For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2026: కమిన్స్ బాటలోనే మిచెల్ స్టార్క్!

ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్, ఆస్ట్రేలియా క్రికెటర్ మిచెల్ స్టార్క్.. ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా స్టార్క్‌ విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియా కఠిన వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. దాంతో గాయాలతో ఇబ్బంది పడుతున్న ప్యాట్ కమిన్స్, జోష్ హజెల్ వుడ్‌ తరహాలోనే ఐపీఎల్ 2026 ఆరంభ మ్యాచ్‌లకు కమిన్స్ దూరంగా ఉండనున్నాడు.

గతేడాదిగా మిచెల్ స్టార్క్‌పై తీవ్ర పనిభారం పడిందని క్రికెట్ ఆస్ట్రేలియా వర్గాలు తెలిపాయి. ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల యాషెస్ సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లు ఆడాడు. బిగ్‌బాష్ లీగ్‌లోనూ అద్భుత బౌలింగ్‌తో మెరిశాడు. టెస్ట్‌ల్లో అత్యధిక బంతులు విసిరిన బౌలర్ల జాబితాలో ముందున్నాడు. టీ20ల్లో వేసేది నాలుగు ఓవర్లే అయినా.. ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

Big Blow For Delhi Capitals Rs 11 75 Crore Star Mitchell Starc To Miss Early Stages Of IPL 2026

కొత్త బంతితో అద్భుతాలు చేసే స్టార్క్‌పై వర్క్‌లోడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆసీస్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. అందుకే రాబోయే రోజుల్లో రిటర్న్ టు ప్లే ప్రొటోకాల్స్‌ను అనుసరించి క్రికెట్ ఆస్ట్రేలియా అనుమతి ఇవ్వనుంది. దాంతో తొలి వారంలో మ్యాచ్‌లకు అతను దూరమయ్యే అవకాశాలే అధికంగా ఉన్నాయని క్రికెటర్ వర్గాలు పేర్కొన్నాయి. అంతర్జాతీయ టీ20లకు గతేడాది వీడ్కోలు పలికిన స్టార్క్.. టెస్ట్‌లు, వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఫ్రాంచైజీ క్రికెట్ ఆడుతున్నాడు.

మిచెట్ స్టార్క్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.11.75 కోట్లకు సొంతం చేసుకుంది. ఆసీస్ ప్లేయర్లలో కమిన్స్, హేజిల్‌వుడ్ సైతం ఆరంభ ఐపీఎల్ మ్యాచ్‌లకు దూరం అవ్వగా.. ఎల్లిస్ ఈ సీజన్ మొత్తానికే దూరమయ్యాడు.ఆస్ట్రేలియా యువ ఆల్‌రౌండర్, సన్‌రైజర్స్ ప్లేయర్ జాక్ ఎడ్వర్డ్స్ కూడా ఈ సీజన్ మొత్తానికి దూరం కానున్నాడని వార్తలు వచ్చాయి.

Story first published: Friday, March 20, 2026, 13:22 [IST]
Other articles published on Mar 20, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+