న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రజనీ గెటప్‌లో సెహ్వాగ్‌.. సీఎస్‌కే ఓటమి, రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై సెటైర్స్!

IPL 2020: Virender Sehwag Copies Rajinikanth To Mock Chennai, Calls Rohit Sharma vada Pav

న్యూఢిల్లీ: చెన్నైసూపర్ కింగ్స్ టీమ్‌ ఓటమి, రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైనశైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. 'వీరు కీ బైతక్'షో పేరిట ఐపీఎల్ 2020 మ్యాచ్‌లకు ముందు ఆయా జట్లపై సెహ్వాగ్ సెటైర్లు వేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ గెటప్‌లో ఆకట్టుకున్న వీరూ.. ముంబైతో మ్యాచ్‌లో పూర్తిగా తేలిపోయిన ధోనీ సేనపై విమర్శలు గుప్పించాడు.

వాష్ రూమ్‌కు వెళ్లి వచ్చేలోపే..

చెన్నై జట్టును సూపర్‌ స్టార్‌ రజనీ కాంత్‌ కూడా కాపాడలేడన్నాడు. వాష్‌రూమ్‌కు వెళ్లి వచ్చేసరికి.. చెన్నై టాప్‌ ఆర్డర్‌ పెవిలియన్‌ చేరడమేంటని విస్మయం వ్యక్తం చేశాడు. ఇంతకుముందు చెన్నై ఫ్యాన్స్ బంతిని బాదిన శబ్దానికి సంబరపడేవాళ్లని, కానీ నిన్నటి మ్యాచ్‌లో.. బంతి వికెట్‌ను గిరాటేయకుంటే చాలని భావించారని అన్నాడు. ఇక చెన్నై జట్టులోని 41 ఏళ్ల ఇమ్రాన్‌ తాహిర్‌ను చాచా (అంకుల్‌) అని ఈ మాజీ డాషింగ్ ఓపెనర్ పేర్కొన్నాడు.

వడా పావ్‌కు బదులు.. సమోసా పావ్‌..

వడా పావ్‌కు బదులు.. సమోసా పావ్‌..

అలాగే రోహిత్ శర్మ బరువును ప్రస్తావిస్తూ.. సెహ్వాగ్ చురకలు అంటించాడు. తొడ కండరాల గాయం కారణంగా చెన్నైతో మ్యాచ్‌‌కు రోహిత్ శర్మ దూరమైన విషయం తెలిసిందే. అతని స్థానంలో సౌరభ్ తివారీ జట్టులోకి రాగా.. కీరన్ పొలార్డ్ జట్టును నడిపించాడు. అయితే, బరువు విషయంలో రోహిత్‌ కన్నా సౌరబ్‌ తక్కువ వాడేం కాదన్న సెహ్వాగ్.. ‘వడా పావ్‌కు బదులు.. సమోసా పావ్‌ మ్యాచ్‌లో పాల్గొంది' అని చమత్కరించాడు.

సీనియర్ సిటజన్స్ క్లబ్‌కు కష్టమే

సీనియర్ సిటజన్స్ క్లబ్‌కు కష్టమే

ఇక మ్యాచ్‌కు ముందు ఇదే షోలో బలమైన ముంబైని ఢీకొట్టడం చెన్నైకి కష్టమేనన్నాడు. 'ఐపీఎల్‌లో మరో ఆసక్తికరపోరుకు రంగం సిద్దమైంది. ఇప్పటికే ముంబైని చెన్నై ఓడించింది. కానీ ఆ తర్వాత ముంబై వరుస విజయాలతో దూసుకెళ్తే.. చెన్నై మాత్రం వరుస పరాజయాలతో చతికిలపడింది. పైగా ఆ జట్టు సీనియర్ సిటిజన్స్ క్లబ్‌గా మారింది. ఈ పరిస్థితుల్లో ముంబైని ఓడించడం చెన్నైకి కష్టమే.'సెహ్వాగ్ ధోనీసేనపై సెటైర్లు పేల్చాడు.

ఇరగదీసిన ఇషాన్..

ఇరగదీసిన ఇషాన్..

ముంబైతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై 10 వికెట్ల తేడాతో దారుణమైన ఓటమిని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై ట్రెంట్ బౌల్ట్(4/18), జస్ ప్రీత్ బుమ్రా(2/25), రాహుల్ చాహర్ (2/22) ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 114 రన్స్ చేసింది. సామకరన్ (42 బంతుల్లో 4 ఫోర్, 2 సిక్స్‌లతో 52) మినహా అంతా దారుణంగా విఫలమయ్యారు. ధోనీ(16 బంతుల్లో 2 ఫోర్లు 1 సిక్స్‌తో 16), జడేజా(7), ఫాఫ్(1) తీవ్రంగా నిరాశపరిచారు. అనంతరం చెన్నై ఓపెనర్లు ఇషాన్ కిషన్(37 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 68 నాటౌట్), క్వింటన్ డికాక్(37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46 నాటౌట్) సూపర్ బ్యాటింగ్‌తో 12.2 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 116 పరుగులు చేసి ఘనవిజయాన్నందుకుంది.

ఆ వ్యూహంలో భాగంగానే ఫీల్డింగ్ తీసుకున్నా: కీరన్ పొలార్డ్

Story first published: Saturday, October 24, 2020, 16:58 [IST]
Other articles published on Oct 24, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X