IPL 2026: SRHకు కావ్యపాప.. RCBకి మరో అందాల తార!
IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు ఆర్సీబీ జట్టు యాజమాన్యంలో సంచలన మార్పు జరిగింది. బ్రిటన్‌కు చెందిన డియాజియో గ్రూప్ నుంచి ఈ జట్టును ఆదిత్య బిర్లా గ్రూప్ నేతృత్వంలోని కన్సార్టియం ఏకంగా రూ.16,700 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ చారిత్రాత్మక డీల్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పురుషుల, మహిళ జట్ల బాధ్యతలను బిర్లా కుటుంబం చేపట్టనుంది. కుమార మంగళం బిర్లా తనయుడు ఆర్యమన్ బిర్లా ఛైర్మన్‌గా వ్యవహరించనుండగా.. ఆయన సోదరి అనన్య బిర్లా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు.
కావ్యపాప vs అనన్య పాప
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కావ్యమారన్ ఎలాగైతే ఓ ఐకాన్‌గా మారిపోయారో.. ఇప్పుడు ఆర్సీబీకి అనన్య బిర్లా అదే స్థాయిలో గుర్తింపు తెస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పంజాబ్ కింగ్స్ జట్టుకు ప్రీతి జింటా, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కావ్య మారన్ గ్లామర్ అదనపు ఆకర్షణగా నిలుస్తుండగా.. ఇకపై ఆర్సీబీ ఆడే ప్రతి మ్యాచ్‌లోనూ అనన్య బిర్లా స్టాండ్స్‌లో ఉండి జట్టును ఉత్సాహపరచనున్నట్లు తెలుస్తోంది. దీంతో సోషల్ మీడియాలో "మాకు కూడా ఓ అందాల తార(అనన్య పాప) వచ్చేసింది" అంటూ ఆర్సీబీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

అనన్య బిర్లా ఎవరు?
అనన్య బిర్లా కేవలం ఓ పారిశ్రామికవేత్ర కుమార్తె మాత్రమే కాదు.. ఆమెకు బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుపొందింది. అనన్య బిర్లా 17 ఏళ్ల ప్రాయంలోనే 'స్వతంత్ర మైక్రోఫైనాన్స్' అనే సంస్థను స్థాపించి, గ్రామీణ మహిళలకు ఆర్థిక చేయూతనిచ్చారు. ప్రస్తుతం ఆదిత్య బిర్లా గ్రూప్‌లోని పలు కీలక వ్యాపార బాధ్యతలను అనన్య బిర్లా పర్యవేక్షిస్తున్నారు. అనన్య బిర్లా అంతర్జాతీయ స్థాయిలో పాప్ సింగర్‌గా గుర్తింపు పొందారు. మ్యూజిక్ రంగంలో ఆమెకు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ఉన్నారు. మానసికఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు "ఎమ్ పవర్(Mpower)" అనే స్వచ్ఛంద సంస్థను అనన్య బిర్లా నడుపుతున్నారు.
ఆర్సీబీలో అనన్య పాత్ర ?
గతంలో గుజరాత్ టైటాన్స్ జట్టుకు మద్దతు తెలిపిన అనన్య బిర్లా.. ఇప్పడు తన సొంత ఫ్యామిలీ టీమ్ కావడంతో ఆర్సీబీ ప్రమోషన్లలో కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. ఆర్యమన్ బిర్లా వ్యూహకర్తగా వెనుక ఉంటే.. అనన్య బిర్లా జట్టుకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారి అభిమానులను అలరించనున్నట్లు సమాచారం. స్టేడియంలో అనన్య రాకతో ఐపీఎల్ మరింత కలర్‌ఫుల్‌గా మారడం ఖాయమని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో అనన్య గురించి నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications