న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాక్‌కు షాక్.. ఇంగ్లండ్‌ థ్రిల్లింగ్‌ విన్‌

England vs Pakistan: Jos Buttler, Chris Woakes lead England to thrilling 3-wicket win over Pakistan

మాంచెస్టర్: కరోనా విరామం అనంతరం ఆడిన ఫస్ట్‌ మ్యాచ్‌లో దాయదీ పాకిస్థాన్‌కు గట్టి షాక్ తగిలింది. అనిశ్చితికి మారుపేరైన ఆ జట్టు ఇంగ్లండ్‌తో శనివారం ముగిసిన తొలి టెస్ట్‌లో విజయం ముంగిట బొక్కబోర్లాపడింది. గంటగంటకూ ఆధిపత్యం చేతులు మారుతూ సాగిన పోరులో చివరకు ఆతిథ్య జట్టే పైచేయి సాధించింది. ప్రతికూల పరిస్థితుల్లోనూ గొప్పగా ఆడిన ఆ జట్టు అద్భుత విజయాన్నందుకుంది.

నాలుగో రోజు భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌.. క్రిస్‌ వోక్స్‌ (84 నాటౌట్‌), బట్లర్‌ (75) అసమాన ఆటతీరుతో మ్యాచ్‌ను చివరి రోజు వరకు తీసుకెళ్లకుండా 3 వికెట్ల తేడాతో గెలిచింది. వీరి మధ్య ఐదో వికెట్‌కు 139 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 82.1 ఓవర్లలో 7 వికెట్లకు 277 పరుగులు చేసి నెగ్గింది. ప్రస్తుతం మూడు టెస్టుల సిరీస్‌లో రూట్‌ సేన 1-0తో ఆధిక్యంలో ఉంది. యాసిర్‌ షాకు నాలుగు వికెట్లు దక్కాయి.

పాక్ 169 ఆలౌట్..

పాక్ 169 ఆలౌట్..

అంతకుముందు పాకిస్థాన్‌ రెండో ఇన్నింగ్స్‌లో 169 పరుగులకు ఆలౌటైంది. 137/8 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన పాక్‌ చివరి బ్యాట్స్‌మెన్‌ వీలైనంత వేగంగా ఆడి కేవలం 16 బంతుల్లోనే 32 పరుగులు జత చేశారు. యాసిర్‌ షా (33) బ్యాటింగ్‌లోనూ చెలరేగాడు. దీంతో జట్టుకు 276 పరుగుల ఆధిక్యం లభించింది. బ్రాడ్‌కు మూడు, వోక్స్‌.. స్టోక్స్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. వోక్స్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది.

117కే సగం వికెట్లు..

117కే సగం వికెట్లు..

277 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌ జట్టు 117 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది... ఓపెనర్లు సిబ్లీ (36), బర్న్స్‌ (10)లతో పాటు కెప్టెన్‌ రూట్‌ (42), స్టార్‌ ప్లేయర్‌ స్టోక్స్‌ (9), యువ బ్యాట్స్‌మన్‌ పోప్‌ (7) వెనుదిరిగారు. పాకిస్తాన్‌ బౌలర్లు అటు పేస్, ఇటు స్పిన్‌తో చెలరేగారు. గెలుపు కోసం మరో 160 పరుగులు చేయాలి. ఈ స్థితిలో ఇంగ్లండ్‌ ఓటమి ఖాయమనిపించింది.

బట్లర్‌, వోక్స్‌ అదుర్స్..

బట్లర్‌, వోక్స్‌ అదుర్స్..

ఈ దశలో పాక్‌ను నిరాశపరుస్తూ బట్లర్‌, వోక్స్‌ అద్వితీయ పోరాటాన్ని ప్రదర్శించారు. ప్రమాదకర బంతులను దీటుగా ఎదుర్కొంటూ తమ లక్ష్యం వైపు కదిలారు. ఒక్క ఓవర్‌ను కూడా మెయిడిన్‌గా ఆడకుండా వన్డే తరహాలో చెలరేగారు. ఇక చివరి సెషన్‌లో ఎదురుదాడికి దిగడంతో పరుగులు వేగంగా వచ్చాయి. ముఖ్యంగా బట్లర్‌ కవర్‌, స్వీప్‌ షాట్లతో బంతులను బౌండరీలకు తరలిస్తూ ఒత్తిడిని తగ్గించాడు. ఈక్రమంలో తను 55 బంతుల్లో... ఆ వెంటనే వరుసగా రెండు ఫోర్లతో వోక్స్‌ కూడా 59 బంతుల్లో హాఫ్‌ సెంచరీలను పూర్తిచేసుకున్నారు.

పేలవ బ్యాటింగ్‌తో పాటు కీపింగ్‌ వైఫల్యంతో జట్టులో స్థానంపై సందేహాలు నెలకొన్న స్థితిలో బట్లర్‌... గత 17 ఇన్నింగ్స్‌లలో కనీసం అర్ధ సెంచరీ కూడా చేయకుండా విమర్శలు ఎదుర్కొంటున్న వోక్స్‌ తమ కోసం, తమ జట్టు కోసం ఆడారు. అయితే విజయానికి 21 పరుగుల దూరంలో ఉండగా బట్లర్‌ను యాసిర్‌ షా అవుట్‌ చేసినా వోక్స్‌ ఓ ఫోర్‌తో లాంఛనం పూర్తిచేశాడు.

సంక్షిప్త స్కోర్లు..

సంక్షిప్త స్కోర్లు..

పాకిస్థాన్ ఫస్ట్ ఇన్నింగ్స్: 326 ఆలౌట్ ( షాన్ మసూద్ 156, బాబర్ అజామ్ 69, బ్రాడ్ 3/54, ఆర్చర్ 3/59)

ఇంగ్లండ్ ఫస్ట్ ఇన్నింగ్స్: 219 ఆలౌట్ (ఓలి పోప్ 62, బట్లర్ 38, బ్రాడ్ 29 నాటౌట్, యాసిర్ షా 4/66, షాదాబ్ ఖాన్ 2/13)

పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్: 169 ఆలౌట్ (యాసిర్ షా 33, అసద్ షఫీక్ 29, బ్రాడ్ 3/37, వోక్స్ 2/11, స్టోక్స్ 2/11)

ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 82.1 ఓవర్లలో 277/7(వోక్స్ 84 నాటౌట్, బట్లర్ 75, యాసిర్ షా 4/99)

Story first published: Sunday, August 9, 2020, 8:53 [IST]
Other articles published on Aug 9, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X