న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ట్రెంట్ బౌల్డ్ ఆగయా.. టెస్ట్ సిరీస్‌లో భారత్‌తో తలపేడే న్యూజిలాండ్ జట్టు ఇదే!

Trent Boult returns as New Zealand announce 13 man squad for Test series against India

వెల్లింగ్టన్: సొంతగడ్డపై భారత్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్ వైట్‌వాష్‌కు గురైన న్యూజిలాండ్.. మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసి బదులు తీర్చుకుంది. ఆద్యాంతం ఆసక్తికరంగా సాగిన ఈ రెండు సిరీస్‌లు అభిమానులకు కావాల్సిన మజానిచ్చాయి. ఇప్పుడు సాంప్రదాయక ఫార్మాట్‌కు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే సన్నాహకాలు మొదలుపెట్టిన ఇరు జట్లు గెలుపు లక్ష్యంగా కసరత్తులు చేస్తున్నాయి.

 బౌల్ట్ ఆగయా..

బౌల్ట్ ఆగయా..

ఈ నెల 21 నుంచి వెల్లింగ్టన్ వేదికగా ఇరు జట్ల మధ్య తొలి టెస్ట్ ప్రారంభంకానుంది. టెస్ట్ చాంపియన్‌షిప్‌లో భాగంగా జరుగుతున్న ఈ సిరీస్‌లో ఇరుజట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు 13 మంది సభ్యులతో కూడిన జట్టును సోమవారం ప్రకటించింది. గాయంతో గత రెండు సిరీస్‌లకు దూరమైన కివీస్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్డ్.. తుది జట్టులోకి వచ్చాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకొని చివరి వన్డే బరిలోకి దిగిన విలియమ్సన్ ఈ టెస్ట్ జట్టును నడిపించనున్నాడు. ఇక పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో అదరగొట్టిన టామ్ లాథమ్, హెన్రీ నికోలస్, వాట్లింగ్ టెస్ట్ జట్టుకు ఎంపికయ్యారు.

పాపం సౌతాఫ్రికా.. మోర్గాన్ సిక్సర్ల మోత‌తో ఓటమి తప్పలేదు.!

టేలర్ ‘వందనం'..

టేలర్ ‘వందనం'..

కివీస్ మాస్ట్రో రాస్ టేలర్ అరుదైన ఘనతకు చేరువలో ఉన్న విషయం తెలిసిందే. భారత్‌తో జరిగే తొలి టెస్ట్‌తో అతను 100వ టెస్ట్ పూర్తి చేసుకోనున్నాడు. తద్వారా మూడు ఫార్మాట్లలో 100 మ్యాచ్‌లు ఆడిన ఎకైక క్రికెటర్‌గా చరిత్రకెక్కనున్నాడు. భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌లోనే టేలర్ పొట్టి ఫార్మాట్‌లో 100 మ్యాచ్‌లు పూర్తిచేసుకున్న విషయం తెలిసిందే.

మిచెల్,ఇష్ ఔట్..

మిచెల్,ఇష్ ఔట్..

మిచెల్ సాంట్నర్, ఇష్ సోదీలకు నిరాశే ఎదురవ్వగా.. ఆజాజ్ పటేల్ అవకాశం దక్కించుకున్నాడు. అతను గతేడాది ఆగస్టులో చివరిసారిగా టెస్ట్ మ్యాచ్ ఆడాడు. స్టార్ పేసర్లు టీమ్ సౌథీ, నీల్ వాగ్నర్, జెమిన్సన్, డార్లి మిచెల్ కూడా అవకాశం దక్కించుకున్నారు. ఈ పేస్ బృందాన్ని ట్రెంట్ బౌల్ట్ లీడ్ చేయనున్నాడు. అలాగే లుకీ ఫెర్గుసన్, మ్యాట్ హెన్రీలను తొలి టెస్ట్‌కు ఎంపికయ్యారు. కొలిన్ గ్రాండ్ హోమ్ కూడా బ్యాటింగ్, బౌలింగ్‌లో తన ఫామ్ కొనసాగిస్తాడని కివీస్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది.

న్యూజిలాండ్ జట్టు:

న్యూజిలాండ్ జట్టు:

కేన్ విలియమ్సన్(కెప్టెన్), టామ్ లాథమ్, టామ్ బ్లండెల్, రాస్ టేలర్, హెన్రీ నికోలస్, బీజే వాట్లింగ్, కొలిని డి గ్రాండ్ హోమ్, టీమ్ సౌథీ, నెయిల్ వాగ్నర్, ట్రెంట్ బౌల్ట్, ఆజాజ్ పటేల్, జిమ్‌సన్, డార్లీ మిచెల్

Story first published: Monday, February 17, 2020, 11:03 [IST]
Other articles published on Feb 17, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X