నా వల్లే ఈ ఓటమి: పాట్ కమిన్స్
బ్యాటింగ్ వైఫల్యంతో పాటు తన చెత్త బౌలింగ్ తమ ఓటమిని శాసించిందని సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) కెప్టెన్ పాట్ కమిన్స్ అన్నాడు. బ్యాటింగ్‌లో 20-30 పరుగులు అదనంగా చేసినా.. తాను ఒకే ఓవర్‌లో 27 పరుగులు ఇవ్వకున్నా మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదని చెప్పాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్)తో ఆదివారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన సన్‌రైజర్స్ హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.
వరుసగా 5 విజయాల తర్వాత ఆరెంజ్ ఆర్మీ ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన పాట్ కమిన్స్.. తన వల్లే ఓటమి ఎదురైందని చెప్పాడు.
180 ప్లస్ చేయాల్సింది..
'ఈ రోజు మాకు కలిసి రాలేదు. మేం చాలా మంచి ఆరంభాన్ని అందుకున్నాం. కానీ ఆ తర్వాత పూర్తి స్థాయిలో రాణించలేకపోయాం. మాకు లభించిన ఆరంభాన్ని బట్టి మేం కనీసం 180-200 ప్లస్ స్కోర్ చేయాల్సింది. కానీ అది సాధ్యం కాలేదు. పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్ చేయలేకపోయాం.

ఈ వికెట్‌పై 180 పరుగుల లక్ష్యం మంచి స్కోర్ అవుతుందని నేను భావించాను. ప్రత్యర్థి ఆటగాళ్లకు తగ్గట్లు మేం వ్యూహాలను బాగానే రచించాం. కానీ మ్యాచ్ సెకండాఫ్‌లో కీలక క్షణాలను సద్వినియోగం చేసుకోలేకపోయాం. ఇందులో నా తప్పు కూడా ఉంది. 180 పరుగులు చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది. ఎందుకంటే పిచ్ కొద్దిగా పొడిగా మారి నెమ్మదించింది. 180+ పరుగులు చేసి ఉండాల్సింది.
ఆ 27 పరుగుల ఇవ్వకపోయి ఉంటే..
వరుసగా ఐదు మ్యాచ్‌ల తర్వాత ఓడాం. అయితే ఈ మ్యాచ్‌లో కూడా స్వల్ప తేడాతో విజయాన్ని చేజార్చుకున్నాం. ఈ మ్యాచ్‌లో ఓడినా మాకు సానుకూల అంశాలు చాలా ఉన్నాయి. మా బౌలింగ్ విభాగంతో మ్యాచ్‌ను చివరి వరకు లాక్కొచ్చాం. నా ఓవర్‌లో 27 పరుగులు ఇవ్వడం మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపింది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న క్షణాలే పెద్ద మార్పును సృష్టిస్తాయి.'అని పాట్ కమిన్స్ చెప్పుకొచ్చాడు.
కేకేఆర్ అలవోకగా..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 19 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌటైంది. ట్రావిస్ హెడ్(28 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 61) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. ఇషాన్ కిషన్(29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42)కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ(3/36) మూడు వికెట్లు తీయగా.. సునీల్ నరైన్(2/31), కార్తీక్ త్యాగీ రెండేసి వికెట్లు పడగొట్టారు. వైభవ్ అరోరా, కామెరూన్ గ్రీన్, అనుకుల్ రాయ్ తలో వికెట్ తీసారు.
అనంతరం కేకేఆర్ ఓవర్లలో 2 వికెట్లకు 166 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. అంగ్‌క్రిష్ రఘువంశీ(47 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 59)హాఫ్ సెంచరీతో రాణించగా.. కెప్టెన్ అజింక్యా రహానే(36 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 43) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో పాట్ కమిన్స్, సకీబ్ హుస్సేన్, శివాంగ్ కుమార్ తలో వికెట్ తీసారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications