న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

‌షోయబ్ అక్తర్.. బహిరంగ క్షమాపణలతో పాటు కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాల్సిందే!

PCB legal counsel Tafazzul Rizvi vows to drag Shoaib Akhtar to court over defamation notice response

కరాచీ: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆ దేశ మాజీ పేసర్ షోయబ్ అక్తర్‌‌.. బహిరంగ క్షమాపణలతో పాటు కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాల్సిందేనని బోర్డు లీగల్ అడ్వైజర్, సీనియర్ న్యాయవాది తఫాజుల్ రిజ్వీ డిమాండ్ చేశాడు. గత కొంతకాలంగా పీసీబీలో సంస్కరణల గురించి పెద్ద ఎత్తున సూచనలు చేస్తున్న అక్తర్.. ఇటీవల ఉమర్ అక్మల్‌‌పై విధించిన మూడేళ్ల నిషేధాన్ని ఓ పనికిమాలిన చర్యగా అభివర్ణిస్తూ బోర్డునిర్ణయాన్ని తప్పుబట్టాడు.

అక్తర్‌ను కోర్టుకు లాగుతా..

అక్తర్‌ను కోర్టుకు లాగుతా..

అక్తర్ చేసిన ఈ వ్యాఖ్యలను తప్పుబడుతూ.. పీసీబీ లీగల్ అడ్వైజర్ తఫాజుల్ రిజ్వీ పరువు నష్టం నోటీసులు పంపాడు. ఈ నోటీసులకు రావల్పిండి ఎక్స్‌ప్రెస్ వివరణ కూడా ఇచ్చాడు. అయితే అక్తర్ వివరణతో తాను సంతృప్తి చెందలేదని, అతన్ని కోర్టు లాగే వరకు వదిలిపెట్టనని తాజాగా తఫాజుల్ మీడియాతో అన్నాడు. ‘షోయబ్ అక్తర్ లీగల్ కౌన్సిల్ పంపించిన వివరణకు నేను సంతృప్తి చెందలేదు. అతన్ని మేం కోర్టుకు లాగుతాం. త్వరలో నా తరఫున సీనియర్ న్యాయవాది ఆజం తారార్ అక్తర్‌పై కేసు పెడ్తారు.'అని తఫాజుల్ తెలిపాడు.

 పీసీబీకి సంబంధంలేదు..

పీసీబీకి సంబంధంలేదు..

పీసీబీకి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని అక్తర్‌కు పంపిన నోటీసులో డిమాండ్ చేసిన రిజ్వీ.. ఓ ఛారిటీకి రూ.కోటి విరాళంగా ఇవ్వాలని సూచించాడు. అయితే అక్తర్ వ్యాఖ్యలపై వేసిన పరువు నష్టం దావా.. తఫాజుల్ రిజ్వీ వ్యక్తిగతమని, దాంతో బోర్డుకు సంబంధం లేదని పీసీబీఓ ప్రకటనలో తెలిపింది. ఇక తఫాజుల్ కూడా ఈ విషయాన్ని అంగీకరించాడు. అక్తర్‌కు తాను రెండు నోటీసులు పంపించానని ఒకటి పాక్ న్యాయ చట్టాలకు అనుగునంగా అయితే.. మరొకటి లండన్ కోర్టు నిబంధనల మేరకు నోటీసులిచ్చామన్నాడు. అయితే లండన్ నోటీసులకు ఇప్పటి వరకు ఎలంటి విరణ ఇవ్వలేదని, దాని కోసం వేచి చూస్తున్నామని తఫాజుల్ పేర్కొన్నాడు.

ఆ రోజు ధోనీకి బిర్యానీ వడ్డించి ఉంటే.. భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చేవాడిని: మహ్మద్ కైఫ్

చనువుతో చేసిన కామెంట్స్‌కు నోటీసులా?

చనువుతో చేసిన కామెంట్స్‌కు నోటీసులా?

ఇక తఫాజుల్ పరువు నష్టం దావా నోటీసులు అర్థరహితమని ఇటీవల షోయబ్ అక్తర్ కొట్టిపారేసిన విషయం తెలిసిందే. ‘పాకిస్థాన్ క్రికెట్ బోర్డు‌ పనితీరు మెరుగయ్యేందుకే నేను కాస్త ఘాటుగా సూచనలు చేశా. అది కూడా పీసీబీలో ఏం జరుగుతుందో.. ప్రజలకు తెలియాలనే తప్ప మరో ఉద్దేశంతో కాదు. రిజ్వీ గురించి నేను చేసిన వ్యాఖ్యలు అతనితో నాకు వ్యక్తిగతంగా ఉన్న చనువుతో చేసినవే. కానీ రిజ్వీనే నాకు నోటీసులు జారీ చేసి నన్ను అవమానించాడు. కాబట్టి అతనే నాకు తొలుత క్షమాపణలు చెప్పాలి' అని అక్తర్ డిమాండ్ చేశాడు.

ఉమర్‌పై మూడేళ్ల నిషేధం..

ఉమర్‌పై మూడేళ్ల నిషేధం..

ఈ ఏడాది జరిగిన పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌(పీఎస్‌ఎల్) సందర్భంగా తనను సంప్రదించిన బుకీల సమాచారాన్ని ఉమర్ అక్మల్ గోప్యంగా ఉంచడంతో ఆగ్రహించిన పీసీబీ అతనిపై మూడేళ్ల నిషేధాన్ని విధించింది. అయితే ఈ నిర్ణయాన్ని తప్పుబట్టి అక్తర్ చిక్కుల్లో పడ్డాడు. ఇక ఉమర్ తనపై విధించిన బ్యాన్‌ సవాల్ చేస్తూ అప్పీల్‌ పిటిషన్‌ను దాఖలు చేశాడు.

దాంతో పీసీబీ ఈ అంశాన్ని విచారించడానికి స్వతంత్ర హోదా కలిగిన ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. ఈ ప్యానెల్‌ సభ్యులు మరోసారి ఉమర్‌ వాదనలను విననున్నారు.

సాయం అందుకొని భారత్‌పై విద్వేషపూరిత వ్యాఖ్యలా? అఫ్రిదిపై కనేరియా ఫైర్

Story first published: Tuesday, May 26, 2020, 16:58 [IST]
Other articles published on May 26, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X