న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ 2020 మొత్తానికే జరగకపోతే ఏం చేస్తారు..? ఫ్రాంచైజీలపై బీసీసీఐ ఫైర్!

IPL 2020: What if there was no cash rich league this year, Senior BCCI official slams franchises for being money-minded

దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్ నిర్వహణ విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి అడుగడుగున ఆటంకాలే ఎదురవుతున్నాయి. తొలుత కరోనా మహమ్మారితో లీగ్ నిరవధికంగా వాయిదా పడగా.. ఆ వెంటనే టీ20 ప్రపంచకప్‌తో సందిగ్ధతనెలకొంది. బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ చాకచక్యంగా వ్యవహరించడంతో టీ20 ప్రపంచకప్ కాస్తా వాయిదా పడింది. దీంతో భారత క్యాష్ రిచ్ లీగ్‌కు మార్గం సుగుమమైంది. అంతలోనే దేశంలో పెరిగిన కరోనా కేసులతో సవాల్ ఎదురైంది. దీంతో ఈ లీగ్‌ను దుబాయ్‌కు తరలించారు.

జరుగుతుందా..? లేదా..?

జరుగుతుందా..? లేదా..?

ఇక ఏ అడ్డంకి లేదని ఊపిరిపీల్చుకుంటున్న క్రమంలో చైనా వస్తు బహిష్కసెగ ఇబ్బందుల్లో పడేసింది. ఈ కారణంగా బోర్డుకు బంగారు బాతైన వివో టైటిల్ స్పాన్సర్ నుంచి తప్పుకోవడం బీసీసీఐని ఆర్థికంగా దెబ్బతీసింది. ఆ నష్టాన్ని ఎలాగోలా డ్రీమ్ 11తో పూడ్చుకొని ఐపీఎల్‌కు తెరలేపుదామనుకుంటున్న సమయంలో చెన్నై సూపర్ కింగ్స్‌ ఆటగాళ్లకు కరోనా సోకడం కలకలం రేపింది. దానికి తోడు వ్యక్తిగత కారణాలతో సురేశ్ రైనా తప్పుకోవడంతో ఇప్పుడు లీగ్ జరుగుతుందా? లేదా? అనే సందేహం ప్రతీ ఒక్కరికి కలుగుతోంది.

నష్టపరిహారం కోసం ఫ్రాంచైజీలు..

నష్టపరిహారం కోసం ఫ్రాంచైజీలు..

అయితే ఫ్రాంచైజీలు మాత్రం నష్టపరిహారం చెల్లించాలని బీసీసీఐని డిమాండ్ చేస్తున్నాయి. లీగ్ దుబాయ్‌కు తరలించడంతో తాము ఆర్థికంగా తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఆ నష్టాన్ని బీసీసీఐనే పూడ్చాలని మొదటి నుంచి కోరుతున్నాయి. అయితే ఎలాంటి నష్టపరిహారం చెల్లించమని బోర్డు ఇప్పటికే స్పష్టం చేసింది. అయినా ఫ్రాంచైజీలు పదే పదే ఆ విషయాన్ని ప్రస్తావించడంపై బోర్డు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బీసీసీఐకి చెందిన ఓ అధికారి ఈ వ్యవహారంపై టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ ఫ్రాంచైజీలపై నిప్పులు చెరిగాడు. అసలు ఐపీఎల్ జరగకపోతే ఏం చేస్తారని మండిపడ్డాడు.

మా ఖర్చులు ఎవరు భరించాలి..?

మా ఖర్చులు ఎవరు భరించాలి..?

‘ఫ్రాంచైజీలు చాలా మూర్ఖంగా వ్యవహరిస్తున్నాయి. అసలు ఈ ఏడాది ఐపీఎల్ మొత్తానికే జరగకపోతే ఏం చేస్తారు. ఇతర మార్గాల్లో ఏమైనా డబ్బు సంపాదిస్తారా? వారు అడుగుతున్న ప్రశ్నల్లానే మా దగ్గర కొన్ని ఉన్నాయి. బీసీసీఐ నియమించి ఏజెన్సీలకు ఎవరు డబ్బులు చెల్లించాలి? మ్యాచ్ నిర్వహణ ఖర్చులు ఎవరు భరించాలి? ప్రాక్టీస్ సేషన్ కోసం అయ్యే ఖర్చులు ఎవరు పెట్టుకుంటారు? ఇప్పటికే బోర్డు ఎలాంటి నష్టపరిహారం చెల్లించదని స్పష్టం చేసింది. అయినా మళ్లీ అవే ప్రశ్నలు. డిమాండ్లు'అంటూ సదరు అధికారి ఫ్రాంచైజీల తీరుపై అసహనం వ్యక్తం చేశాడు.

ఒక్కో ఫ్రాంచైజీకి రూ.150 కోట్లు..

ఒక్కో ఫ్రాంచైజీకి రూ.150 కోట్లు..

ఈ సీజన్ ఐపీఎల్ జరిగితే ప్రతీ ఫ్రాంచైజీ రూ.150 కోట్లు సంపాదించుకోనున్నాయని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. ప్రతీ పైసా గురించి రచ్చ చేయడం మానేసి.. కరోనా బాధితులకు సాయం చేయాలని సూచించింది. ‘దేశంలో కరోనా బాధితుల కోసం ఏదైనా సాయం చేయాల్సిందిపోయి.. డబ్బుల సంపాదన గురించి ఆలోచిస్తున్నారు. ఈ సీజన్ జరిగితే ప్రతీ ఫ్రాంచైజీ రూ.150 కోట్లు వెనకేసుకోనుంది. అయినా అసంబద్దమైన డిమాండ్లతో రచ్చ చేస్తున్నారు.'అని మరో బీసీసీఐ అధికారి అన్నారు. అయితే ఫ్రాంచైజీలు ఆదిశగా ఆలోచించకున్నా.. ఓ బోర్డు అధికారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం వివాదాలు సృష్టిస్తున్నాడని ఆరోపించారు.

రైనాకు విజయ గర్వం తలకెక్కింది.. అతని నిష్క్రమణతో మాకు వచ్చే నష్టమేం లేదు: శ్రీనివాసన్

Story first published: Monday, August 31, 2020, 15:08 [IST]
Other articles published on Aug 31, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X