Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: ఇది నీ స్కూల్ కాదు.. నేను టీచర్‌ను కాదు! వైభవ్ సూర్యవంశీని ఔట్ చేసిన జడేజా!

ఐపీఎల్ 2026 సీజన్ కోసం రాజస్థాన్ రాయల్స్ జట్టు తమ సన్నాహకాలను మొదలుపెట్టింది. టీమిండియా స్టార్ ప్లేయర్ రవీంద్ర జడేజా తిరిగి జట్టులో చేరడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఐపీఎల్ 2026 సీజన్ మినీ వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ నుంచి రవీంద్ర జడేజాను రాజస్థాన్ రాయల్స్ ట్రేడింగ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ట్రేడ్ డీల్‌లో భాగంగా జడేజాతో పాటు సామ్ కరణ్‌ను రాజస్థాన్ రాయల్స్‌కు ఇచ్చేసిన చెన్నై సూపర్ కింగ్స్.. సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకుంది.

రాజస్థాన్ రాయల్స్‌తోనే ఐపీఎల్ కెరీర్ ప్రారంభించిన రవీంద్ర జడేజా ఇన్నాళ్లకు తిరిగి సొంతగూటికి చేరాడు. ట్రైనింగ్ క్యాంప్‌లో టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి జడేజా బౌలింగ్ చేశాడు. జడేజా లెఫ్టార్మ్ స్పిన్‌ను వైభవ్ అంచనా వేయలేక పలుమార్లు ఔటయ్యాడు. ఈ వీడియోను రాజస్థాన్ రాయల్స్‌ సోషల్ మీడియా వేదికగా పంచుకోగా.. వైరల్‌గా మారింది. 'ఇది నీ స్కూల్ కాదు.. నేను నీ టీచర్‌ను కాదు'అన్నట్లు జడేజా బౌలింగ్ చేశాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. జడేజా బౌలింగ్‌కు కుర్రాడు భయపడ్డాడని కూడా సెటైర్లు పేల్చుతున్నారు.

RR Training Highlights 14-Year-Old Vaibhav Suryavanshi Takes On Ravindra Jadeja in Intense IPL 2026 Net Session

బలంగానే రాజస్థాన్ రాయల్స్..

సంజూ శాంసన్‌ జట్టును వీడినా రాజస్థాన్ రాయల్స్ బలంగా ఉందని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. 'సంజూ శాంసన్ లేకున్నా.. వారికి మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్‌తో ఇన్నింగ్స్ ప్రారంభిస్తే.. ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మైర్, డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, సామ్ కరన్ మిడిలార్డర్‌లో ఆడనున్నారు. ఈ బ్యాటింగ్ లైనప్ ఏ రకంగా చూసినా బలంగానే ఉంది. ఆరంభంలోనే మరింత దూకుడుగా ఆడాలంటే ప్రిటోరియస్‌ను తుది జట్టులో ఆడించవచ్చు.

రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కావాల్సిన ప్రతిభ ఉంది. సంజూ శాంసన్ లేకపోయినా.. బ్యాటింగ్ లైనప్‌లో అంతటి బలం రాజస్థాన్ రాయల్స్ సొంతం. జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్, తుషార్ దేశ్‌పాండే, క్వేనా మఫాకా, ఆడమ్ మిల్నే, సందీప్ శర్మ, కుల్దీప్ సేన్, యుజ్వేంద్ర సింగ్‌లతో బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా ఉంది.'అని చోప్రా చెప్పుకొచ్చాడు.

Story first published: Friday, March 20, 2026, 15:58 [IST]
Other articles published on Mar 20, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+