న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోని బెస్ట్ కెప్టెన్.. అదే అతని విజయ రహస్యం : రోహిత్

ముంబై: క్రికెట్ అనేది పూర్తిగా మెంటల్ గేమ్. ఒత్తిడిని జయించి రాణించినవారే విజయం సాధిస్తారు. న్యూజిలాండ్‌తో ఇటీవల ముగిసిన ఐదు టీ20ల సిరీస్ కూడా ఇదే తెలియజేసింది. తొలి రెండు మ్యాచ్‌లు సాధారణంగానే జరిగినా.. చివరి మూడు మ్యాచ్‌లు మాత్రం.. ఒత్తిడిని అధిగమించి, మానసికంగా ధృడంగా ఉన్నవారినే విజయం వరించింది. అలవోకగా గెలిచే మ్యాచ్‌ల్లో ఒత్తిడిని జయించలేక న్యూజిలాండ్ ఓటమిపాలైంది. క్లిష్ణ స్థితిలో కూడా ప్రశాంతంగా ఆఖరి బంతి వరకు పోరాడిన భారత్ అద్భుత విజయాన్నందుకుంది.

వారెవ్వా.. సూపర్ ఫీల్డింగ్‌తో సిక్సర్‌ను అడ్డుకున్న శాంసన్ (వీడియో)వారెవ్వా.. సూపర్ ఫీల్డింగ్‌తో సిక్సర్‌ను అడ్డుకున్న శాంసన్ (వీడియో)

అయితే మైదానంలో ప్రశాంతత అనగానే మనకు గుర్తుకొచ్చే క్రికెటర్.. టీమిండియా లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని. ఎటువంటి పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా ఉంటూ.. తన వ్యూహాలను అమలు పరచడం మహీ నైజం. ఇలానే భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలందించిన ఈ జార్ఖండ్ డైనమైట్.. ఐసీసీ టైటిళ్లన్నీ గెలిచాడు.

ప్రశాంతతే ధోని విజయ రహస్యం..

ప్రశాంతతే ధోని విజయ రహస్యం..

ఇక టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ కూడా భారత్ చూసిన అత్యత్తమ కెప్టెన్ ధోని అని అభిప్రాయపడ్డాడు. పరిస్థితులను పట్టించుకోకుండా మైదానంలో ప్రశాంతంగా ఉండటంతోనే మహీ సక్సెస్ అయ్యాడని హిట్ మ్యాన్ చెప్పుకొచ్చాడు. ఇటీవల ఓచిట్ చాట్‌ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ధోనిపై ప్రశంసల జల్లు కురిపించాడు.

‘ధోని గురించి యావత్ భారతానికి తెలుసు. పరిస్థితులతో సంబంధంలేకుండా ప్రశాంతంగా ఉంటూ మైదానంలో అతను తీసుకునే నిర్ణయాలు అతన్ని గొప్ప సారథిగా నిలబెట్టాయి. అన్నీ ఐసీసీ టైటిళ్లతో పాటు ఐపీఎల్ ట్రోఫీలు గెలుచుకునేలా చేశాయి. భారత్ చూసిన అత్యుత్తమ కెప్టెన్ ధోని. దానికి కారణం పరిస్థితులతో సంబంధం లేకుండా మైదానంలో ప్రశాంతంగా ఉండటం.. ఒత్తిడిని జయించడం.'అని రోహిత్ తెలిపాడు.

శివమ్ దూబే చెత్త రికార్డు.. యువరాజ్ సిక్స్ సిక్సర్లకు బలైన స్టువర్ట్ బ్రాడ్ తర్వాత..

ఆ విషయంలో ధోని గ్రేట్..

ఆ విషయంలో ధోని గ్రేట్..

ధోని కెప్టెన్సీ‌లో తనకు నచ్చే మరో అంశం.. యువ ఆటగాళ్లను, అనుభవం లేని బౌలర్లకు అండగా నిలబడటమని హిట్ మ్యాన్ చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా ఒత్తిడిలో ఉన్న ఆటగాళ్లలో అతను సలహాలు, సూచనలతో ఆత్మవిశ్వాసం నింపడం అత్యుద్భుతమన్నాడు.

‘ఒత్తిడిలో ఉన్న యువ బౌలర్లను ధోని హ్యాండిల్ చేయడం నేను చాలాసార్లు చూశాను. వారు ప్రెజర్‌లో ఉన్నారని గ్రహించగానే.. ధోని వారి దగ్గరకు వెళ్లి, వారి భుజాలపై చేతులు వేసి.. అతనికేం కావలో.. ఏం చేయద్దో చెబుతాడు. సీనియర్ క్రికెటర్ల నుంచి ఇలాంటి మద్దతు, ప్రోత్సాహం లభిస్తే

యువ ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అది జట్టుకు ఉపయోగపడుతుంది.'అని ఈ ముంబై క్రికెటర్ ధోని కెప్టెన్సీ నాటి రోజులను గుర్తు చేసుకున్నాడు.

ఇక ధోని కెప్టెన్సీలోనే హిట్ మ్యాన్ 2007 వరల్డ్ కప్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. తన కెరీర్ ఎక్కువ భాగం కూడా అతని సారథ్యంలోనే సాగింది.

ఇది కదా క్రీడా స్పూర్తి అంటే.. ఆకట్టుకుంటున్న బీసీసీఐ ట్వీట్

వన్డే సిరీస్‌కు రోహిత్ డౌట్!

వన్డే సిరీస్‌కు రోహిత్ డౌట్!

న్యూజిలాండ్‌తో జరిగిన ఆఖరి టీ20లో గాయపడ్డ రోహిత్ శర్మ.. తదుపరి వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండటంపై సందేహం నెలకొంది. కోహ్లీ విశ్రాంతితో తాత్కలిక కెప్టెన్‌గా బరిలోకి దిగిన హిట్‌మ్యాన్ .. హాఫ్ సెంచరీతో రాణించాడు. అయితే పిక్క కండరాలు పట్టేయడంతో అర్ధాంతరంగా రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. మళ్లీ ఫీల్డింగ్ కూడా చేయలేదు.

బుధవారం నుంచి న్యూజిలాండ్-భారత్ మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభంకానుంది. అయితే ఈ సిరీస్‌లో రోహిత్ ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి.

ఇంకా వన్డే సిరీస్ ప్రారంభానికి రెండు రోజులు సమయం ఉండడంతో.. రోహిత్ కోలుకుంటాడని ‌టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. బీసీసీఐ మాత్రం రోహిత్‌ శర్మను ప్రస్తుతం పరిశీలనలో ఉంచామని, త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేస్తామని ప్రకటించింది.

Story first published: Monday, February 3, 2020, 14:04 [IST]
Other articles published on Feb 3, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X