న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

యూవీ, భజ్జీ నా బెస్ట్ ఫ్రెండ్స్.. టీమిండియాకు కోచ్‌గా పనిచేస్తా: అక్తర్

 Shoaib Akhtar open to India bowling coach role
Shoaib Akhtar Wants To Be Team India's Bowling Coach | Oneindia Telugu

కరాచీ: అవకాశమిస్తే భారత క్రికెట్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా సేవలందించేందుకు తాను సిద్దమని పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ తన మనసులోని మాటను బయటపెట్టాడు. తాజాగా హలో మొబైల్ యాప్‌ లైవ్ సెషన్‌లో మాట్లాడిని ఈ రావల్పిండి ఎక్స్‌ప్రెస్ అభిమానులతో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
తన అనుభవాన్ని పంచుకునేందుకు తాను సుముఖంగా ఉన్నానని, తన టాలెంట్ ఉపయోగించి ప్రతిభావంతులైన ఫాస్ట్ బౌలర్లను తయారు చేయడానికి కృషి చేస్తానని తెలిపాడు.

కేకేఆర్ కోచ్‌గా..

కేకేఆర్ కోచ్‌గా..

భారత క్రికెట్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా చేస్తారా? అని ఓ అభిమాని అక్తర్‌ను ప్రశ్నించగా.. చాన్స్ ఇస్తే ఖచ్చితంగా చేస్తానని అక్తర్ సమాధానమిచ్చాడు. ‘టాలెంట్ పంచడమే నా పని. ఇప్పుడున్న బౌలర్ల కన్నా మరింత దూకుడు, వేగం ఉన్న బౌలర్లను సిద్దం చేస్తా. అంతేకాదు తనకు అవకాశం వస్తే 'కోల్‌కతా నైట్ రైడర్స్ కోచ్' గా చేయాలనుకుంటున్నా.'అని ఈ ఫాస్టెస్ట్ బౌలర్ చెప్పుకొచ్చాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభ సీజన్ లో అక్తర్ కోల్‌కతా నైట్‌రైడర్స్ తరపున బరిలోకి దిగిన విషయం తెలిసిందే.

 నా బయోపిక్‌లో అతనే హీరో..

నా బయోపిక్‌లో అతనే హీరో..

ఒకవేళ తనపై బయోపిక్ రూపొందితే.. అందులో ప్రధాన పాత్రలో ఎవరు నటించాలని ఓ అభిమాని అక్తర్‌ను ప్రశ్నించాడు. దీనికి ఈ రావల్పిండి ఎక్స్‌ప్రెస్ ఆసక్తికర సమాధానమిచ్చాడు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తన బయోపిక్‌లో హీరోగా నటించాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.

భజ్జీ, యూవీ నా బెస్ట్ ఫ్రెండ్స్..

భజ్జీ, యూవీ నా బెస్ట్ ఫ్రెండ్స్..

భారత్-పాక్ ధ్వైపాక్షిక సిరీస్‌ల కారణంగా ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య స్నేహం ఏర్పడిందని అక్తర్ తెలిపాడు. భారత జట్టులో సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్, మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తనకు మంచి స్నేహితులని చెప్పుకొచ్చాడు. ఇక సచిన్ టెండూల్కర్ కన్నా టీమిండియా వాల్ రాహుల్ ద్రవిడ్‌కు బౌలింగ్ చేయడం చాలా కష్టమన్నాడు. పాకిస్థాన్ తరఫున అన్ని ఫార్మాట్లలో కలిపి 224 మ్యాచ్‌లు ఆడిన అక్తర్ 444 వికెట్ల పడగొట్టాడు. ఇక ప్రపంచంలో అత్యంత వేగవంతమైన బౌలర్‌గా గుర్తింపు పొందాడు. 2003 ప్రపంచకప్‌లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అత్యంత వేగవంతమైన బాల్ వేసిన రికార్డు అక్తర్ పేరిట ఉంది.

కరోనా ఎఫెక్ట్: భారత స్టార్ ప్లేయర్లు కాస్త రైతు కూలీలుగా..

Story first published: Tuesday, May 5, 2020, 10:00 [IST]
Other articles published on May 5, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X