న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

డివిలియర్స్ టీ20 వరల్డ్‌కప్ ఆడుతాడు : సౌతాఫ్రికా కోచ్

Mark Boucher Says AB de Villiers will play T20 World Cup 2020 if he makes himself available

సెంచూరియన్‌: ఏబీ డివిలియర్స్.. ఈ పేరు తెలియని క్రికెట్ అభిమాని ఉండరు. మిస్టర్ 360గా అతను అందరికీ సుపరిచతమే. సరిహద్దులతో సంబంధం లేకుండా కోట్ల మంది అభిమానులు డివిలియర్స్ సొంతం. అతని ఆటంటే యావత్ క్రికెట్ ప్రపంచానికి ఇష్టమే. అలాంటి క్రికెటర్ రెండేళ్ల క్రితం అనూహ్యంగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. పని ఒత్తిడిని తట్టుకోలేకనే తాను ఇంటర్నేషనల్ క్రికెట్‌కు దూరమవుతున్నానని 2018, మేలో ప్రకటించి అందరిని షాక్‌కు గురిచేశాడు.

ఆ ఒక్కటే..

ఆ ఒక్కటే..

అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైనా.. టీ20 లీగ్స్ ఆడుతూ ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉన్నాడు. అయితే తనకిష్టమైన ఆటలో ఎన్నో ఘనతలను అందుకున్న ఈ సౌతాఫ్రికా లెజెండ్ తాను ప్రాతినిధ్యం వహించిన దేశానికి ఒక్క ప్రపంచకప్ అందించలేకపోయాడు. ఇదే అతన్ని చాలా వేధించింది. ఈ నేపథ్యంలో అతను గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో ఆడాలని ప్రయత్నాలు చేసినట్లు వార్తలు వినిపించాయి. డివిలియర్స్ కూడా ఈ విషయాన్ని అంగీకరించాడు. కానీ టీమ్‌మేనేజ్‌మెంట్ ఆ సమయంలో అతన్ని పట్టించుకోలేదని, ప్రణాళికలు, వ్యూహాలు దెబ్బతింటాయని డివిలియర్స్ రీ ఎంట్రీని అంగీకరించలేదనే ప్రచారం జరిగింది.

పాపం సౌతాఫ్రికా.. మోర్గాన్ సిక్సర్ల మోత‌తో ఓటమి తప్పలేదు.!

రీ ఎంట్రీపై జోరుగా..

రీ ఎంట్రీపై జోరుగా..

ఇక ఈ ఏడాది జరగనున్న టీ20 వరల్డ్‌కప్ నేపథ్యంలో మరోసారి ఈ ప్రచారం జోరందుకుంది. డివిలియర్స్ రీ ఎంట్రీ కోసమే బిగ్‌బాష్ లీగ్ ఆడాడని, టీమ్‌మేనేజ్‌మెంట్ కూడా అతన్ని ఒప్పించే ప్రయత్నాలు చేస్తుందనే ఉహాగానాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో డివిలియర్స్ రీ ఎంట్రీపై సౌతాఫ్రికా కోచ్ మార్క్ బౌచర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్‌తో మూడు టీ20ల సిరీస్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. డివిలియర్స్ రీ ఎంట్రీ ఇవ్వాలనుకుంటే టీ20 వరల్డ్ కప్ ఆడుతాడని స్పష్టం చేశాడు.

ఎలాంటి సమస్యలేదు...

ఎలాంటి సమస్యలేదు...

డివిలియర్స్ ఆడాలని ఉంటే తమకు ఎలాంటి సమస్యలేదని, అది తమకు మంచే చేస్తుందని బౌచర్ చెప్పుకొచ్చాడు. మెగాటోర్నీకి అత్యుత్తమ జట్టును పంపించడమే తమ లక్ష్యమన్నాడు. వన్డే వరల్డ్‌కప్ సమయంలో డివిలియర్స్ పునరాగమనాన్ని వ్యతిరేకించిన మాట వాస్తవమేనని కానీ, అతను మెగాటోర్నీకి ముందు సన్నాహకంగా జరిగే వన్డే సిరీస్ ఆడనని చెబితేనే ఆ నిర్ణయం తీసుకున్నారని తెలిపాడు. కానీ ఈ సారి అలా జరగదని చెప్పుకొచ్చాడు.

ట్రెంట్ బౌల్డ్ ఆగయా.. టెస్ట్ సిరీస్‌లో భారత్‌తో తలపేడే న్యూజిలాండ్ జట్టు ఇదే!

ఫామ్‌లో ఉంటే మేమే రిక్వెస్ట్ చేస్తాం..

ఫామ్‌లో ఉంటే మేమే రిక్వెస్ట్ చేస్తాం..

‘రీ ఎంట్రీ విషయంపై డివిలియర్స్ మీడియా, పబ్లిక్‌తో మాట్లాడుతున్నాడు. కానీ నాతో చెప్పడం లేదు. అతనితో ఇప్పటికే నేను చాలా సార్లు మాట్లాడాను. ఈ విషయంపై త్వరలోనే స్పష్టత రానుంది. కోచ్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నేను చెప్పినట్లుగా ప్రపంచకప్ వెళ్లి ఉంటే ఉత్తమ జట్టుగా నిలిచేది. ఒకవేళ డివిలియర్స్ మంచి ఫామ్‌లో ఉండి టీ20 ప్రపంచకప్ ఆడాలనే ఉద్దేశంలో ఉంటే మేమే అతన్ని జట్టులోకి రమ్మని కోరుతాం. అతను అత్యుద్భతమైన ఆటగాడు. ఏ మాత్రం అహానికి పోకుండా డివిలియర్స్ తప్పక ప్రపంచకప్ ఆడాలి. మెగా టోర్నీ‌కి అత్యత్తమ జట్టును పంపి విజేతగా నిలపడమే తన లక్ష్యం'అని బౌచర్ చెప్పుకొచ్చాడు.

బౌలర్లకు మద్దతుగా..

బౌలర్లకు మద్దతుగా..

ఇక ఇంగ్లండ్‌తో మూడు టీ20 సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన డిసైడర్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా 223 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేక ఓటమిపాలైంది. ఫలితంగా సిరీస్‌ను 2-1 చేజార్చుకుంది. దీనిపై బౌచర్ మాట్లాడుతూ తమ బౌలర్లను వెనకేసుకొచ్చాడు. తమ బౌలర్ల వైఫల్యం కారణంగా ఈ ఓటమి ఎదురవ్వలేదన్నాడు. యార్కర్లు వేసే విషయంలో తాము దృష్టిసారించాలన్నాడు. బిజీ షెడ్యూలతో యార్కర్లపై శిక్షణ ఇవ్వలేకపోయామని చెప్పుకొచ్చాడు.

Story first published: Monday, February 17, 2020, 12:27 [IST]
Other articles published on Feb 17, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X