For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

శివమ్ దూబే చెత్త రికార్డు.. యువరాజ్ సిక్స్ సిక్సర్లకు బలైన స్టువర్ట్ బ్రాడ్ తర్వాత..

India vs New Zealand 5th T20I : Shivam Dube Hit For 34 Runs In An Over
India vs New Zealand 5th T20I: Shivam Dube leaks away 34 runs

మౌంట్‌ మాంగనుయ్‌: న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఆఖరి మ్యాచ్‌లో భారత యువ ఆల్‌రౌండర్ శివమ్ దూబే చెత్త రికార్డును నమోదు చేశాడు. టీ20ల్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న రెండో బౌలర్‌గా అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. శివమ్ దూబే వేసిన 10వ ఓవర్లో న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ టిమ్ సీఫెర్ట్, రాస్ టేలర్ ఆకాశమే హద్దు చెలరేగాడు.

తొలి రెండు బంతులను భారీ సిక్స్‌లుగా మలిచిన సీఫెర్ట్ అనంతరం సింగిల్ తీశాడు. ఇక శివమ్ దూబే నోబాల్ వేయగా టేలర్ బౌండరీ కొట్టాడు. దీంతో ఐదు పరుగులు వచ్చాయి. ఆ మరుసటి బంతులను కూడా టేలర్ రెండు భారీ సిక్స్‌లు కొట్టడంతో న్యూజిలాండ్‌కు మొత్తం ఈ ఓవర్లోనే 34 పరుగులు వచ్చాయి.

ఫలితంగా టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ సిక్స్ సిక్సర్ల‌కు బలైన ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ 36 పరుగుల తర్వాత శివం దూబే నిలిచాడు. ఇక భారత్ తరఫున అత్యధిక పరుగులు సమర్పించుకున్న అప్రతిష్టను కూడా దూబే సొంతం చేసుకున్నాడు. ఇప్పటివరకూ ఈ చెత్త రికార్డు స్టువర్ట్‌ బిన్నీ(32 పరుగులు) పేరిట ఉండగా తాజాగా దూబే తన పేరిట లిఖించుకున్నాడు. ఈ దెబ్బతో తాత్కలిక వైస్ కెప్టెన్ రాహుల్ మరోసారి అతనికి బంతినిచ్చేందుకు సాహసం చేయలేదు.

ఇక ఈ మ్యాచ్‌లో తాత్కలిక కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తూ గాయపడగా.. కేఎల్ రాహుల్ సారథ్యం వహిస్తున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ కూడా స్పష్టం చేసింది.

అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. తాత్కలిక కెప్టెన్ రోహిత్ శర్మ(41 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు 60 రిటైర్డ్ హర్ట్) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. ఓపెనర్ కేఎల్ రాహుల్(33 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్స్‌లతో 45) తన ఫామ్‌ను కొనసాగించాడు.

చివర్లో శ్రేయస్ అయ్యర్(31 బంతుల్లో1 ఫోర్, 2సిక్స్‌లతో 33 ), మనీష్ పాండే(4 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్‌తో 11) మెరుపులు మెరిపించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో3 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో కుగ్లిన్ రెండు వికెట్లు తీయగా.. బెన్నెట్ ఒక వికెట్ తీశాడు. ఆఖరి ఓవర్లలో పరుగులు రాకుండా ఆతిథ్య బౌలర్లు కట్టడి చేయడంతో భారత్ సాధారణ స్కోర్‌కే పరిమితమైంది.

Story first published: Sunday, February 2, 2020, 18:05 [IST]
Other articles published on Feb 2, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+