న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

షార్జా వేదికగా పాకిస్థాన్‌తో మ్యాచ్ అంటే భారత ఆటగాళ్లు గజ్జున వణికేవారు: షోయబ్ అక్తర్

Shoaib Akhtar on difference between India and Pakistan cricket teams

కరాచీ: భారత జట్టు 1990 చివర్లో షార్జా వేదికగా పాకిస్థాన్‌తో మ్యాచ్ అంటే భయపడేదని ఆ జట్టు మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అన్నాడు. ఒకానొక దశలో భారత క్రికెట్ జట్టు పాకిస్థాన్ టీమ్‌లా ఉండాలనుకుందని కూడా చెప్పాడు. కానీ ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా తలకిందులయ్యాయని, భారత్ వరల్డ్ నెంబర్ వన్ జట్టుగా ఎదిగితే పాక్ క్రికెట్ పాతాళానికి పడిపోయిందని ఈ రావల్పిండి ఎక్స్‌ప్రెస్ పేర్కొన్నాడు. భారత జట్టును సరైనవారు లీడ్ చేస్తే.. పాకిస్థాన్ క్రికెట్‌ను మాత్రం యావరేజ్ వ్యక్తులు నడిపించారని, అదే నష్టం చేకూర్చిందని అభిప్రాయపడ్డాడు. తాజాగా 'క్రికెట్ పాకిస్థాన్' యూట్యూబ్ షో‌లో పాల్గొన్న ఈ వరల్డ్ ఫాస్టెస్ట్ పేసర్.. ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

భారత ఆటగాళ్లు చేతులెత్తేసారు..

భారత ఆటగాళ్లు చేతులెత్తేసారు..

‘మీరు ఎప్పుడూ లోపాలనే ఎత్తిచూపాలని ఎందుకు ప్రయత్నిస్తారు..? మీరు పాక్ క్రికెట్‌ను మార్చవచ్చు కదా..? అని చాలా మంది నన్ను ప్రశ్నిస్తుంటారు. అయితే ఒకానొక సమయంలో భారతీయులు పాకిస్థాన్ ఆటగాళ్లలా ఉండాలనుకున్నారు. కానీ ఇప్పుడు పాకిస్థాన్ జట్టే భారత టీమ్‌లా ఉండాలనుకుంటుంది. 1990 చివర్లో అయితే షార్జా వేదికగా పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడమని భారత ఆటగాళ్లు చేతులెత్తేసారు.

 అదే పాక్ కొంప ముంచింది..

అదే పాక్ కొంప ముంచింది..

యావరేజ్ పీపుల్ పాకిస్థాన్ క్రికెట్‌ను లీడ్ చేయడంతో మన ఆటగాళ్లు ఆలోచనా దృక్పథాన్ని మార్చేసింది. వారు సాధారణమైన ఆటగాళ్లను కెప్టెన్‌‌లుగా నియమించారు. భారత జట్టునే చూడండి. వాళ్లకి విరాట్ కోహ్లీ వంటి దూకుడైన ఆటగాడు కెప్టెన్‌గా ఉన్నాడు. అలాంటి ఆటగాడు మనకెవరున్నారు?'అని ప్రశ్నించాడు. అయితే చీఫ్ సెలెక్టర్ పదవి కోసం అక్తర్‌ను పీసీబీ సంప్రదించిందంట కదా? అని ప్రశ్నించగా.. తనను ఎవరూ అప్రోచ్ కాలేదన్నాడు.

జట్టు మేలు కోసం..

జట్టు మేలు కోసం..

‘నేను అయినా ఇంకెవరైనా.. చీఫ్ సెలెక్టర్‌గా ఆటగాళ్ల ఆలోచనా దృక్పథం మార్చడం ముఖ్యం. వారిలో ఆత్మవిశ్వాసం రెట్టింపు చేయాలి. ఆటగాళ్లలో దాగి ఉన్న ప్రతిభను వెతికి తీసి ప్రోత్సహించాలి. మ్యాచ్‌కు తగ్గ ప్రణాళికలు రచించాలి. జట్టు మేలు కోసం ప్రయత్నించాలి. ఆటగాళ్లను ఎంపిక చేసే విషయంలో సాధారణ ప్రజలు ఏమనుకుంటున్నారనేది నాకు తెలియదు. కానీ సెలెక్టర్ అనేవాడు ముక్కు సూటిగా, నిజాయితీగా ఉండాలి. జట్టుకు తగిన ఆటగాళ్లను తీసుకోవాలి'అని అభిప్రాయపడ్డాడు.

భారతీయుడనే ద్వేషమే కదా..

భారతీయుడనే ద్వేషమే కదా..

ఇక విరాట్ కోహ్లీని ప్రశంసిస్తే తనపై ఎందుకు నోరుపారేసుకుంటారని విమర్శకులను అక్తర్ ప్రశ్నించాడు. ‘నేను భారత ఆటగాళ్లను, విరాట్ కోహ్లీని ఎందుకు ప్రశంసించకూడదు? కోహ్లీ వంటి స్టార్ ప్లేయర్ పాకిస్తాన్‌లో కానీ, లేక ప్రపంచవ్యాప్తంగానైనా ఎవరైనా ఉన్నారా? కనీసం అతనికి దగ్గరగా ఉన్న ఆటగాడి పేరైనా చెప్పండి .? ప్రజలు ఎందుకు కోపంగా ఉన్నారో నాకైతే తెలియదు. వారు నన్ను విమర్శించే ముందు గణాంకాలను పరిశీలించాలి. కోహ్లీ భారతీయుడు కాబట్టి, అతన్ని ప్రశంసించవద్దనే ద్వేషాన్ని దృష్టిలో పెట్టుకోవాలని అనుకుంటున్నారా...? అని ఈ వరల్డ్ ఫాస్టెస్ట్ పేసర్ ప్రశ్నించాడు.

CSKకు గట్టి షాక్.. ఐపీఎల్ 2020 సీజన్ నుంచి హర్భజన్ సింగ్ ఔట్!

Story first published: Friday, September 4, 2020, 16:29 [IST]
Other articles published on Sep 4, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X