Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs KKR: అమ్మనా బత్తాయో.. బిర్యానీతో ఇచ్చిపడేసారుగా..!

ఐపీఎల్ 2026 సీజన్ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH), కోల్‌కతా నైట్‌రైడర్స్(KKR) మధ్య ఎక్స్ వేదికగా సరదా కౌంటర్లు కొనసాగుతున్నాయి. ఈ సీజన్ ఆరంభంలో ఏప్రిల్ 2న కోల్‌కతా వేదికగా జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. ఈ విజయాన్ని ఉద్దేశించి సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎక్స్ వేదికగా హౌరా బ్రిడ్జి బ్యాక్‌డ్రాప్‌లోని బిర్యానీ ఫొటో పెట్టి 'అద్భుతమైన ప్రదర్శన తర్వాత మన బిర్యానీ'అని ఎక్స్‌ వేదికగా షేర్ చేసింది.

ఈ పోస్ట్‌ను మనసులో పెట్టుకున్న కేకేఆర్ మౌనంగా అవకాశం కోసం ఎదురు చూసింది. ఆదివారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన కేకేఆర్ 7 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. ఈ గెలుపుతో సీజన్ ఆరంభంలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది.

IPL 2026 KKR Trolls SRH with Charminar and Biryani Post After 7-Wicket Win at Uppal

ఈ విజయం నేపథ్యంలో ఎక్స్‌వేదికగా చార్మినార్ బ్యాక్‌డ్రాప్‌లో బిర్యానీ ఫొటోను 'ఇవాళ మాకు పార్టీ మొదలైంది'అని కౌంటరిచ్చింది. ఈ ఫన్నీ కౌంటర్స్‌పై ఫ్యాన్స్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. 'అమ్మనా బత్తాయో.. బిర్యానీతో ఇచ్చిపడేసారుగా..!'అని కామెంట్ చేస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 19 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌటైంది. ట్రావిస్ హెడ్(28 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 61) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. ఇషాన్ కిషన్(29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42)కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ(3/36) మూడు వికెట్లు తీయగా.. సునీల్ నరైన్(2/31), కార్తీక్ త్యాగీ రెండేసి వికెట్లు పడగొట్టారు. వైభవ్ అరోరా, కామెరూన్ గ్రీన్, అనుకుల్ రాయ్ తలో వికెట్ తీసారు.

అనంతరం కేకేఆర్ ఓవర్లలో 2 వికెట్లకు 166 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. అంగ్‌క్రిష్ రఘువంశీ(47 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 59)హాఫ్ సెంచరీతో రాణించగా.. కెప్టెన్ అజింక్యా రహానే(36 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 43) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో పాట్ కమిన్స్, సకీబ్ హుస్సేన్, శివాంగ్ కుమార్ తలో వికెట్ తీసారు.

Story first published: Sunday, May 3, 2026, 22:55 [IST]
Other articles published on May 3, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+