న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భార్యా, పిల్లలున్నారని బౌన్సర్లతో గాయపర్చవద్దని భారత ఆటగాళ్లు వేడుకునేవారు: అక్తర్

Shoaib Akhtar Claims Indian Tail-Enders Begged Him To Get Them Out, But Not Hit Them

కరాచీ: 'ఏమీలేనమ్మకు ఏతులు ఎక్కువ'అన్నట్లు ఉంది పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ తీరు. వినోటోడు ఉంటే నోరుకు అడ్డు అదుపులేకుండా ముచ్చట్లు చెబుతాడు ఈ పాక్ మాజీ పేసర్. ఇప్పటికే తన బౌలింగ్ ఆడాలంటే సచిన్ భయపడేవాడని గొప్పలు చెప్పుకొని తీవ్ర విమర్శల పాలైన అక్తర్.. తాజాగా భారత ఆటగాళ్లపై ఇదే తరహాలో మరోసారి నోరు పారేసుకున్నాడు. అతని బౌలింగ్ ఆడాలంటే టెయిలండర్లు గజ్జున వణికేవాళ్లని, భారత ఆటగాళ్లు అయితే భార్యా, పిల్లలున్నారని, బౌన్సర్లతో గాయపర్చవద్దని వేడుకునేవారని తెలిపాడు. తాజాగా పాకిస్థాన్ జర్నలిస్ట్ సవేరా పాషా యూట్యూబ్ షో 'క్రిక్‌కాస్ట్‌'లో పాల్గొన్న అక్తర్ ఇలాంటి ఏతుల ముచ్చట్లు మస్త్ చెప్పుకొచ్చిండు. ఒకసారి ఇంగ్లండ్‌లో కౌంటీ క్రికెట్‌ ఆడుతుండగా, ఒక ఇంగ్లీష్‌ బ్యాట్స్‌మన్‌ వద్దని చెప్పినా తనతో బౌలింగ్‌ వేయించుకొని గాయపడ్డాడని తెలిపాడు.

అడిగి మరి గాయపడ్డాడు..

అడిగి మరి గాయపడ్డాడు..

‘చీకటి పడుతుంది ఇప్పుడొద్దని చెప్పినా అతను వినలేదు. దాంతో చేసేది లేక నేనొక బంతి విసిరాను. అది అతడి దవడకు తగిలి గాయమైంది. వెంటనే అతడు వికెట్ల మీదే పడిపోయాడు. అలా పడిపోయేసరికి ఆ బ్యాట్స్‌మన్‌ చనిపోయాడని అనుకున్నా. అలాంటి ఘటనలు చాలా జరిగాయి, అవి జరిగినప్పుడల్లా అలా అవ్వాల్సింది కాదని బాధపడేవాడిని. అలాగే దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ గ్యారీ కిర్‌స్టెన్‌ కూడా ఒకసారి నా బౌలింగ్‌తో దెబ్బ తగిలించుకున్నాడు. నన్ను కలిసినప్పుడల్లా అతడి కంటి కింద ఉండే గాయం మరకను చూపిస్తాడు' అని అక్తర్‌ చెప్పుకొచ్చాడు.

ప్లీజ్ గాయపర్చవద్దు..

ప్లీజ్ గాయపర్చవద్దు..

భారత ఆటగాళ్లు, ఇతర టెయిలండర్స్ గాయపర్చవద్దని వేడుకునేవారని తెలిపాడు. ‘కొంత మంది భారత ఆటగాళ్లు, ఇతర టెయిలెండర్స్..‘కావాలంటే మమ్మల్ని ఔట్‌ చేసుకో.. కానీ, బంతితో గాయపర్చకు. ఎందుకంటే నీ బంతులు చాలా బలంగా తగులుతాయి. మాకు భార్యాపిల్లలు ఉన్నారు. అలాగే మా తల్లిదండ్రులు చూస్తే బాధపడతారు'అని నాతో వేడుకునేవారు.'అని అక్తర్ చెప్పుకొచ్చాడు.

మురళీధరన్ వేళ్లు విరగ్గొట్టాలని..

మురళీధరన్ వేళ్లు విరగ్గొట్టాలని..

శ్రీలంక స్పిన్‌ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌ కూడా అంతేనని, తాను బంతులేస్తే ఆడకుండా పక్కకు తప్పుకునేవాడని చెప్పాడు. అయితే తన సహచర ఆటగాడు మహ్మద్ యూసఫ్ మాత్రం బౌన్సర్లతో మురళీ ముఖం మీద దాడి చేయమనేవాడని, మురళీ భయపడ్డా వెనకడుగు వేయవద్దని చెప్పేవాడని గుర్తు చేసుకున్నాడు. ‘యూసఫ్ తరుచూ మురళీని గాయపర్చమనేవాడు. ఆటకు పనికిరాకుండా అతని వేళ్లను విరగ్గొట్టమనేవాడు. నేను రెండు బౌన్సర్లు వేయగానే మురళి నాదగ్గరకు వచ్చి బౌన్సర్లు వేయవద్దని చెప్పాడు. తాను చాలా సున్నితమని చెప్పేవాడు. నేను కూడా కొంచెం షైగా ఫీలయ్యేవాడిని. కానీ యూసఫ్ మాత్రం అతనిపై దాడిచేయమనేవాడు'అని అక్తర్ చెప్పుకొచ్చాడు.

 అంత సీన్ లేదు కానీ..

అంత సీన్ లేదు కానీ..

అయితే అక్తర్ చెప్పేంత సీన్ ఏం జరగలేదు.. కానీ అతను మాత్రం ఫాస్టెస్ట్ బౌలర్. ఇప్పటి అతని రికార్డు చెక్కు చెదరకుండా ఉంది. 2003 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ జరిగిన మ్యాచ్‌లో ఈ రావల్సిండి ఎక్స్‌ప్రెస్ గంటకు 161.3 కీలోమీటర్ల వేగంతో బంతిని విసిరి రికార్డు సృష్టించాడు. కెరీర్ ప్రారంభంలో అక్తర్ బౌలింగ్‌లో కొంత తడబడినా తర్వాత బ్యాట్స్‌మన్ చెడుగుడు ఆడారు. టెయిలండర్లు కూడా అతని వేగాన్ని ఉపయోగించుకొని సులువుగా బౌండరీలు సాధించేవారు. ఇక సచిన్, సెహ్వాగ్, ద్రవిడ్ అయితే అక్తర్ బౌలింగ్‌ను చితక్కొట్టారు.

యువరాజ్ సింగ్‌కు మళ్లీ పిలుపు..!

Story first published: Saturday, August 15, 2020, 17:25 [IST]
Other articles published on Aug 15, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X