న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వివో తప్పుకోవడం చిన్న ఆటంకమే.. బీసీసీఐకి పోయేదేం లేదు: సౌరవ్ గంగూలీ

IPL 2020:Sourav Ganguly says VIVO exit as IPL sponsor not a financial crisis

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) టైటిల్ స్పాన్సర్‌షిప్ నుంచి వివో తప్పుకోవడంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి పెద్దగా వచ్చే నష్టమేం లేదని ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ అన్నాడు. ఇది చిన్న ఆటంకం తప్పితే.. పెద్ద ఆర్థిక సంక్షోభం మాత్రం కాదని స్పష్టం చేశాడు. బలంగా ఉన్న బీసీసీఐ ఇలాంటి చిన్న సమస్యల నుంచి చాలా తొందరగా బయటపడతదని ధీమా వ్యక్తం చేశాడు.

ఐపీఎల్ టైటిల్ స్ఫాన్సర్‌షిప్ కోసం బీసీసీఐతో 2017లో ఐదేళ్లకాలానికి రూ. 2,199 కోట్లతో ఒప్పందం కుదుర్చుకున్న వివో.. టైటిల్ స్ఫాన్సర్‌గా ఏటా రూ. 440 కోట్లు చెల్లిస్తోంది. ఈ అగ్రిమెంట్ ఐపీఎల్ 2022 సీజన్‌తో ముగియనుంది. అయితే చైనాతో సరిహద్దుల్లో నెలకొన్న ఘర్షణ కారణంగా దేశంలో ఆ దేశ ఉత్పత్తులపై వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్‌ 2020కి సంబంధించి బీసీసీఐ, వివో తమ భాగస్వామ్యాన్ని రద్దు చేసుకున్నాయి.

చిన్న ఆటంకమే..

చిన్న ఆటంకమే..

‘ఇది బీసీసీఐలో పెద్ద ఆర్థిక సంక్షోభమని చెప్పను. చిన్న అవరోధం మాత్రమే. మేం ఏళ్ల తరబడి ప్రొఫెషనల్‌గా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాం. పెద్ద పెద్ద విషయాలు ఓవర్‌నైట్‌లో జరగవు. అలాగని ఓవర్‌నైట్‌లో పోవు. సుదీర్ఘకాలంగా మేం ఎన్నో ఎదుర్కొన్నాం. కొన్నిసార్లు విజయం సాధించాలంటే మరికొన్ని ఆటంకాలను ఎదుర్కోక తప్పదు. బీసీసీఐ చాలా బలమైన సంస్థ. గతంలో పనిచేసిన ఆడ్మినిస్ట్రేటర్స్, ఆట.. ఆర్గనైజేషన్‌ను బలంగా తీర్చిదిద్దాయి. కాబట్టి చిన్న ఆటంకాలను హ్యాండిల్ చేసే సత్తా బోర్డుకు ఉంది.'అని దాదా పేర్కొన్నాడు.

జియో వద్దనుకుంది..

జియో వద్దనుకుంది..

టైటిల్ స్పాన్సర్‌షిప్ విషయంలో ఇప్పటివరకు బీసీసీఐ ముందడుగు వేయకపోయినా.. వీలైనంత త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని బోర్డు పెద్దలు ఆశాభావంతో ఉన్నారు. అయితే రేస్‌లో అందరికంటే ముందున్న రిలయన్స్ జియో.. స్పాన్సర్‌షిప్ విషయంలో వెనుకడుగు వేసినట్లు తెలుస్తోంది. కనీసం చర్చలు జరపడానికి కూడా ఆసక్తిచూపలేదని బోర్డు వర్గాలు తెలిపాయి.

 పేటీఎమ్, బైజూస్ కూడా..

పేటీఎమ్, బైజూస్ కూడా..

జియో వెనక్కి తగ్గడంతో బీసీసీఐ.. పేటీఎమ్, బైజూస్, టాటా మోటార్స్, డ్రీమ్ 11ను సంప్రదించినా ఊహించినంత ప్రోత్సాహం లభించలేదని సమాచారం. అయితే ఒకవేళ వీళ్లలో ఎవరు స్పాన్సర్‌షిప్ సంపాదించినా.. బీసీసీఐ మరోసారి యాంటీచైనా సెంటిమెంట్‌ను ఎదుర్కోక తప్పేలా లేదు. ఎందుకంటే పేటీఎమ్, బైజూస్, డ్రీమ్ 11లో చైనీస్ కంపెనీలు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాయి.

పాక్‌కు షాక్.. ఇంగ్లండ్‌ థ్రిల్లింగ్‌ విన్‌

Story first published: Sunday, August 9, 2020, 10:32 [IST]
Other articles published on Aug 9, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X