Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

GT vs PBKS: అతని వల్లే ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచాం: శుభ్‌మన్ గిల్

వాషింగ్టన్ సుందర్ అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతోనే విజయం సాధించామని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అన్నాడు. అతను లేకుంటే ఈ మ్యాచ్‌లో ఓడిపోయేవాళ్లమని తెలిపాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఆదివారం అహ్మదాబాద్ వేదికగా ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 4 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన శుభ్‌మన్ గిల్ వాషింగ్టన్ సుందర్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు.

బ్యాటింగ్‌కు కఠినమైన పిచ్..

పిచ్ బ్యాటింగ్‌కు ప్రతికూలంగా ఉందని, సెట్ అయిన బ్యాటర్ ఆఖరి వరకు ఆడాలని అనుకున్నామని చెప్పాడు. అదృష్టవశాత్తూ ఆ బాధ్యతను వాషింగ్టన్ సుందర్ నిర్వర్తించాడని సంతోషం వ్యక్తం చేశాడు. 'ఇలాంటి ఛేజింగ్‌ల్లో మ్యాచ్‌ను చివరి వరకు తీసుకెళ్లకుండా ముందే ముగించాలి. కానీ మాకు రెండు కీలక పాయింట్లు సాధించడం ముఖ్యం. ఇది మేం 15-16 ఓవర్లలో ఛేజ్ చేసే రకమైన పిచ్ కాదు. కాబట్టి మ్యాచ్‌ను ఒకటి లేదా రెండు ఓవర్ల ముందే ముగించాలని మేం అనుకున్నాం.

IPL 2026 Shubman Gill Credits Washington Sundar s Unbeaten 40 for GT s Thrilling Win Over PBKS
Photo Credit: screen grab for JioHotstar

మామధ్య జరిగిన చర్చ కూడా అదే. ఇలాంటి వికెట్లపై క్రీజులో కుదురుకున్న బ్యాటర్ చివరి వరకు ఆడటం ముఖ్యం, ఎందుకంటే ఇక్కడ ఎదుర్కొన్న తొలి బంతి నుంచే భారీ షాట్లు కొట్టడం అంత సులవు కాదు. ఇతర పిచ్‌ల లాగా ఇక్కడ లెంగ్త్ బంతులు బ్యాటింగ్‌కు అనుకూలంగా రాలేదు. అందుకే కుదురుకున్న బ్యాటర్ క్రీజులో ఉండటం చాలా కీలకంగా మారింది.

అదృష్టవశాత్తూ మాకు వాషింగ్టన్ సుందర్ ఆ పని చేసి పెట్టాడు. ఆఖరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్‌ను ముగించాడు. కండిషన్స్‌కు తగ్గట్లే బ్యాటర్లను పంపించాం. రైట్ హ్యాండర్స్, లెఫ్టాండ్స్ అనే విషయాన్ని పట్టించుకోలేదు.'అని గిల్ చెప్పుకొచ్చాడు.

గెలిపించిన సుందరం..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 163 పరుగులు చేసింది. సూర్యాన్ష్ షెద్గే(29 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 57) హాఫ్ సెంచరీతో రాణించగా.. మార్కస్ స్టోయినీస్(31 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 40), మార్కో జాన్సెన్(11 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 20) విలువైన పరుగులు చేశారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో జాసన్ హోల్డర్(4/24) నాలుగు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్, కగిసో రబడా రెండేసి వికెట్లు పడగొట్టగా.. రషీద్ ఖాన్ ఒక వికెట్ తీసాడు.

అనంతరం గుజరాత్ టైటాన్స్ 19.5 ఓవర్లలో 6 వికెట్లకు 167 పరుగులు చేసి గెలుపొందింది. సాయి సుదర్శన్(41 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 57) హాఫ్ సెంచరీతో రాణించగా.. వాషింగ్టన్ సుందర్(23 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 40 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో విజయ్‌కుమార్ వైశాఖ్(2/30), అర్ష్‌దీప్ సింగ్(2/24) రెండేసి వికెట్లు తీయగా.. మార్కోజాన్సెన్, మార్కస్ స్టోయినీస్ తలో వికెట్ తీసారు. గుజరాత్ టైటాన్స్‌కు ఇది వరుసగా మూడో విజయం కాగా.. పంజాబ్ కింగ్స్‌కు రెండో పరాజయం.

Story first published: Monday, May 4, 2026, 6:45 [IST]
Other articles published on May 4, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+