న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SRH vs DC: ఢిల్లీ‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఢీ.. నిలవాలంటే గెలవాలి!

IPL 2020, SRH vs DC: Who will win Sunrisers Hyderabad vs Delhi Capitals, teams prediction
IPL 2020,SRH vs DC Match Preview, Teams Details & Pitch Report || Oneindia Telugu

దుబాయ్: ఐపీఎల్ 2020 ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ సిద్ధమైంది. మంగళవారం దుబాయ్ వేదికగా జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ చేతిలో శనివారం ఎదురైన అనూహ్య ఓటమి తర్వాత సన్ రైజర్స్ ప్లే ఆఫ్ ఆశలను మరింత సంక్లిష్టం చేసుకుంది. తమకు మిగిలిన మూడు మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన స్థితిలో నిలిచింది.

నేడు జరిగే మ్యాచ్‌లో ఓడితే సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించినట్టే. హైదరాబాద్‌కు ఈ మ్యాచ్ కీలకమైనా... జోరు మీదున్న ఢిల్లీని అడ్డుకోవడం అంత సులువు కాదు. గత రెండు మ్యాచ్‌ల్లో ఆ జట్టు ఓడినా అన్ని విభాగాల్లో బలంగా ఉంది. దాంతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గట్టి పోటీ తప్పదు.

షాక్ నుంచి తేరుకుంటుందా?

షాక్ నుంచి తేరుకుంటుందా?

అన్నింటికంటే ముఖ్యంగా కింగ్స్ పంజాబ్ ఇచ్చిన షాక్ నుంచి ఆరెంజ్ ఆర్మీ బయటపడుతుందో లేదో చూడాలి. కెప్టెన్ డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో, మనీశ్ పాండే, విజయ్ శంకర్‌తో కూడిన టాపార్డర్ రాణిస్తున్నా.. మిడిలార్డర్ వైఫల్యం హైదరాబాద్‌ను దెబ్బతీస్తోంది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో అది మరోసారి రుజువు అయ్యింది. గెలిచే మ్యాచ్‌లో ఓడింది. జాసన్ హోల్డర్ చేరికతో బౌలింగ్ బలం పెరగడం, చివరిసారి ఆడినప్పుడు ఢిల్లీపై గెలవడం హైదరాబాద్ జట్టుకు సానుకూల అంశాలు. మరి ఢిల్లీకి రెండోసారి కళ్లెం వేసి ప్లేఆఫ్ రేస్లో సన్ రైజర్స్ ముందడుగు వేస్తుందో లేదో అనేది ఆసక్తికరం.

ప్లే ఆఫ్ బెర్త్‌ లక్ష్యంగా..

ప్లే ఆఫ్ బెర్త్‌ లక్ష్యంగా..

మరోపక్క వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడినప్పటికీ ఢిల్లీ ఎలాంటి ఒత్తిడి లేకుండా బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్లో గెలిచి ప్లే ఆఫ్ బెర్త్ ను కన్ఫమ్ చేసుకోవాలని చూస్తోంది. ఓపెనర్ శిఖర్ ధవన్ సూపర్ ఫామ్ లో ఉండగా మిగిలిన బ్యాట్స్మెన్ కూడా టచ్లో ఉన్నారు. రబాడ, నోకియా, తుషార్ దేశ్పాండే, అశ్విన్, అక్షర్ పటేల్ తదితరులతో ఢిల్లీ బౌలింగ్ లో కూడా అదరగొడుతోంది.

 పిచ్ రిపోర్ట్

పిచ్ రిపోర్ట్

సెకండాఫ్‌లో పిచ్‌లన్నీ బ్యాటింగ్‌కు ప్రతీకూలంగా మారాయి. దుబాయ్ పిచ్ కూడా స్పిన్నర్లకు బాగా అనుకూలిస్తుంది. చేజింగ్ జట్లే విజయాన్నందుకుంటున్నాయి. కాబట్టి టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవచ్చు. ఈ మైదానంలో జరిగిన చివరి నాలుగు మ్యాచ్‌ల్లో రెండు సార్లు చేజింగ్ జట్లే గెలుపొందాయి. ఈ మైదానంలో ఢిల్లీ 5 మ్యాచ్‌లు ఆడగా.. నాలుగు గెలిచి ఒక్క మ్యాచ్‌లోనే ఓడింది. 7 మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ మూడింటిలో మాత్రమే గెలిచింది.

ముఖా ముఖి

ముఖా ముఖి

ఐపీఎల్‌లో ఇరు జట్లు ఇప్పటివరకు 16 మ్యాచ్‌లు ఆడగా హైదరాబాద్ 10 సార్లు, ఢిల్లీ 6 సార్లు గెలిచింది. గత ఐదు మ్యాచ్‌ల్లో మాత్రం మూడింటిలో హైదరాబాద్ గెలవగా.. రెండింటిలో ఢిల్లీ విజయం సాధించింది. గత సీజన్‌లో ఇరు జట్ల మధ్య ఫ్లేఆప్‌తో సహా మూడు మ్యాచ్‌లు జరగ్గా రెండింటిలో ఢిల్లీనే గెలవడం విశేషం.

జట్లు (అంచనా)

జట్లు (అంచనా)

హైదరాబాద్‌: డేవిడ్‌ వార్నర్ ‌(కెప్టెన్‌), జానీ బెయిర్‌స్టో, మనీశ్‌ పాండే, విజయ్ శంకర్, వృద్ధిమాన్‌ సాహా, ప్రియమ్‌ గార్గ్, అభిషేక్‌శ ర్మ, జాసన్ హోల్డర్, రషీద్‌ ఖాన్‌, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్, టీ నటరాజన్‌.

ఢిల్లీ: శిఖర్‌ ధావన్, పృథ్వీ షా, శ్రేయస్‌ అయ్యర్‌, రిషభ్ ‌పంత్‌, షిమ్రాన్ హెట్‌మైయిర్‌‌, మార్కస్ స్టొయినిస్‌, అక్షర్ ‌పటేల్‌, అశ్విన్, కాగిసో రబాడా, అన్రిచ్ నోర్జె

అబ్బో నీకు సిక్స్ ప్యాక్ ఉన్నట్టే..సిగ్గుండాలి సెహ్వాగ్.. రోహిత్ శర్మను వడా పావ్ అనడంపై ఫ్యాన్స్ ఫైర్

Story first published: Tuesday, October 27, 2020, 15:32 [IST]
Other articles published on Oct 27, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X