న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అక్తర్‌ను చూసి సచిన్ భయపడేవాడు.. అతను ఈ విషయాన్ని ఎప్పటికీ ఒప్పుకోడు: అఫ్రిది

Shahid Afridi Says Sachin Tendulkar won’t accept he was scared to face Shoaib Akhtar

కరాచీ : పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది మరోసారి భారత్‌ ఆటగాళ్లపై తన అక్కసును వెళ్లగక్కాడు. భారత్ అంటేనే అణువణువునా విద్వేషం పెంచుకున్న ఈ పాక్ క్రికెటర్ అవకాశం వచ్చిన ప్రతీసారి విషం చిమ్ముతూనే ఉంటాడు. ఇటీవలే.. పాక్ చేతిలో చిత్తుగా ఓడిన భారత ఆటగాళ్లు తమపై దయచూపమని కోరేవారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ కామెంట్స్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన భారత అభిమానులు.. గత 15 ఏళ్ల గణంకాలను ప్రస్తావిస్తూ పాక్‌ చేతిలో భారత్ ఎన్నిసార్లు ఓడిందో చెప్పాలంటూ నిలదీశారు. కరోనాతో అఫ్రిదికి ఉన్న మతిపోయినట్లుందని మండిపడ్డారు.

షోయబ్ బౌలింగ్‌కు సచిన్ వణికేవాడు..

షోయబ్ బౌలింగ్‌కు సచిన్ వణికేవాడు..

ఇక తాజాగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. లెజెండరీ బ్యాట్స్‌మన్ అయిన సచిన్.. పాక్ పేసర్ షోయబ్ అక్తర్‌ను చూసి భయపడేవాడని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఈ విషయాన్ని మాస్టర్ ఎప్పటికీ అంగీకరించడని చెప్పాడు. షోయబ్‌ను సచిన్ ఎదుర్కొటున్నప్పుడు తాను కవర్స్‌లోనో, మిడాఫ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గమనించేవాడినని, అప్పుడు సచిన్ భయపడడాన్ని తాను చూశానని పాక్ జర్నలిస్ట్ జైనాబ్ అబ్బాస్‌‌కు ఇచ్చిన యూట్యూబ్ ఇంటర్వ్యూలో తెలిపాడు.

ఫీల్డింగ్ చేస్తూ చూసా..

ఫీల్డింగ్ చేస్తూ చూసా..

‘మైదానంలో మీడాఫ్, కవర్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు బ్యాట్స్‌మన్ బాడీలాంగ్వేజ్ ఇట్టే పసిగట్టవచ్చు. బ్యాట్స్‌మన్ ఒత్తిడిలో ఉన్నాడా? లేడా? అనే విషయం కూడా తెలుస్తుంది. అయితే షోయబ్‌ను చూసిన ప్రతీసారి సచిన్ భయపడేవాడని నేను అనలేదు. అక్తర్ భీకరమైన కొన్ని స్పెల్స్ చూసి సచిన్‌తో సహా ప్రపంచంలోని దిగ్గజ ఆటగాళ్లు కూడా వణికేవారని మాత్రమే చెప్పా.'అని ‘అక్తర్ బౌలింగులో సచిన్ భయపడేవాడన్న 2011 నాటి వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నారా?'అని జైనాబ్ అబ్బాస్ అడిగిన ప్రశ్నకు అఫ్రిది బదులిచ్చాడు.

అక్తర్ పుస్తకంలో..

అక్తర్ పుస్తకంలో..

ఇక 2011లో షోయబ్ అక్తర్ తన రాసిన ‘కాంట్రవర్సియల్లీ యువర్స్'అనే బుక్‌లో తన బౌలింగ్‌కు సచిన్ భయపడ్డాడని పేర్కొన్నాడు. అయితే అక్తర్ ప్రస్తావించింది వాస్తవమేనని, షోయబ్‌ను చూసి సచిన్ భయపడటం తాను చూసానని అప్పట్లో అఫ్రిది వ్యాఖ్యానించాడు. అంతేకాకుండా 2011 ప్రపంచకప్‌లో యువ స్పిన్నర్ సయీద్ అజ్మల్ బౌలింగ్‌కు కూడా సచిన్ భయపడ్డాడనని అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయితే అది ఏమాంత పెద్ద విషయం కాదని, ఆటగాళ్లు ఒత్తిడికి లోనైనప్పుడు ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటారని అఫ్రిది చెప్పుకొచ్చాడు.

అక్తర్-సచిన్ హోరాహోరీ..

అక్తర్-సచిన్ హోరాహోరీ..

ఇక మైదానంలో అక్తర్-సచిన్ మధ్య పోరు 1990-2000 అభిమానులకు సుపరిచితమే. పాక్ పేసర్ బౌలింగ్‌ను సచిన్ చీల్చిచిండాడటం.. రావల్పిండి ఎక్స్‌ప్రెస్ సంధించిన బౌన్సర్లను అప్పర్ కట్ షాట్లతో సిక్స్‌లు మల్చడం అందరికీ చిరస్మరణీయం. కొన్నిసార్లు మాస్టర్ తడబడినా.. ఓవరాల్‌గా చూస్తే మాత్రం అక్తర్‌పై సచిన్‌దే పై చేయి అనేది కాదనలేని సత్యం.

ఇక షోయబ్ ఉన్న పాక్ జట్టుతో 9 టెస్ట్‌లు ఆడిన సచిన్.. 41.60 సగటుతో 416 పరుగులు చేశాడు. ఇక సచిన్‌ను అక్తర్ మూడు సార్లు ఔట్ చేశాడు. 19 వన్డేల్లో 45.47 యావరేజ్‌తో సచిన్ 864 రన్స్ చేయగా.. అక్తర్ ఐదు సార్లు ఔట్ చేశాడు.

కెరీర్ ప్రారంభంలో ధోనీ అవతారం చూసి అపార్థం చేసుకున్నా: మాజీ క్రికెటర్

Story first published: Tuesday, July 7, 2020, 21:39 [IST]
Other articles published on Jul 7, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X