న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వైరల్ వీడియో: రైతుగా మారిన ధోనీ.. పుచ్చకాయలు పండిస్తూ..

 MS Dhoni turns farmer, shares a video of him doing organic farming of watermelon


హైదరాబాద్: తొలుత ఆర్మీ ఆఫీసర్.. తర్వాత వైల్డ్‌గ్రాఫ్ ఫొటో గ్రాఫర్.. నిన్న పిచ్ క్యూరెటర్.. నేడు పొలాల్లో రైతుగా.. ఇలా తనకున్న అభిరుచులన్నిటిని టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని ఒక్కక్కటిగా తీర్చుకుంటున్నాడు.
Dhoni's Organic Farming & Driving Pitch Roller Videos Viral | One Man, Different Roles | Oneindia
ఆర్మీ జవాన్‌గా..

ఆర్మీ జవాన్‌గా..

గత ఆరు నెలలుగా ఆటకు దూరమైన ఈ వరల్డ్‌కప్స్ విన్నింగ్ కెప్టెన్.. తనకిష్టమైన పనులు చేస్తూ ఈ ఖాళీ సమయాన్ని ఆస్వాదిస్తున్నాడు. వన్డే వరల్డ్ కప్ సెమీస్ ఓటమి అనంతరం బ్యాట్ పట్టని ఈ జార్ఖండ్ డైనమైట్.. రెండు నెలల పాటు ఇండియన్ ఆర్మీలో పనిచేసి జవాన్‌గా దేశానికి సేవ చేయాలనే తన కోరికను తీర్చుకున్నాడు.

రోలింగ్ మిషన్ డ్రైవర్..

ఆ తర్వాత తన క్రికెట్ భవిష్యత్తుపై తీవ్ర చర్చ జరుగుతున్నా.. వార్షిక కాంట్రాక్టుల నుంచి బీసీసీఐ తొలిగించినా ఏ మాత్రం స్పందించని ధోనీ.. ఏదో రకంగా వార్తల్లో నిలుస్తూ అభిమానులను అలరిస్తూనే ఉంటున్నాడు. సహచర ఆటగాడికి పానిపూరి సర్వ్ చేయడం.. ఫ్యామిలీతో విహారయాత్రలకు వెళ్లడం.. పార్క్‌లను సందర్శించడం.. వైల్డ్‌గ్రాఫ్ ఫొటోగ్రాఫర్‌గా పులి ఫొటోలను తీయడం.. పిచ్ క్యూరేటర్ అవతారంలో రోలింగ్ మిషన్ నడపడం.. ఇలా అన్ని రకాలుగా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటున్నాడు.

అయితే గురువారం ధోనీకి సంబంధించిన రెండు వీడియోలు నెట్టింట తెగ వైరల్‌ అయ్యాయి. ఒక దాంట్లో క్రికెట్‌ మైదానంలో పిచ్‌ను రోలింగ్‌ చేసే వాహనాన్ని నడుపుతూ కనిపించాడు. ఇది రాంచీ మైదానంగా తెలుస్తోంది. ఐపీఎల్ రీఎంట్రీ కోసం అతను ఝార్ఖండ్‌ క్రికెటర్లతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్న విషయం తెలిసిందే.

సేంద్రీయ వ్యవసాయం..

ఇక వ్యాపార రంగంలో అడుగుపెట్టిన విషయం కూడా తెలిసిందే. ఇప్పటికే అనేక వ్యాపారాలు చేస్తున్న ధోనీ.. ఈ మధ్యే అతడు సేంద్రియ వ్యవసాయం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. రాంచీకి సమీపంలోని సొంత భూమిలో పుచ్చకాయలు సాగుచేస్తున్నట్టు ఓ వీడియో వైరల్‌ అయింది. ‘రాంచీలో సేంద్రియ పుచ్చకాయల సాగును మొదలుపెడుతున్నా. మరో 20 రోజుల్లో బొప్పాయి సాగు చేస్తా. తొలిసారి కావడంతో ఉత్సాహంగా అనిపిస్తోంది' అని ఈ మాజీ కెప్టెన్ అధికారిక ఫేస్‌బుక్‌ పేజీలో ఓ వీడియోను షేర్ చేశాడు.

ఐపీఎల్‌తో రీఎంట్రీ..

ఐపీఎల్‌తో రీఎంట్రీ..

ఇన్నాళ్లు అభిమానులకు దూరంగా ఉన్న ధోనీ.. ఐపీఎల్‌తో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఐపీఎల్‌ 2020లో చెన్నై సూపర్‌కింగ్స్‌ను నడిపించేందుకు ధోనీ ఉత్సాహంగా ఉన్నాడు. మరో వారం రోజుల్లో చెన్నై సూపర్‌కింగ్స్‌ శిక్షణ శిబిరంలో పాల్గొననున్నాడు. సీనియర్లు సురేశ్‌ రైనా, అంబటి రాయుడు సహా అందుబాటులో ఉన్న క్రికెటర్లతో కలిసి అతను సాధన చేస్తాడని చెన్నైసూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ వర్గాలు తెలిపాయి.

Story first published: Friday, February 28, 2020, 10:57 [IST]
Other articles published on Feb 28, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X