న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కష్టకాలంలో చెన్నైసూపర్ కింగ్స్ అండగా నిలిచింది: ధోనీ

MS Dhoni CSK has helped me in handling tough situations
IPL 2020 : CSK Has Helped Me Tackle Difficult Times Says MS Dhoni | Oneindia Telugu

చెన్నై: టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీ తన చెన్నైసూపర్ కింగ్స్ ఫ్రాంచైజీపై ప్రశంసల జల్లు కురిపించాడు. 2019 వన్డే ప్రపంచకప్ సెమీస్ ఓటమి అనంతరం దాదాపు 8నెలలు మైదానానికి దూరమైన ఈ జార్ఖండ్ డైనమైట్.. ఐపీఎల్ 2020 సీజన్‌తో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇప్పటికే చెన్నై చేరుకున్న ధోనీ సీఎస్‌కే ట్రైనింగ్ క్యాంప్‌లో ప్రాక్టీస్ కూడా మొదలెట్టాడు.

కఠిన పరిస్థితులను ఎదుర్కోవడంలో..

కఠిన పరిస్థితులను ఎదుర్కోవడంలో..

ఈ సందర్భంగా అధికారిక బ్రాడ్‌కాస్టర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కష్టకాలంలో చెన్నై ఫ్రాంచైజీ తనకు అండగా నిలిచిందని చెప్పుకొచ్చాడు.‘ప్రతీ విషయంలో సీఎస్‌కే నాకు అండగా నిలిచింది. నేను మెరుగయ్యేందుకు తోడ్పడింది. ముఖ్యంగా కష్టకాలంలో సీఎస్‌కే మేలు మరిచిపోలేనిది. క్రికెటర్‌గా.. ఓ వ్యక్తిగా కఠిన పరిస్థితులను ఎదుర్కోవడంలో ఎంతో సహాయం చేసింది.'అని ధోనీ చెప్పుకొచ్చాడు.

భారత్‌కు వచ్చినప్పుడు.. తానేంటో చూపిస్తానన్న కోహ్లీని చూస్తే నవ్వొస్తుంది : ఆసీస్ పేసర్

వారి పిలుపు చెబుతోంది..

వారి పిలుపు చెబుతోంది..

ఇక చెన్నై ఫ్యాన్స్ ధోనిని ‘తాళ'అని పిలుస్తుంటారు. తాళ అంటే సోదరుడని అర్ధం. అభిమానులకు తనపై ఉన్న ప్రేమ అదని మహీ చెప్పుకొచ్చాడు. తాళ అని పిలిచారంటే వారు కచ్చితంగా చెన్నై అభిమానేనన్నాడు. ‘నేను చెన్నై లేక సౌతిండియాకు వచ్చినప్పుడు ఏ అభిమాని నా పేరుతో పిలువడు. ప్రతి ఒక్కరు తాళ అంటూ పిలుస్తారు. అది నాపై వారికున్న ప్రేమ. గౌరవం. అలాగే వారు పక్కా చెన్నై అభిమానని అర్థం'అని ధోనీ తెలిపాడు.

ప్రారంభం నుంచి చెన్నై..

ప్రారంభం నుంచి చెన్నై..

ఇక ఐపీఎల్ ప్రారంభం ఎడిషన్ 2008 నుంచి ధోనీ చెన్నై జట్టుకే ఆడుతున్నారు. ఇక ఆ జట్టు సస్పెన్షన్‌కు గురైనప్పుడు మాత్రం 2016,2017లో రైజింగ్ పుణె తరఫున బరిలోకి దిగాడు. అనంతరం 2018 రీ ఎంట్రీ‌లో జట్టుకు టైటిల్ అందించాడు. గత సీజన్‌లో కూడా ఫైనల్‌కు చేరిన చెన్నై.. ముంబై చేతిలో ఒక్క పరుగుతో ఓటమిపాలైంది. మొత్తం 190 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన ధోనీ 42.20 సగటుతో 4432 పరుగులు చేశాడు. ఇందులో 23 హాఫ్ సెంచరీలున్నాయి.

Story first published: Wednesday, March 4, 2020, 17:09 [IST]
Other articles published on Mar 4, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X