న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విరాట్ కోహ్లీకి కాన్‌ఫ్లిక్ట్ సెగ!

Kohli ownership of a couple of companies has been put under the scanner due to BCCIs conflict of interest laws.
Virat Kohli Under Conflict Of Interest Scanner || Oneindia Telugu


న్యూఢిల్లీ:
భారత క్రికెట్‌ను గత రెండేళ్లుగా కుదిపేస్తున్న పదం కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్(పరస్పర విరుద్ద ప్రజయోజనాలు). 2017లో సుప్రీం కోర్టు నియమిత లోధా కమిటీ
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)‌లో తీసుకొచ్చిన సంస్కరణలో భాగంగా ఈ విరుద్ధ ప్రయోజనాల అంశాన్ని తెరపైకి తెచ్చింది. బీసీసీఐ కాంట్రాక్ట్‌లో ఉన్న క్రికెటర్ లేదా ఉద్యోగి.. బోర్డుతో అనుబంధంగా ఉన్న ఏ సంస్థల్లోనూ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా భాగస్వామిగా ఉండకూడదనేది నిబంధన. ఇప్పడు ఆ సెగ భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి తగిలింది. విరాట్ కోహ్లీ స్పోర్ట్స్ ఎల్‌ఎల్‌పి కంపెనీ డైరెక్టర్‌గా ఉండటంతో పాటు కార్నర్‌స్టోన్ వెంచర్ పార్ట్‌నర్స్ ఎల్‌ఎల్‌పి డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడు.

మెయిల్‌తో ఫిర్యాదు..

మెయిల్‌తో ఫిర్యాదు..

విరాట్ కోహ్లీ ఇలా రెండు కంపెనీలకు డైరెక్టర్ హోదాలో ఉండటం విరుద్ధ ప్రయోజనాల కిందకి వస్తుందని మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘం శాశ్వత సభ్యుడు సంజీవ్ గుప్తా తాజాగా బీసీసీఐ ఎథిక్స్ ఆఫీసర్‌కి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశాడు. అందులో తాను స్వప్రయోజనాల కోసం ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేసిన సంజీవ్ గుప్తా.. లోధా కమిటీ పేర్కొన్న క్లాజ్‌ల్లోని నిబంధనల్ని అందులో ప్రస్తావించాడు. ఒకవేళ విరాట్ కోహ్లీకి విరుద్ధ ప్రయోజనాలుంటే.. ఎథిక్స్ ఆఫీసర్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.

ఆటగాళ్లకు తలనొప్పిగా..

ఆటగాళ్లకు తలనొప్పిగా..

బీసీసీఐ ఎథిక్స్ ఆఫీసర్ నుంచి గత ఏడాదికాలంగా చాలా మంది భారత మాజీ క్రికెటర్లు విరుద్ధ ప్రయోజనాల అంశం కింద నోటీసులు ఎదుర్కొన్నారు. ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్, దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, సొగసరి బ్యాట్స్‌మెన్ వీవీఎస్ లక్ష్మణ్, దిగ్గజ కెప్టెన్ కపిల్‌దేవ్, మాజీ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే తదితరులు ఆ నోటీసులు ఎదుర్కొన్న వారిలో ఉన్నారు. వీరిలో కొంత మంది కంపెనీ డైరెక్టర్ల హోదా నుంచి తప్పుకోగా.. మరికొందరు వివరణలతో సరిపెట్టారు. అయితే వీరిలో చాలా మందిపై ఈ సంజీవ్ గుప్తానే ఫిర్యాదు చేయడం గమనార్హం.

దాదా ఫైర్

దాదా ఫైర్

ఇక ఈ పరస్పర విరుద్ద ప్రయోజనాల అంశంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అప్పట్లో ఆగ్రహం వ్యక్తం చేశాడు. రాహుల్ ద్రవిడ్‌కు ఈ సెగ తగిలిన నేపథ్యంలో స్పందించిన దాదా భారత క్రికెట్‌ను దేవుడే కాపాడాలనే ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. ‘విరుద్ద ప్రయోజనాల అంశం.. భారత క్రికెట్లో కొత్త ఫ్యాషన్‌ అయింది. ఎప్పుడూ వార్తల్లో ఉండేందుకు ఇదో సులభమైన మార్గం. భారత క్రికెట్‌ను ఇక ఆ దేవుడే కాపాడాలి. బీసీసీఐ ఎథిక్స్‌ ఆఫీసర్‌ నుంచి ద్రవిడ్‌కు పరస్పర విరుద్ద ప్రయోజనాల విషయంలో నోటీసులు అందాయి.'అని గంగూలీ మండిపడ్డాడు. బీసీసీఐ ప్రెసిడెంట్‌గా ఈ నిబంధనను మార్చే ప్రయత్నం కూడా చేశాడు.

ఐపీఎల్‌తో వచ్చే డబ్బు మా జేబుల్లోకి ఏం రాదు.. విమర్శకులపై బీసీసీఐ ట్రెజరర్ ఫైర్!

Story first published: Sunday, July 5, 2020, 19:16 [IST]
Other articles published on Jul 5, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X