న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అబ్బో నీకు సిక్స్ ప్యాక్ ఉన్నట్టే..సిగ్గుండాలి సెహ్వాగ్..రోహిత్ శర్మను వడా పావ్ అనడంపై ఫ్యాన్స్ ఫైర్

IPL 2020: Twitter reactions after Virender Sehwag for calling Rohit Sharma vada pav

హైదరాబాద్: టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. సెటైర్ల పేరిట సెహ్వాగ్ ఆటగాళ్లను కించపరుస్తుడన్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మాజీ క్రికెటర్‌కు సహచర ఆటగాళ్ల పట్ల గౌరవం లేదని ట్రోల్ చేస్తున్నారు. సభ్యత, సంస్కారం మరిచి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నాడని ఘాటుగా విమర్శిస్తున్నారు.

అయితే ఐపీఎల్ 2020 సీజన్ సందర్భంగా 'వీరూకీ బైతక్' షో పేరిట సెహ్వాగ్ ప్రతీ మ్యాచ్‌పై తనదైన శైలిలో వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ ఫిట్‌నెస్ విషయాన్ని ప్రస్తావిస్తూ అతనో వడాపావ్ అని పిలిచాడు. ఇది హిట్ మ్యాన్ అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దాంతో వారు సోషల్ మీడియా వేదికగా సెహ్వాగ్ తీరును తప్పుబడుతున్నారు.

వడాపావ్ స్థానంలో సమోసా పావ్..

చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌కు తొడ కండరాల గాయం కారణంగా రోహిత్ శర్మ దూరమయ్యాడు. దాంతో కీరన్ పొలార్డ్ తాత్కలిక సారథిగా ముంబై జట్టును నడిపించి అద్భుత విజయాన్నందించాడు. చెన్నై స్వల్ప స్కోర్‌కే కట్టడి చేసిన ముంబై.. అనంతరం ఇషాన్ కిషన్, డికాక్ సూపర్ బ్యాటింగ్‌తో 10 వికెట్లతో విజయాన్నందుకుంది. ఈ మ్యాచ్‌పై తన షోలో మాట్లాడిన సెహ్వాగ్.. వడాపావ్‌లాంటి రోహిత్ శర్మ స్థానంలో సమోసాపావ్ వంటి సౌరభ్ వర్మ వచ్చాడన్నాడు. ‘రోహిత్ ఆడలేదు.వడాపావ్‌కు గాయమైతే ఏం జరుగుతుంది. ఆ స్థానాన్ని సమోసా పావ్ తీసుకుంటుంది'అని చెప్పుకొచ్చాడు.

సెహ్వాగ్.. సిగ్గుండాలి..

ఈ వ్యాఖ్యలపై రోహిత్ శర్మ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అబ్బో తమరికి సిక్స్ ప్యాక్ ఉన్నట్లే మాట్లాడుతున్నారు కదా'అని ఒకరంటే.. ఫిట్‌నెస్ గురించి నువ్వే మాట్లాడాలి వీరూ భాయ్ అని ఇంకొకరు కామెంట్ చేశారు. ‘ఒకరిని అనేముందు నీ లోపాలను సరిచూసుకో'అని మరొకరు విమర్శించారు. సెహ్వాగ్‌ను విపరీతంగా అభిమానించేవాళ్లమని, కానీ అతని వ్యాఖ్యల పట్ల సిగ్గుపడుతున్నామని ఓ అభిమాని ఆవేదన వ్యక్తం చేశాడు.

రోహిత్‌కు నోచాన్స్..

రోహిత్‌కు నోచాన్స్..

ఇక గాయంతో ఐపీఎల్‌లో రెండు మ్యాచ్‌లకు దూరమైన రోహిత్ శర్మకు గట్టి షాకే తగిలింది. టీమిండియా అప్‌కమింగ్ ఆస్ట్రేలియా టూర్ మొత్తానికి రోహిత్ దూరమయ్యాడు. రోహిత్, ఇషాంత్ గాయాలను తమ మెడికల్ టీమ్ పర్యవేక్షిస్తుందని, కోలుకున్న తర్వాత పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ ప్రకటించింది. అయితే రోహిత్ గాయంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రోహిత్ శర్మ ఆదివారం నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడని, గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే ప్రాక్టీస్ ఎలా చేస్తాడని అభిమానులు, నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

టాప్‌లో ముంబై..

టాప్‌లో ముంబై..

ఇక గత రెండు ఐపీఎల్ మ్యాచ్‌లకు రోహిత్ దూరమైనా.. ముంబై ఇండియన్స్‌పై ఎలాంటి ప్రభావం పడలేదు. రాజస్థాన్ చేతిలో ఓడినా.. అది ఆ జట్టు సూపర్ బ్యాటింగ్‌తోనే విజయాన్నందుకుంది. ముంబై జట్టులో ప్రతి ఒక్కరూ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. ఒకరికి మించి మరొకరు అన్నట్లు పోటీ పడి మరి ఆడుతున్నారు. దాంతో ఆ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. రోహిత్ ప్రాక్టీస్ వీడియోలు చూస్తుంటే తదుపరి మ్యాచ్‌లోకి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అతను ఆ మ్యాచ్‌ ఆడి చెలరేగితే.. బీసీసీఐ,సెలెక్షన్ కమిటీకి తలనొప్పులు తప్పవు.

RCB vs CSK: అంబటి రాయుడికి దసరా సెగ.. మ్యాచ్ మధ్యలో వాష్‌రూమ్‌కు పరుగు.. ఆటకు ఆలస్యం!

Story first published: Tuesday, October 27, 2020, 15:01 [IST]
Other articles published on Oct 27, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X