IPL 2026: ఐపీఎల్ 19వ సీజన్‌లో సీఎస్కే ఓ కొత్త ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. గత సీజన్‌లో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన ఐదుసార్లు ఛాంపియన్ సీఎస్కే.. ఈ సారి జట్టులో భారీ మార్పులు చేసింది. మార్చి 30న గౌహతిలోని రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగే మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది. అయితే ఈ సారి జట్టును విజేతగా నిలిపే బాధ్యత ధోనీ భుజాలపై కాకుండా.. మరో ఐదుగురు కీలక ఆటగాళ్లపై ఉంది. ఇప్పుడు ఆ పంచపాండవుల గురించి తెలుసుకుందాం.
1. సంజు శాంసన్
ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తీసుకున్న అత్యంత సంచలన నిర్ణయం స్టార్ క్రికెటర్ సంజు శాంసన్‌ను జట్టులోకి తీసుకురావడమే. రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన చారిత్రాత్మక ట్రేడ్‌లో భాగంగా రవీంద్ర జడేజా, సామ్ కరన్‌లను ఇచ్చి రూ.18 కోట్లకు సంజును చెన్నై దక్కించుకుంటుంది. ప్రస్తుతం సంజు శాంసన్ భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచ కప్ 2026 సెమీఫైనల్, ఫైనల్స్‌లో తనదైన శైలిలో క్లాస్ అండ్ ఊరమాస్ ఇన్నింగ్స్ ఆడి 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచాడు. 177 ఐపీఎల్ ఐపీఎల్ మ్యాచ్‌ల అనుభవంతో సంజు శాంసన్ ఇప్పుడు ధోనీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడు.

2. రుతురాజ్ గైక్వాడ్
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. గత సీజన్‌లో గాయం వల్ల టోర్నీ మధ్యలోనే తప్పుకోవాల్సి రావడంతో జట్టు బిగ్ షాక్ తగిలింది. 2021లో ఆరెంజ్ క్యాప్ సాధించి సీఎస్కేను ఛాంపియన్ గా నిలబెట్టిన రుతురాజ్.. ఈ సారి యువ జట్టును ముందుండి నడిపించనున్నాడు. జట్టు మొత్తం రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్ చుట్టూనే కేంద్రీకృతమై ఉంది.
3. నూర్ అహ్మద్
రవీంద్ర జడేజా జట్టును వీడిన అనంతరం సీఎస్కే ప్రధాన స్పిన్ అస్త్రంగా అఫ్గానిస్థాన్‌కు చెందిన నూర్ అహ్మద్ నిలిచాడు. 2025 మెగా వేలంలో రూ.10 కోట్లకు అమ్ముడైన నూర్ అహ్మద్.. గత సీజన్‌లో 24 వికెట్లతో అదరగొట్టాడు. చెపాక్ స్టేడియంలోని టర్నింగ్ పిచ్‌లపై నూర్ అహ్మద్ ప్రత్యర్థి బ్యాటర్లకు సింహస్వప్నంగా మారనున్నాడు.
4.డెవాల్డ్ బ్రెవిస్
దక్షిణాఫ్రికా సెన్సేషన్ డెవాల్డ్ బ్రెవిస్ గతేడాది రీప్లేస్‌మెంట్ ప్లేయర్‌గా వచ్చి 180 స్ట్రైక్ రేట్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. టీ20 ప్రపంచ కప్‌లోనూ అద్భుతమైన ఫామ్‌ను కనబరిచిన డెవాల్డ్ బ్రెవిస్.. మిడిల్ ఓవర్లలో వేగంగా పరుగులు రాబట్టడంలో కీలక పాత్ర పోషించనున్నాడు.
5. ఆయుష్ మాత్రే
కేవలం 17ఏళ్లలోనే ఆయుష్ మాత్రే సంచలనం సృష్టిస్తున్నాడు. గత సీజన్ అరంగేట్రంలోనే తన దూకుడు బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న ఈ కుర్రాడు.. ఇటీవల భారత్‌కు అండర్-19 ప్రపంచ కప్ 2026 టైటిల్ ను అందించిన కెప్టెన్ గా నిలిచాడు. మిడిలార్డర్ లో వేగంగా ఆడటమే కాకుండా.. జట్టులో గెలుపు ఆశలను రేకెత్తించడంలో ఆయుష్ మాత్రే కీలకం కానున్నాడు.