Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రెండో టెస్ట్‌కు పృథ్వీ షా ఫిట్.. కీపర్‌గా పంతే బరిలోకి దిగుతాడు: రవిశాస్త్రి

 Ravi Shastri answers selection questions for 2nd Test Cricket

క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్ గడ్డపై తొలి టెస్ట్‌లో ఘోరపరాజయాన్ని చవిచూసిన భారత్ రెండో టెస్ట్‌‌కు సిద్ధమైంది. శనివారం నుంచి ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. కివీస్ గడ్డపై 5 టీ20ల సిరీస్‌ను 5-0తో క్లీన్ స్వీప్ చేసి ఘన ఆరంభాన్ని అందుకున్న కోహ్లీసేన.. ఆ తర్వాత పూర్తిగా చతికిలపడింది. పేలవ ఆటతీరుతో మూడు వన్డేల సిరీస్‌లో 0-3తో క్లీన్ స్వీప్‌కు గురైంది. అనంతరం సంప్రదాయక ఫార్మాట్‌లో చేతులేత్తిసింది. రెండు టెస్ట్‌ల సిరీస్‌లో 0-1తో వెనుకంజలో నిలిచిన భారత్ సిరీస్‌ కాపాడుకోవాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితిని తెచ్చుకుంది.

టీమ్ కాంబినేషన్..

టీమ్ కాంబినేషన్..

తొలి టెస్ట్‌లో బ్యాటింగ్ వైఫల్యంతో మ్యాచ్‌ను చేజార్చుకున్న కోహ్లీసేన.. సెకండ్ టెస్ట్‌లో ఏ కాంబినేషన్స్‌తో బరిలోకి దిగుతుందనేదానిపై తీవ్ర ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా రెండు ఇన్నింగ్స్‌లో దారుణంగా విఫలమైన పృథ్వీషా‌కు అవకాశం దక్కుతుందా? లేక శుభ్‌మన్ గిల్ అరంగేట్రం చేయనున్నాడా? అనే అంశంపై తీవ్ర చర్చజరిగింది. అలాగే రిషభ్ పంత్- వృద్ధీమాన్ సాహా, రవీంద్ర జడేజా- అశ్విన్‌లలో ఎవరికి అవకాశం దక్కుతుందా? అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో వీటన్నిటికి టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి సమాధానమిచ్చాడు. రెండో టెస్ట్ సందర్భంగా శుక్రవారం మీడియాతో మాట్లాడాడు.

రెండో టెస్ట్ ముందు టీమిండియాకు షాక్.. గాయంతో ఇషాంత్ దూరం!!

 గిల్ వేచి ఉండాల్సిందే

గిల్ వేచి ఉండాల్సిందే

మయాంక్‌తో ఓపెనర్‌గా బరిలోకి దిగేది పృథ్వీషానేనని రవిశాస్త్రి స్పష్టం చేశాడు. షా గాయం నేపథ్యంలో గిల్ అరంగేట్రం ఉంటుందని జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేశాడు. ‘షా సిద్దంగా ఉన్నాడు. మయాంక్‌తో ఇన్నింగ్స్ ప్రారింభించేది అతనే. గిల్‌కు అవకాశం లేదు.'అని శాస్త్రి చెప్పుకొచ్చాడు.

అశ్విన్, జడేజాలో ఎవరా? అనేది..

అశ్విన్, జడేజాలో ఎవరా? అనేది..

ఇక అశ్విన్, జడేజాలలో ఎవరిని బరిలోకి దింపాలనేదానిపై శనివారం ఉదయం పిచ్ పరిస్థితిని చూశాక నిర్ణయం తీసుకుంటామని తెలిపాడు. ‘రేపు ఉదయం అశ్విన్, జడేజాలలో ఎవరిని ఆడించాలనేదానిపై నిర్ణయం తీసుకుంటాం. అశ్విన్ వరల్డ్‌క్లాస్ బౌలర్, ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. పరిస్థితులకు తగ్గట్టు ఎవరిని ఆడించాలనేదానిపై నిర్ణయం తీసుకుంటాం. అతను అద్భుతంగా బౌలింగ్ చేశాడు. బ్యాటింగ్‌లో విఫలమైన అతను తన సత్తా ఎంటో నిరూపించుకుంటాడు.'అని శాస్త్రి తెలిపాడు.

సాహా.. పంత్..

సాహా.. పంత్..

ఇక వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్‌నే ఆడిస్తామని టీమిండియా హెడ్ కోచ్ స్పష్టం చేశాడు. సాహా అద్భుతమైన కీపర్ అని, కానీ న్యూజిలాండ్ పిచ్‌లపై లోయరార్డర్‌లో రాణించే బ్యాట్స్‌మన్ ఉండాలి కాబట్టి పంత్‌కే అవకాశం ఇవ్వనున్నట్లు తెలిపాడు. ‘భారత్‌లో టర్నింగ్ పిచ్‌లున్నందున మేం సాహాను కీపర్‌గా కొనసాగించాం. అతనో గొప్ప కీపర్. కానీ న్యూజిలాండ్ పిచ్‌లు అంతగా స్పిన్‌కు అనుకూలించవు. పేస్ పిచ్‌లపై లోయారార్డర్ చెలరేగే బ్యాట్స్‌మన్ కావాలి. రిషభ్ అటాకింగ్ బ్యాట్స్‌మన్ కావడం అతని ఎంపికకు కలిసొచ్చింది.'శాస్త్రి చెప్పుకొచ్చాడు.

Story first published: Friday, February 28, 2020, 14:13 [IST]
Other articles published on Feb 28, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+