స్థానం ఎంతో కీలకం. టాప్‌ఆర్డర్‌ బాగా ఆడితే అదే ఊపును ముందుకు తీసుకెళ్లాలి. ఒకవేళ విఫలమైతే ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యతను భుజాన వేసుకోవాలి. మ్యాచ్‌ పరిస్థితులను అర్థం చేసుకోవడమే కాకుండా.. మిడిల్‌, లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌తో రాణించాలి. ఇక అత్యంత నిలకడ కూడా ముఖ్యమే. వీటన్నింటికీ సరిపోతానని శ్రేయస్ నిరూపించాడు. సౌతాఫ్రికా, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌తో జరిగిన పరిమిత ఓవర్లలో అయ్యర్ బాధ్యతాయుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. న్యూజిలాండ్‌లో టాపార్డర్ విఫలమైన వేళ సెంచరీతో రాణించాడు.

ఆడకుండా ఫైనల్ చేరడం కంటే.. ఓడిపోవడమే మంచిది: సౌతాఫ్రికా కెప్టెన్

నేనొక్కడినే కాదు..

నేనొక్కడినే కాదు..

అయితే ఈ నాలుగో నెంబర్ చర్చ తనకు చిరాకు తెప్పిస్తుందని ఈ యువ బ్యాట్స్‌మన్ తాజాగా చెప్పుకొచ్చాడు. టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏ స్థానంలోనైనా ఆడటానికి తాను సిద్ధమని తెలిపాడు. ‘నిజంగా ఈ చర్చ నాకు చిరాకు తెప్పిస్తోంది. నెంబర్ 4లో బ్యాటింగ్ చేయగల బ్యాట్స్‌మన్ నేనొక్కడినే కాదు. అనువైన, అనుభవం కలిగిన బ్యాట్స్‌మన్ అనే పదాలు వాడాలి. ఇవి కేవలం ఫ్యాన్సీ వర్డ్స్ మాత్రమే కాదు.. చదవడానికైనా, త్వరగా మరిచిపోవడానికి ఉపయోగ పడే పదాలు. క్రికెటర్‌గా ఎదిగిన నేను టాపార్డర్, మిడిలార్డర్ మధ్య ప్రతీ స్థానంలో బ్యాటింగ్ చేశా.'అని అయ్యర్ గుర్తు చేశాడు.

సౌకర్యవంతంగా ఉన్నా..

సౌకర్యవంతంగా ఉన్నా..

ఒకవేళ ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయమన్నా ఆడేందుకు సిద్ధంగా ఉండాలని ఈ 25 ఏళ్ల క్రికెటర్ చెప్పుకొచ్చాడు. మిడిలార్డర్ అనే అంశం చర్చకు రావాలి కానీ, నెంబర్ 4 కాదన్నాడు. అయితే ప్రస్తుత జట్టులో నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయడానికి తాను సౌకర్యవంతంగా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. గొప్ప బ్యాట్స్‌మన్ విఫలమైన ప్లేస్‌లో ఆడుతున్నానని తానేప్పుడు అనుకోలేదని, ప్రస్తుతం నాలుగో స్థానాన్ని ఆస్వాదిస్తున్నానని తెలిపాడు. ఏ స్థానంలో ఆడినా జట్టు అవసరం కొరకే ఆడాలని, పరిస్థితులను పరిగణలోకి తీసుకొని మెదులుకోవాలన్నాడు.

Story first published: Friday, March 6, 2020, 14:12 [IST]
Other articles published on Mar 6, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X