న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బాబర్ అజామ్ గంగిరెద్దులా కనిపిస్తున్నాడు.. పాక్ ఓటమిపై షోయబ్ అక్తర్ ఫైర్

Shoaib Akhtar Says Babar Azam looks like a lost cow after T20I defeat against England

కరాచీ: పాకిస్థాన్ పరిమిత ఓవర్ల కెప్టెన్ బాబర్ అజామ్ గంగిరెద్దులా కనిపిస్తున్నాడని ఆ జట్టు మాజీ పేసర్ షోయబ్ అక్తర్ విమర్శించాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో పాకిస్తాన్‌ 5 వికెట్లతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ పరాజయంపై తన యూట్యూబ్ చానెల్ వేదికగా స్పందించిన అక్తర్.. టీమ్ కెప్టెన్‌తో సహా మెనేజ్‌మెంట్‌పై విమర్శలు గుప్పించాడు. ఆటగాళ్లు, కెప్టెన్, టీమ్ మేనేజ్‌మెంట్ అంతా అయోమయంలో ఉన్నారని మండిపడ్డాడు.

నాయకత్వ లక్షణాలే లేవు..

నాయకత్వ లక్షణాలే లేవు..

‘బాబర్ అజామ్ నాకు గంగిరెద్దులా కనిపిస్తున్నాడు. అతనికి ఎలాంటి నాయకత్వ లక్షణాలు లేవు. కెప్టెన్‌గా మైదానంలో ఏం చేయాలో కూడా తెలియడం లేదు. ఎవరు ఏది చెబితే దానికి తలూపుతున్నాడు. అతను సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరం. అలా చేస్తేనే భవిష్యత్తులో అతను మంచి కెప్టెన్ అవుతాడు. జీవితాంతం కెప్టెన్‌గా ఉండే అవకాశం రాదనే విషయాన్ని బాబర్ గ్రహించాలి. ప్రస్తుతం వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.

ఇన్ సెక్యూర్ బబుల్‌లో..

ఇన్ సెక్యూర్ బబుల్‌లో..

పాకిస్థాన్ జట్టు బయో సెక్యూర్ బబుల్‌లో కాకుండా ఇన్ సెక్యూర్‌ బబుల్‌లో ఆడుతుంది. ప్రతీ ఆటగాడు ఆభద్రతా భావంలో ఉన్నాడు. ఏ ఒక్కరికి మంచి కెప్టెన్, గొప్ప ఆటగాళ్లుగా ఎదగడం ఎలానో తెలియదు. జట్టు ఎంపిక గందరగోళం.. మేనేజ్‌మెంట్ గందరగోళం.. కెప్టెన్ అయోమయం.. జట్టు మొత్తం కన్ఫ్యూజన్. ప్రతీ ఒక్కరు అయోమయం. జట్టు అంటే ఇలా కాదు. ఓ ప్రణాళిక, వ్యూహంతో బరిలోకి దిగాలి. తదుపరి మ్యాచ్‌కైనా అలా చేయండి'అని అక్తర్ నిప్పులు చెరిగాడు.

చెలరేగిన బాబర్, హఫీజ్..

చెలరేగిన బాబర్, హఫీజ్..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీ 20 ఓవర్లలో 4 వికెట్లకు 195 పరుగులు చేసింది. ఆ జట్టులో బాబర్ అజామ్ (44 బంతుల్లో 7ఫోర్లు 56), మహ్మద్ హఫీజ్(36 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు 69), ఫకార్ జమాన్(22 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ 36) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ రెండు వికెట్లు తీయగా.. క్రిస్ జోర్డాన్, టామ్ కరన్ తలో వికెట్ తీశారు. ఇక ఈ మ్యాచ్‌తో బాబర్ టీ20ల్లో వేగంగా (39 ఇన్నింగ్స్‌ల్లో) 1500 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ, ఆరోన్ ఫించ్‌ సరసన నిలిచాడు.

రఫ్ఫాడించిన మోర్గాన్, మలాన్..

రఫ్ఫాడించిన మోర్గాన్, మలాన్..

భారీ లక్ష్య చేధనకు దిగిన ఇంగ్లండ్.. కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్ ‌(33 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 66) ధనాధన్ ఇన్నింగ్స్‌కు డేవిడ్‌ మలాన్‌ ( 36 బంతుల్లో 6x4, 1x6 54 నాటౌట్‌;) అజేయ హాఫ్ సెంచరీ తోడవడంతో 19.1 ఓవర్లలో 5 వికెట్లకు 199 పరుగులు చేసి 5 బంతులు మిగిలిఉండగానే గెలుపొందింది. ఓపెనర్లు జానీ బెయిర్‌స్టో (44), టామ్ బాంటన్‌ (20) కూడా రాణించారు. ఈ విజయంతో ఇంగ్లండ్‌ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దవగా.. చివరి టీ20 మంగళవారం జరుగుతుంది.

ఐపీఎల్ 2020 మొత్తానికే జరగకపోతే ఏం చేస్తారు..? ఫ్రాంచైజీలపై బీసీసీఐ ఫైర్!

Story first published: Monday, August 31, 2020, 17:31 [IST]
Other articles published on Aug 31, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X