న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నేనూ ధోనీ అభిమానినే.. అయినా ప్రపంచకప్ ఆడాలంటే.. : కపిల్‌ దేవ్‌

Kapil Dev Says MS Dhoni has to play more matches to play T20 World Cup

న్యూఢిల్లీ : ఈ ఏడాది మహేంద్ర సింగ్ ధోనీ టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనాలంటే వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడాలని భారత దిగ్గజం కపిల్‌ దేవ్‌ అభిప్రాయపడ్డాడు. హెచ్‌సీఎల్‌ 5 వ వార్షికోత్సవం గ్రాండ్‌ ఈవెంట్‌ను గురువారం నోయిడాలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కపిల్‌ దేవ్ ధోనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో ధోనీ ఆడటంలో పెద్ద విశేషమేమీ లేదని కపిల్‌ చెప్పుకొచ్చాడు.

ఓ అభిమానిగా..

ఓ అభిమానిగా..

ధోని తన కెరీర్‌లో చివరి దశలో ఉన్నాడని. ఒక అభిమానిగా మాత్రం అతను జట్టులో ఉండాలని కోరుకుంటానని కపిల్ తెలిపాడు. ‘ఐపీఎల్‌లో ధోనీ ఒక్కడే ఆడట్లేదు. ప్రస్తుతం క్రికెట్‌ ప్రపంచంలోకి ఎంతో మంది యువ ఆటగాళ్లు వస్తున్నారు. వారిలో మనం గర్వించే ఆటగాళ్లను వచ్చే పదేళ్లలో చూడనున్నాం .నా దృష్టిలో ధోనీ ఇప్పటికే దేశానికి చాలా సేవ చేశాడు. అయితే ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమై ఏడాది పూర్తి కావొస్తోంది. అక్టోబర్‌లో మొదలయ్యే టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టులో ఉండాలంటే ధోని వచ్చే ఐపీఎల్‌లో వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడాలి. ధోని తన కెరీర్‌లో చివరి దశలో ఉన్నాడు. ఒక అభిమానిగా అతను జట్టులో ఉండాలని కోరుకుంటా.. కానీ కొత్త తరానికి కూడా అధిక ప్రాధాన్యమిస్తా' అని కపిల్ పేర్కొన్నాడు.

రెండో టెస్ట్‌కు పృథ్వీ షా ఫిట్.. కీపర్‌గా పంతే బరిలోకి దిగుతాడు: రవిశాస్త్రి

ఆందోళన అవసరం లేదు..

ఆందోళన అవసరం లేదు..

కివీస్‌ పర్యటనలో విఫలమవుతున్న జస్‌ప్రీత్‌ బుమ్రా, విరాట్‌ కోహ్లీల ఆటతీరుపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కపిల్ సూచించాడు. ‘ఆటగాళ్లు గాయపడి తిరిగి జట్టులోకి వచ్చినప్పుడు వారు నిలదొక్కుకునేందుకు కొంత సమయం తీసుకుంటారు. ఇప్పుడు బుమ్రా కూడా అదే స్టేజీలో ఉన్నాడు. వెన్నుముక గాయం నుంచి కోలుకొని తిరగివచ్చిన బుమ్రా కివీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో వికెట్లు తీయడంలో విఫలమయ్యాడు. ఒక బ్యాట్స్‌మెన్‌ ఒక మంచి ఇన్నింగ్స్‌ కోసం ఎలా ఐతే ఎదురుచూస్తాడో.. ఒక బౌలర్‌ కూడా గుడ్‌స్పెల్‌ కోసం అదే విధంగా ఎదురుచూస్తాడు. కోహ్లి ప్రదర్శనపై ఎలాంటి ఆందోళన అవసరం లేదు. అతను ఏ పరిస్థితుల్లోనైనా పుంజుకునే అవకాశం ఉందని'అని కపిల్ ధీమా వ్యక్తం చేశాడు.

వైరల్ వీడియో: రైతుగా మారిన ధోనీ.. పుచ్చకాయలు పండిస్తూ..

ఓటమితో ప్రభావం ఉండదు..

ఓటమితో ప్రభావం ఉండదు..

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో కేఎల్‌ రాహుల్‌ను ఎంపిక చేయకపోవడాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదని, అది జట్టు మేనేజ్‌మెంట్‌ నిర్ణయమని కపిల్‌ చెప్పుకొచ్చాడు. తొలి టెసుట్లో టీమిండియా ఘోరంగా ఓటమి పాలవడం క్రైస్ట్‌చర్చి వేదికగా శనివారం ప్రారంభంకానున్న రెండో టెస్టుపై ఎలాంటి ప్రభావం ఉండదన్నాడు. ఇంతకుముందు కూడా పేస్, బౌన్సీ పిచ్‌లపై షార్ట్‌బాల్స్‌తో తడబడిన టీమిండియా ఫుంజుకుందని గుర్తు చేశాడు.

మహిళలు.. శభాష్

మహిళలు.. శభాష్

ఇక మహిళల టీ20 ప్రపంచకప్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న హర్మన్‌ప్రీత్ సేనపై కపిల్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. మహిళల జట్టు అద్భుతంగా ఆడుతోందని, ఫైనల్లో గెలిచి ఎలాగైనా కప్‌ తేవాలని ఆకాంక్షిస్తున్నట్లు కపిల్ తెలిపాడు. ఇక మహిళలకు మౌళిక వసతులు కల్పించిన బీసీసీఐని కూడా కపిల్ అభినందించారు.

Story first published: Friday, February 28, 2020, 14:38 [IST]
Other articles published on Feb 28, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X