న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీలేని క్రికెటా..? ఇక చూసేది లేదు: సూపర్ ఫ్యాన్ చికాగో చాచా

MS Dhoni retires: Pakistan-born fan Chacha Chicago says he will stop travelling for cricket

న్యూఢిల్లీ: క్రికెట్ సూపర్ ఫ్యాన్స్ సుధీర్ గౌతమ్, చికాగో చాచా గురించి తెలియని అభిమాని ఉండడు. ఒకరు ఒంటి నిండా భారతదేశ జెండా రంగుతో కనిపిస్తే.. ఇంకొకరు పాక్, భారత్ జెండాలతో మైదాన గ్యాలరీల్లో సందడి చేస్తారు. ఒకరు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వీరాభిని అయితే మరొకరు భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అభిమాని. సచిన్ ఫ్యాన్ సుధీర్.. భారత్ ఆడే ప్రతీ మ్యాచ్ హాజరవుతాడు. కానీ ధోనీ ఫ్యాన్ చికాగో చాచా మాత్రం కేవలం భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లకే వస్తాడు.

అయితే మహేంద్ర సింగ్ ధోనీ శనివారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడంతో ఈ చికాగో చాచా తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. తాను కూడా క్రికెట్‌కు గుడ్ బై చెబుతున్నానని ప్రకటించాడు. ధోనీ లేని క్రికెట్ తనకు వద్దని స్పష్టం చేశాడు.

కొంచెం బాధగా ఉంది..

కొంచెం బాధగా ఉంది..

‘ధోనీ ఆటకు అల్విదా ఇచ్చాడు. నేను కూడా అతని బాటలోనే నడుస్తా. ధోనీ లేని మ్యాచ్‌లు చూడటానికి నేను వెళ్లను. నేను ధోనీ ఎంతో ప్రేమిస్తానో.. అంతే స్థాయిలో నాకు తిరిగిస్తాడు. గొప్ప ఆటగాళ్లంతా ఏదో ఒక రోజు తప్పుకోవాల్సిందే. కానీ ధోనీ వీడ్కోలు భావోద్వేగానికి గురిచేసింది. ఎన్నో జ్ఞాపకలను గుర్తు చేసింది. ఘన వీడ్కోలు అందుకోవడానికి అతని అన్ని విధాల అర్హుడు. కానీ మహీ దాన్ని కూడా దాటేసాడు'అని చికాగో చాచా ఇండియా టుడేకు తెలిపాడు.

ధోనీ ఇంటికి వెళ్తా..

ధోనీ ఇంటికి వెళ్తా..

ఇప్పటికే మూడు సార్లు గుండెపోటుకు గురై ప్రాణాలతో గట్టెక్కిన చాచా.. పరిస్థితులన్నీ కుదురుకున్నాక రాంచీకి వెళ్లి ధోనీని కలుస్తానని తెలిపాడు. ‘కరోనాతో నెలకొన్న పరిస్థితులు కుదురుకున్నాక రాంచీలోనీ ధోనీ ఇంటికి వెళ్తా. అతని భవిష్యత్తు మంచిగుండాలని విష్ చేయడమే ఇప్పుడు నేను చేయగలిగినది. నాతో రావాలని మొహాలికి చెందిన మరో సూపర్ ఫ్యాన్ రాంబాబును అడుగుతా.

దుబాయ్‌కి వెళ్లి ఐపీఎల్ చూడాలనుంది. కానీప్రస్తుత ప్రయాణ ఆంక్షలు, నా హార్ట్ కండీషన్ దృష్ట్యా అంత సేఫ్ కాదు.'అని చెప్పుకొచ్చాడు. 2015 ప్రపంచకప్ సమయంలో ధోనీ తనకు సురేశ్ రైనాతో సన్‌గ్లాస్ పంపించాడని గుర్తు చేసుకున్నాడు. ఇక 2018 ఆసియాకప్ సమయంలో తన రూమ్‌కు తీసుకెళ్లి జెర్సీ ఇచ్చాడని చెప్పాడు.

చికాగో చాచా ఎవరు..?

చికాగో చాచా ఎవరు..?

పాకిస్థాన్‌లోని కరాచీకి చెందిన చికాగో చాచా అసలు పేరు మహమ్మద్ బషీర్ బొజాయి. చికాగోలో స్ధిరపడ్డ ఆయనకు ఓ రెస్టారెంట్ కూడా ఉంది. అక్కడే ఉంటున్నా భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ జరిగినా బషీర్ వచ్చేవాడు. తొలుత పాక్ జట్టును అభిమానించేవాడు. అయితే 2011 ప్రపంకప్ సెమీస్ మ్యాచ్‌తో ఆయన ధోనీకి వీరాభిమాని అయ్యాడు. అప్పటి వరకు పాకిస్థాన్ జెర్సీతోనే కనిపించిన బషీర్.. అనంతరం పాక్, భారత్ జెండాలతో పాటు ధోనీ ఫొటోలతో మ్యాచ్‌లకు వచ్చేవాడు. ఇలా యావత్ క్రికెట్ ప్రపంచం దృష్టి ఆకర్షించి చికాగో చాచాగా పేరు సంపాదించుకున్నాడు.

టికెట్ విషయంలో ధోనీ సాయం..

టికెట్ విషయంలో ధోనీ సాయం..

ఇక 2011 ప్రపంచకప్ సెమీఫైనల్లో అనూహ్యంగా భారత్-పాక్ తలపడటంతో ఆ మ్యాచ్ టికెట్లకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఈ పరిస్థితుల్లో చికాగో చాచాకు టికెట్ దొరకడం కష్టమైంది. ఈ విషయం తెలుసుకున్న ధోనీ అతనికి టికెట్ ఏర్పాటు చేశాడు. ఆ క్షణమే 65 ఏళ్ల చికాగో చాచా ధోనీ వీరాభిమాని అయ్యాడు. ఇలా చేసినందుకు ఆయన సొంత దేశం నుంచి తీవ్ర అవమానాలు ఎదుర్కొన్నాడు. అయినా ఇవేవి పట్టించుకోలేదు.

ధోనీ ఓ మోసగాడు.. మమ్మల్ని నట్టేట ముంచేసాడు: ఆమ్రపాలి బాధితులు

Story first published: Monday, August 17, 2020, 19:24 [IST]
Other articles published on Aug 17, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X