IPL 2026: చరిత్ర సృష్టించిన మనీష్ పాండే!
కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) వెటరన్ బ్యాటర్ మనీష్ పాండే చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే 19 సీజన్లు ఆడిన మూడో బ్యాటర్‌గా నిలిచాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మాత్రమే ఈ ఫీట్ సాధించగా.. మనీష్ పాండే తాజాగా ఈ జాబితాలో చేరాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఉప్పల్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో బరిలోకి దిగడం ద్వారా మనీష్ పాండే ఈ ఫీట్ సాధించాడు.
ఈ సీజన్‌లో మనీష్ పాండేకు ఇదే తొలి మ్యాచ్. కేకేఆర్ రెగ్యులర్ ప్లేయర్ రమణ్‌దీప్ సింగ్ స్థానంలో మనీష్ పాండే తుది జట్టులోకి వచ్చాడు. ఐపీఎల్‌లోని 19 సీజన్లలో మనీష్ పాండే కనీసం ఒక్క మ్యాచ్ ఆడాడు. అరంగేట్ర సీజన్ 2008లో ముంబై ఇండియన్స్‌తో ఐపీఎల్ కెరీర్ ప్రారంభించిన మనీష్ పాండే.. ఆ మరుసటి ఏడాది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) జట్టుకు మారాడు.

ఐపీఎల్ 2010లో కూడా ఆ జట్టుకే ఆడాడు. ఐపీఎల్ 2011లో మాత్రం పుణె వారియర్స్ ఇండియాకు ఆడిన మనీష్ పాండే 2013 వరకు ఆ జట్టులోనే కొనసాగాడు. 2014లో కేకేఆర్ జట్టులో చేరి 2017 వరకు కొనసాగాడు. కేకేఆర్ టైటిల్ గెలిచిన 2014 సీజన్‌లో ఫైనల్లో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కనబర్చాడు.
ఐపీఎల్ 2018లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో చేరి 2021 వరకు ఆ జట్టు తరఫునే ఆడాడు. ఐపీఎల్ 2022 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్, ఐపీఎల్ 2023లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున బరిలోకి దిగాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో కేకేఆర్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన మనీష్ పాండే.. అప్పటి నుంచి ఆ జట్టులోనే కొనసాగుతున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన మనీష్ పాండే.. ఐపీఎల్ 2025 సీజన్‌లో మూడు మ్యాచ్‌లు ఆడాడు.
ఐపీఎల్ చరిత్రలోనే 19 సీజన్ ఆడిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. మనీష్ పాండే వారి సరసన చేరాడు. మహేంద్ర సింగ్ ధోనీ, రవీంద్ర జడేజా 18 సీజన్లతో తర్వాతి స్థానాల్లో నిలిచారు. ధోనీ ఈ సీజన్‌లో ఇంకా ఒక్క మ్యాచ్ ఆడలేదు. అతను ఒక మ్యాచ్ ఆడితే.. కోహ్లీ, రోహిత్ సరసన చేరనున్నాడు.
19 సీజన్లు ఆడిన మనీష్ పాండే ఇప్పటి వరకు 175 మ్యాచ్‌లే ఆడాడు. 29.41 సగటుతో 3942 పరుగులు చేశాడు. గత ఐదేళ్లుగా అతను నిలకడలేమి ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నాడు. 278 మ్యాచ్‌లతో ధోనీ అగ్రస్థానంలో ఉండగా.. రోహిత్, విరాట్ కోహ్లీ 276 మ్యాచ్‌లతో రెండో స్థానంలో కొనసాగుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications