Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్.. టోర్నీ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్!

IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ కౌంట్‌డౌన్ కొనసాగుతున్న వేళ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ బెన్ డకెట్ వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కారణంతో టోర్నమెంట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో బెన్ డకెట్ ఐపీఎల్ కెరీర్ ప్రమాదంలో పడింది.

బెన్ డకెట్ అనూహ్య నిర్ణయం
ఐపీఎల్ 2026 వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ రూ.2 కోట్ల భారీ ధరకు బెన్ డకెట్‌ను కొనుగోలు చేసింది. టాపార్డర్‌లో జట్టుకు బలాన్నిస్తాడని భావించిన నేపథ్యంలో బెన్ డకెట్ అనూహ్య నిర్ణయాన్ని తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ సీజన్ కోసం డకెట్ తనను తాను శారీరకంగా, మానసికంగా సిద్ధం చేసుకోవాలని.. అందుకే ఈ సీజన్ ఆడటం లేదని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు.

IPL 2026 Ben Duckett Withdraws from Delhi Capitals Faces Potential 2-Year Ban by BCCI

బీసీసీఐ నిబంధనల ప్రకారం రెండేళ్ల నిషేధం?
బీసీసీఐ గతేడాది ప్రవేశపెట్టిన కఠిన నిబంధనల ప్రకారం.. వేలంలో అమ్ముడుపోయిన ఏ విదేశీ ఆటగాడైనా, సరైన వైద్య కారణాలు లేకుండా టోర్నీ ప్రారంభానికి ముందు తప్పుకుంటే వారిపై రెండేళ్ల పాటు నిషేధం విధిస్తారు. ఈ నిబంధన అమలైతే బెన్ డకెట్ ఐపీఎల్ 2026తో పాటు 2027, 2028 వేలంలో కూడా పాల్గొనే అవకాశం ఉండదు. బెన్ డకెట్ నేరుగా 2029 ఐపీఎల్ సీజన్‌లోనే మళ్లీ ఎంట్రీ ఇవ్వగలడు. గతంలో హ్యారీ బ్రూక్ కూడా ఇలాంటి చర్యలనే ఎదుర్కోవడం గమనార్హం.

బెన్ డకెట్ వివరణ ఇదే..
తన నిర్ణయంపై స్పందిస్తూ బెన్ డకెట్ భావోద్వేగపూరిత పోస్ట్ చేశాడు. "ఇది చాలా కఠినమైన నిర్ణయం. ఇంగ్లండ్ తరఫున ఆడటమే నా మొదట ప్రాధాన్యత. అంతర్జాతీయ సీజన్ కంటే ముందు నేను శారీరకంగా, మానసిక దృఢంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఢిల్లీ ఫ్రాంచైజీకి, అభిమానులకు కలిగిన ఇబ్బందికి క్షమాపణలు కోరుతున్నాను." అని బెన్ డకెట్ పేర్కొన్నాడు. ఇటీవల జరిగిన యాషెస్ సిరీస్‌లో బెన్ డకెట్ 10 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 20.20 సగటుతో పరుగులు చేసి బెన్ డకెట్ పేలవ ప్రదర్శన కనబరిచాడు.

ఢిల్లీ క్యాపిటల్స్‌కు తీరని లోటు
ఓపెనింగ్‌లో మెరుపులు మెరిపిస్తాడని ఆశించిన బెన్ డకెట్ దూరం అవ్వడంతో ఢిల్లీ జట్టు బ్యాలెన్స్ దెబ్బతింది. ఇప్పుడు హుటాహుటిన డకెట్ స్థానంలో మరో విదేశీ ప్లేయర్‌ను వెతరాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఇలాంటి నిర్ణయాల పట్ల చాలా కఠినంగా ఉంటోంది. ఎందుకంటే ఫ్రాంచైజీలు వేలంలో ప్లాన్ చేసుకున్న వ్యూహాలు దెబ్బతింటాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

Story first published: Wednesday, March 25, 2026, 10:56 [IST]
Other articles published on Mar 25, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+