న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కరోనా గుబులుతోనే ఇంగ్లండ్‌ చేరిన పాకిస్తాన్‌ టీమ్

Pakistan cricketers arrive in England for 3-match Test, T20I series

మాంచెస్టర్‌: ఓవైపు కరోనా తాలూకు భయాందోళనలు ఉన్నప్పటికీ పాకిస్తాన్‌ జట్టు ఇంగ్లండ్‌కు చేరుకుంది.20 మంది ఆటగాళ్లతో పాటు 11 మంది సహాయక సిబ్బందితో కూడిన పాక్‌ బృందం ఆదివారం ఇంగ్లండ్‌తో సిరీస్‌ కోసం మాంచెస్టర్‌‌కు బయలుదేరింది . ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా ఆగస్టులో ఇరు జట్ల మధ్య 3 టెస్టులు, 3 టీ20 మ్యాచ్‌లు జరుగనున్నాయి.

ప్రత్యేక విమానంలో

ప్రత్యేక విమానంలో

ఇక పాకిస్థాన్ జట్టుకు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ప్రత్యేక విమానం ఏర్పాటు చేయడం గమనార్హం. ఆ విమానంలోనే వెళ్లిన పాక్ జట్టు.. అక్కడికి చేరుకోగానే ప్రత్యేకంగా కేటాయించిన హోటల్‌లో టీమ్ అంతా 14 రోజులు క్వారంటైన్‌లో ఉంటుంది. ఈ క్వారంటైన్ అనంతరం ఆటగాళ్లకు మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించి అందులో నెగటీవ్ వస్తే ప్రాక్టీస్ ప్రారంభిస్తారు.

బాబర్ ట్వీట్..

ఇంగ్లండ్‌ పర్యటనకు బయలుదేరినట్టుగా పాక్‌ వన్డే, టీ20 కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ ట్వీట్ చేశాడు. ‘ఇంగ్లండ్‌కు వెళ్లే దారిలో ఉన్నాం. ఈ పర్యటన కోసం ఎంతోకాలంగా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. ఇంగ్లండ్‌లాంటి పటిష్ట జట్టుతో ఆడటం గొప్పగా ఉంటుంది. ఎప్పటిలాగే అభిమానుల ఆశీస్సులు, ప్రార్థనలు మావెంటే ఉంటాయని నమ్ముతున్నా' అని పేర్కొన్న బాబర్‌ విమానంలో తన సహచరులతో దిగిన ఫొటోను షేర్ చేశాడు. ఇక ఆటగాళ్లు ఇంగ్లండ్ చేరుకున్నారని పీసీబీ కూడా ట్వీట్ చేసింది. దానికి సంబంధించిన వీడియోను కూడా షేర్ చేసింది

 పాజిటీవ్.. నెగటీవ్

పాజిటీవ్.. నెగటీవ్

వాస్తవానికి 29 మంది ప్లేయర్లను పాక్ బోర్డు ఇంగ్లండ్‌కు పంపాలని భావించింది. కానీ ఇదులో 10 మందికి 10 మంది క్రికెటర్లకు ముందు కరోనా పాజిటీవ్ తేలడం.. మళ్లీ పరీక్షించగా అందులో ఆరుగురు ఫలితాలు నెగెటివ్‌గా వచ్చింది. దీంతో మరోమారు పరీక్షించాకే ఈ 10 మందిని ఇంగ్లండ్‌కు పంపిస్తామని పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) స్పష్టం చేసింది. వారి హెల్త్ క్లియరెన్స్ వచ్చిన వెంటనే కమర్షియల్ ఫ్లైట్‌లో ఇంగ్లండ్ చేరుకొని తమ టీమ్‌తో కలవచ్చని ఈసీబీ పేర్కొంది.

 పాకిస్తాన్‌ జట్టు:

పాకిస్తాన్‌ జట్టు:

అజహర్‌ అలీ, బాబర్‌ ఆజమ్, అబిద్‌ అలీ, అసద్‌ షఫీఖ్, ఫహీమ్‌ అష్రఫ్, ఫవాద్‌ ఆలమ్, ఇఫ్తికార్‌ అహ్మద్, ఇమాద్‌ వసీమ్, ఇమాముల్‌ హఖ్, ఖుష్‌దిల్‌ షా, మొహమ్మద్‌ అబ్బాస్, మూసా ఖాన్, నసీమ్‌ షా, రోహైల్‌ నాజిర్, సర్ఫరాజ్‌ అహ్మద్, షహీన్‌ షా అఫ్రిది, షాన్‌ మసూద్, సొహైల్‌ ఖాన్, ఉస్మాన్‌ షిన్వారీ, యాసిర్‌ షా.

అసద్ బాబాయ్ ఫోర్ కొడితే.. మాలిక్ బాబా సిక్స్ కొడుతాడు.. సానియా కుమారుడి ఫన్నీ వీడియో!

Story first published: Monday, June 29, 2020, 10:03 [IST]
Other articles published on Jun 29, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X