ఆ వ్యూహంలో భాగంగానే ఫీల్డింగ్ తీసుకున్నా: కీరన్ పొలార్డ్

దుబాయ్: ఐపీఎల్ 2020లో చెన్నై సూపర్ కింగ్స్ కథ ముగిసిన విషయం తెలిసిందే. శుక్రవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో చెన్నైపై ముంబై ఇండియన్స్ 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. ఈ పరాజయంతో ధోనీ సేన ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. దారుణ బ్యాటింగ్‌తో ఈ సీజన్‌లో మూల్యం చెల్లించుకున్న చెన్నై అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ముంబైతో జరిగిన మ్యాచ్‌లోనైతే మరి దారుణంగా విఫలమైంది.
సామ్ కరన్ హాఫ్ సెంచరీతో పోరాడటంతో కనీసం 100 పరుగుల మార్క్‌నైనా అందుకోగలిగింది. అయితే చెన్నై బ్యాటింగ్ తడబాటు గమనించే ఈ మ్యాచ్‌లో టాస్ గెలవగానే ఫీల్డింగ్ తీసుకున్నానని ముంబై ఇండియన్స్ తాత్కలిక కెప్టెన్ కీరన్ పొలార్డ్ తెలిపాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో కూడా చెన్నై స్వల్ప స్కోర్‌కే పరిమితమై ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాను చేజింగ్‌కు మొగ్గు చూపానని ఈ విండీస్ ఆల్‌రౌండర్ చెప్పుకొచ్చాడు. తొడకండరాలు పట్టేయడంతో రోహిత్ ఈ మ్యాచ్‌కు దూరమైన విషయం తెలిసిందే.

చేజింగే ఈజీ..
చెన్నైని 160లోపు కట్టడి చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగామని కానీ, వారి టాపార్డర్ విఫలమై తమ పనిని చాలా సులువు చేసిందన్నాడు. ‘ఈ సీజన్ ఫస్ట్ మ్యాచ్‌లో మేం ఫస్ట్ బ్యాటింగ్ చేశాం. కానీ స్వల్ప స్కోర్ చేసి ఓటమిపాలయ్యాం. బ్యాటింగ్ సెకండ్ చేసినప్పుడే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయనేది నా గట్టి నమ్మకం.160 రన్స్ కాపాడుకోవడం కంటే చేజ్ చేయడమే సులువు. పైగా గత మ్యాచ్‌లో చెన్నై బ్యాటింగ్ బాలేదు. దాంతోనే తొలుత ఫీల్డింగ్ తీసుకొని వారిని మరింత ఒత్తిడిలోకి నెట్టాలనుకున్నాం. ప్రణాళికకు తగ్గట్టుగానే ఆరంభంలోనే మాకు వికెట్లు దక్కడంతో మా పని మరింత సులువైంది'అని పొలార్డ్ చెప్పుకొచ్చాడు.

అందుకే బుమ్రా చేతికి కొత్త బంతి..
అంబటి రాయుడుని ఔట్ చేసే ప్రణాళికలో భాగంగానే యార్కర్ల కింగ్ జస్‌ప్రీత్ బుమ్రాకి కొత్త బంతిని అందించానని పొలార్డ్ చెప్పుకొచ్చాడు. ‘తొలుత జస్‌ప్రీత్ బుమ్రాకు కొత్త బంతిని ఇవ్వాలనుకోలేదు. కానీ పిచ్ పరిస్థితులు, స్వింగ్‌కు అనుకూలించడం.. బౌల్ట్ మంచి శుభారంభం అందించడంతో రెండో ఓవర్‌లోనే బుమ్రాను తీసుకురావాల్సి వచ్చింది. ఆదిలోనే వికెట్ కోల్పోవడంతో రాయుడు క్రీజులోకి వచ్చాడు. గత మ్యాచ్‌లో అతను మా విజయాన్ని లాగేసుకున్నాడు. అతన్ని ఔట్ చేయాలనే లక్ష్యంతోనే బుమ్రాతో బౌలింగ్ చేయించా. అది ఫలితాన్నిచ్చింది'అని పొలార్డ్ తెలిపాడు.

100లోపే..
చెన్నైని 100 పరుగుల లోపే కట్టడి చేయాలని భావించినా సామ్ కరన్ అద్భుత ప్రదర్శనతో అది సాధ్యం కాలేదని పొలార్డ్ తెలిపాడు. కరన్ కొరకరాని కొయ్యలా మారడంతో చెన్నై ఆ మాత్రం పరుగులు చేయగలిగిందని అన్నాడు. తొలి పవర్ ప్లే ముగిసే సమయానికి టాప్ 5 వికెట్లను కూల్చడం ఆనందాన్నిచ్చింద చెప్పుకొచ్చాడు. ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా అదిరిపోయే బౌలింగ్‌తో చెన్నై ఆటగాళ్లు తేరుకోలేకపోయారని చెప్పుకొచ్చాడు. సమష్టి ప్రదర్శనతో ముంబై గెలిచిందన్నాడు.

ముంబై ఆడుతూ.. పాడుతూ..
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై ట్రెంట్ బౌల్ట్(4/18), జస్ ప్రీత్ బుమ్రా(2/25), రాహుల్ చాహర్ (2/22) ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 114 రన్స్ చేసింది. సామకరన్ (42 బంతుల్లో 4 ఫోర్, 2 సిక్స్‌లతో 52) మినహా అంతా దారుణంగా విఫలమయ్యారు. ధోనీ(16 బంతుల్లో 2 ఫోర్లు 1 సిక్స్‌తో 16), జడేజా(7), ఫాఫ్(1) తీవ్రంగా నిరాశపరిచారు. అనంతరం చెన్నై ఓపెనర్లు ఇషాన్ కిషన్(37 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 68 నాటౌట్), క్వింటన్ డికాక్(37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46 నాటౌట్) సూపర్ బ్యాటింగ్‌తో 12.2 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 116 పరుగులు చేసి ఘనవిజయాన్నందుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
చాలా బాధగా ఉంది.. ఈ ఏడాది మాకు కలిసి రాలేదు: ధోనీ