Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అసద్ బాబాయ్ ఫోర్ కొడితే.. మాలిక్ బాబా సిక్స్ కొడుతాడు.. సానియా కుమారుడి ఫన్నీ వీడియో!

Sania Mirza Shares Video of Adorable Conversation with Son Izhaan

హైదరాబాద్: కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన స్టార్ ఆటగాళ్లంతా కుటుంబ సభ్యులతో గడుపుతూ సోషల్ మీడియా వేదికగా కాలక్షేపం చేస్తున్న విషయం తెలిసిందే. ఇక భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సైతం ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది. తన వ్యక్తిగత, వృత్తిగత విషయాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తుంది. తాజాగా తన కుమారుడు ఇజాన్‌ మీర్జా మాలిక్‌తో సరదాగా చేసిన ఓ సంభాషణకు సంబంధించిన వీడియోను షేర్ చేసిన ఈ హైదరాబాద్ స్టార్.. ఈ ఇన్‌స్టా వీడియోకు 'బాబాయ్ ‌(అసద్‌) 4 బౌండరీ కొడితే.. బాబా (షోయబ్‌ మాలిక్‌) సిక్సర్‌ కొడతాడు'అని క్యాప్షన్‌గా పేర్కొంది.

ఈ వీడియోలో ఏముందంటే..?

ఈ వీడియోలో ఏముందంటే..?

ఇక ఈ వీడియోలో.. సానియా తన కుమారుడితో మాట్లాడుతూ.. కుక్క ఎలా అరుస్తుంది బేబీ అని అడిగితే.. చిన్నారి ఇజాన్‌ బౌబౌ అంటూ డాగ్‌లా అనుకరిస్తూ సమాధానం ఇచ్చాడు. ఇక అసద్‌ బాబాయ్‌ ఏం చేస్తారని అడగ్గా.. ఫోర్‌ కొడతారని చేతులు ఊపుతూ బదులిచ్చాడు. అదే విధంగా బాబా (మాలిక్‌) ఏం చేస్తారని ప్రశ్నించగా.. రెండు చేతులు పైకెత్తుతూ.. సిక్సర్‌ బాదుతాడని తెలిపాడు.

నెట్టింట వైరల్..

ఆకట్టుకునేలా ఉన్న ఈ వీడియో ప్రస్తతం నెట్టింట హల్ చల్ చేస్తోంది. నెటిజన్లతో పాటు పలువురు క్రీడా ప్రముఖలు కూడా ఈ వీడియోను లైక్‌ చేస్తున్నారు. భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా లవ్ ఎమోజీలతో కామెంట్ చేశాడు. ఇక కుమారుడితో సరదాగా గడుపుతూ మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్న సానియాపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే ఈ వీడియో 1.7 లక్షల లైక్స్‌తో దూసుకుపోతుంది. అక్టోబర్‌ 30, 2018న సానియా.. ఇజాన్‌ మీర్జా మాలిక్‌కు‌ జన్మనిచ్చిన విషయం తెలిసిందే.

 అజార్ తనయుడు అసద్..

అజార్ తనయుడు అసద్..

ఇక భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ తనయుడు అసద్.. సానియా సోదరి అనమ్ మీర్జాను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. గతేడాది డిసెంబర్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక అసద్.. డొమెస్టిక్ క్రికెట్ ఆడాడు. గోవా తరఫున రంజీట్రోఫీ బరిలోకి దిగాడు.

నిన్ను చంపేస్తా.. బాబర్

నిన్ను చంపేస్తా.. బాబర్

పాకిస్తాన్ పరిమిత ఓవర్ల కెప్టెన్, టీ20 వరల్డ్ నంబర్ వన్ బ్యాట్స్‌మన్‌ బాబర్‌ ఆజమ్‌కు ఇటీవల సానియా మీర్జా వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇన్‌స్టా లైవ్ సెషన్‌లో భాగంగా పాక్ జట్టులో 'నీకిష్టమైన వదిన ఎవరు'? అని బాబర్ ఆజమ్‌ను షోయబ్‌ మాలిక్ ప్రశ్నించాడు. దీనికి ఏమాత్రం ఆలోచించని బాబర్.. మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ భార్య సైదా ఖుస్బత్ పేరుని చెప్పాడు. అయితే సానియాకు ఆజమ్‌కు మంచి ఫ్రెండ్‌కావడంతో ఆమె పేరుని చెప్తాడని మాలిక్‌ ఉహించాడు. ఇక లైవ్‌ చూస్తున్న సానియా.. 'ఐ విల్‌ కిల్‌ యూ' అని మెసేజ్‌ పెట్టింది.

ధోనీ, కోహ్లీ, రోహిత్ కెప్టెన్సీలో ఉన్న తేడా ఇదే: పార్దీవ్ పటేల్

Story first published: Sunday, June 28, 2020, 20:44 [IST]
Other articles published on Jun 28, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+