IPL 2026: SRHపై ఘన విజయం.. కేకేఆర్ ప్లే ఆఫ్స్ చేరాలంటే?
ఐపీఎల్ 2026 సీజన్‌ను పేలవంగా ప్రారంభించిన కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) ఎట్టకేలకు గెలుపు ట్రాక్ అందుకుంది. తొలి 6 మ్యాచ్‌ల్లో ఒక్క విజయం కూడా నమోదు చేయని కేకేఆర్ వరుసగా మూడింటిలో గెలిచి హ్యాట్రిక్ విక్టరీ అందుకుంది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ప్రతీ మ్యాచ్‌లో గెలవాల్సిన పరిస్థితి ఉండటంతో కేకేఆర్ సమష్టిగా రాణిస్తూ విజయాలను అందుకుంటుంది.
ఆదివారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) 7 వికెట్ల తేడాతో పటిష్టమైన సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. ముందుగా బౌలింగ్‌లో సత్తా చాటి.. ఆ తర్వాత బ్యాటింగ్‌లో దుమ్మురేపింది.
ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆరెంజ్ ఆర్మీకి షాక్..
కేకేఆర్ బౌలర్ల ధాటికి సన్‌రైజర్స్ హైదరాబాద్ 19 ఓవర్లలో 165 పరుగులకే కుప్పకూలింది. ట్రావిస్ హెడ్(28 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 61) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగినా.. ఇషాన్ కిషన్(29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42)కీలక ఇన్నింగ్స్ ఆడినా ఫలితం లేకపోయింది. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ(3/36) మూడు వికెట్లు తీయగా.. సునీల్ నరైన్(2/31), కార్తీక్ త్యాగీ రెండేసి వికెట్లు పడగొట్టారు. వైభవ్ అరోరా, కామెరూన్ గ్రీన్, అనుకుల్ రాయ్ తలో వికెట్ తీసారు.

అనంతరం కేకేఆర్ 18.2 ఓవర్లలో 3 వికెట్లకు 169 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. అంగ్‌క్రిష్ రఘువంశీ(47 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 59)హాఫ్ సెంచరీతో రాణించగా.. కెప్టెన్ అజింక్యా రహానే(36 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 43) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో పాట్ కమిన్స్, సాకీబ్ హుస్సేన్, శివాంగ్ కుమార్ తలో వికెట్ తీసారు.
కేకేఆర్ ప్లే ఆఫ్స్ చేరాలంటే..?
సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై సాధించిన విజయంతో కేకేఆర్ 9 మ్యాచ్‌ల్లో 3 విజయాలు ఒక మ్యాచ్ రద్దుతో 7 పాయింట్లను ఖాతాలో వేసుకొని 8వ స్థానంలో కొనసాగుతోంది. ఆ జట్టు ప్లే ఆఫ్స్ చేరాలంటే చివరి ఐదు మ్యాచ్‌లకు ఐదు గెలవాలి. ఇందులో ఒక్కటి ఓడినా ప్లే ఆఫ్స్ రేసు సంక్లిష్టంగా మారుతోంది. రెండు మ్యాచ్‌లు ఓడితే మాత్రం టోర్నీ నుంచి నిష్క్రమిస్తోంది. కేకేఆర్ ఐదు మ్యాచ్‌లకు ఐదు గెలిస్తే.. మొత్తం 8 విజయాలు, ఒక మ్యచ్ రద్దుతో మొత్తం 17 పాయింట్లను సాధిస్తుంది.
అప్పుడు ఏ జట్టుతో సంబంధం లేకుండా టోర్నీలో ముందడుగు వేస్తోంది. ఇందులో ఒకటి ఓడితే 15 పాయింట్లతో ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. రెండు ఓడితే 13 పాయింట్లకే పరిమితమై టోర్నీ నుంచి నిష్క్రమిస్తోంది. కేకేఆర్ స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తీ, సునీల్ నరైన్ ఫామ్‌లోకి రావడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. కేకేఆర్ తమ తదుపరి మ్యాచ్‌ల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో రెండు సార్లు, ఆర్‌సీబీ, గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్‌తో ఒక్కోసారి తలపడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications