Rovman Powell కళ్లు చెదిరే క్యాచ్.. పోలా అదిరిపోలా!(వీడియో)
కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) స్టార్ ఆల్‌రౌండర్ రోవమన్ పోవెల్ కళ్లు చెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆదివారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో రోవ్‌మన్ పోవెల్ సింగిల్ హ్యాండ్ జంప్ క్యాచ్‌తో ఆకట్టుకున్నాడు.
అతని స్టన్నింగ్ క్యాచ్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ డేంజరస్ బ్యాటర్ హెన్రీచ్ క్లాసెన్(11) నిరాశగా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. రోవ్‌మన్ పోవెల్‌పై ఫ్యాన్స్ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ సీజన్ బెస్ట్ క్యాచ్‌ల్లో ఇది కూడా ఒకటిగా నిలుస్తుందని కామెంట్ చేస్తున్నారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ సందర్భంగా కామెరూన్ గ్రీన్ వేసిన 11వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ నాలుగో బంతిని క్లాసెన్.. డీప్ మిడ్ వికెట్ దిశగా భారీ షాట్ ఆడగా.. పోవెల్ తన కుడివైపు పరుగెత్తి గాల్లోకి జంప్ చేసి సింగిల్ హ్యాండ్ క్యాచ్ అందుకున్నాడు. బ్యాలెన్స్ కోల్పోయి కిందపడినా.. బంతిని మాత్రం వదల్లేదు. పలు కోణాల్లో రిప్లేలను పరిశీలించిన థర్డ్ అంపైర్ ఔటిచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 19 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌటైంది. ట్రావిస్ హెడ్(28 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 61) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. ఇషాన్ కిషన్(29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42)కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ(3/36) మూడు వికెట్లు తీయగా.. సునీల్ నరైన్(2/31), కార్తీక్ త్యాగీ రెండేసి వికెట్లు పడగొట్టారు. వైభవ్ అరోరా, కామెరూన్ గ్రీన్, అనుకుల్ రాయ్ తలో వికెట్ తీసారు.
ట్రావిస్ హెడ్ విధ్వంసంతో పవర్ ప్లేలోనే 71 పరుగులు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఆ తర్వాత తడబడింది. స్పిన్నర్ల రాకతో సన్‌రైజర్స్ హైదరాబాబ్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. అభిషేక్ శర్మ(15)తో పాటు క్లాసెన్(11), రవిచంద్రన్ సమ్రన్(4), అనికేత్ వర్మ(6), సలీల్ అరోరా(2), ప్యాట్ కమిన్స్(10), శివాంగ్ కుమార్(1), హర్షల్ పటేల్(6) తీవ్రంగా నిరాశపర్చారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications