Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: కొంపముంచిన కమిన్స్.. SRHపై కేకేఆర్ ఘనవిజయం!

ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జైత్రయాత్రకు బ్రేక్ పడింది. వరుసగా 5 విజయాల తర్వాత ఓటమిపాలైంది. ఆదివారం ఉప్పల్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన సన్‌రైజర్స్ హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో చిత్తయ్యింది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కేకేఆర్ అద్భుత విజయాన్నందుకుంది. ముందుగా బౌలింగ్‌లో సత్తా చాటి.. ఆ తర్వాత బ్యాటింగ్‌లో దుమ్మురేపింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 19 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌటైంది. ట్రావిస్ హెడ్(28 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 61) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. ఇషాన్ కిషన్(29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42)కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ(3/36) మూడు వికెట్లు తీయగా.. సునీల్ నరైన్(2/31), కార్తీక్ త్యాగీ రెండేసి వికెట్లు పడగొట్టారు. వైభవ్ అరోరా, కామెరూన్ గ్రీన్, అనుకుల్ రాయ్ తలో వికెట్ తీసారు.

IPL 2026 Pat Cummins Decision to Bat First Backfires as KKR Edge Out SRH at Uppal

అనంతరం కేకేఆర్ 18.2 ఓవర్లలో 3 వికెట్లకు 169 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. అంగ్‌క్రిష్ రఘువంశీ(47 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 59)హాఫ్ సెంచరీతో రాణించగా.. కెప్టెన్ అజింక్యా రహానే(36 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 43) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో పాట్ కమిన్స్, సకీబ్ హుస్సేన్, శివాంగ్ కుమార్ తలో వికెట్ తీసారు.

బ్యాటింగ్ వైఫల్యం సన్‌రైజర్స్ హైదరాబాద్ కొంపముంచింది. ట్రావిస్ హెడ్ విధ్వంసంతో పవర్ ప్లేలోనే 71 పరుగులు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఆ తర్వాత తడబడింది. స్పిన్నర్ల రాకతో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తీ, సునీల్ నరైన్ తమ స్పిన్‌తో మ్యాచ్‌ను తిప్పేసారు. బంతి టర్న్ అవుతుందనే విషయాన్ని మరిచి సన్‌రైజర్స్ బ్యాటర్లు చెత్త షాట్లతో మూల్యం చెల్లించుకున్నారు.

అభిషేక్ శర్మ(15)తో పాటు క్లాసెన్(11), రవిచంద్రన్ సమ్రన్(4), అనికేత్ వర్మ(6), సలీల్ అరోరా(2), ప్యాట్ కమిన్స్(10), శివాంగ్ కుమార్(1), హర్షల్ పటేల్(6) తీవ్రంగా నిరాశపర్చారు. ఆ తర్వాత కేకేఆర్ టార్గెట్ చిన్నది కావడంతో ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకోవడం కొంపముంచింది. పిచ్ అంచనా వేయడంలో సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ విఫలమైంది.

అంతేకాకుండా కమిన్స్ ఒకే ఓవర్‌లో 27 పరుగులు సమర్పించుకోవడం కూడా సన్‌రైజర్స్ పతనాన్ని శాసించింది. కమిన్స్ వేసిన నాలుగో ఓవర్‌లో ఫిన్ అలెన్ ధాటికి వరుసగా 4wd, 6,2,6,4,4, W సమర్పించుకున్నాడు. ఫిన్ అలెన్ ఔటైనా.. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నితీష్ కుమార్ రెడ్డి గైర్హాజరీ కూడా టీమ్ కాంబినేషన్‌ను దెబ్బతీసింది.

Story first published: Sunday, May 3, 2026, 19:13 [IST]
Other articles published on May 3, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+