న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అందుకే ధోనీ అంటే ఇష్టం.. అతనికి నేను డై హార్డ్ ఫ్యాన్: జోస్ బట్లర్

IPL 2020: Jos Buttler reveals how he became a big fan of MS Dhoni

దుబాయ్‌: టీమిండి మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ ప్రశాంతత, విధ్వంసకర బ్యాటింగ్‌తోనే అతనికి డై హార్డ్ ఫ్యాన్ అయ్యానని ఇంగ్లండ్ ప్లేయర్, రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్ తెలిపాడు. ఇటీవల మహీ జెర్సీని కానుకగా అందుకొని సంబరపడిపోయిన బట్లర్.. ఈ చెన్నై సారథికి అభిమానిగా మారడానికి గల కారణాలను వెల్లడించాడు.

హెలికాప్టర్‌ షాట్‌ను ఎక్కువగా ఇష్టపడుతా..

హెలికాప్టర్‌ షాట్‌ను ఎక్కువగా ఇష్టపడుతా..

‘మైదానంలో ధోనీ ప్రవర్తన అంటే చాలా ఇష్టం. ప్రత్యేకంగా అతని ప్రశాంతత నన్ను విపరీతంగా ఆకట్టుకునేది. అతని విధ్వంసకర బ్యాటింగ్‌ అంటే ఇంకా ఇష్టం. ప్రత్యేకంగా ధోనీ ఆడే హెలికాప్టర్‌ షాట్‌ను ఎక్కువగా ఇష్టపడుతా. నేను ఎప్పుడూ ఐపీఎల్‌ను టీవీలో చూసేవాడిని. ధోనీ చాలా గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఎన్నో చిరస్మరణీయ విజయాలందించాడు.

నా కళ్ల ముందు కదలాడుతూనే ఉంటుంది..

నా కళ్ల ముందు కదలాడుతూనే ఉంటుంది..

2011 వరల్డ్‌కప్‌ ఫైనల్లో ధోనీ మ్యాచ్‌ను ఫినిష్‌ చేసిన విధానమైతే అద్భుతం. ఆ ఫైనల్‌ మ్యాచ్‌ను ఇంటిదగ్గర నుంచే వీక్షించా. ధోనీ సిక్స్‌తో మ్యాచ్‌ను ముగించడం ఇప్పటీకీ నా కళ్లముందు కదలాడుతూనే ఉంటుంది. ఆ సిక్స్‌ ఎప్పుడూ ప‍్రతిధ్వనిస్తూనే ఉంటుంది'అని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బట్లర్‌ చెప్పుకొచ్చాడు.

ధోనీ నుంచి కానుక..

ధోనీ నుంచి కానుక..

ఇక చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన రెండో అంచె మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ విజయం సాధించిన తర్వాత జోస్‌ బట్లర్‌కు ధోనీ బహుమతి ఇచ్చాడు. అతని 200వ ఐపీఎల్‌ మ్యాచ్‌ జెర్సీని కానుకగా అందజేశాడు. ప్రపంచ వ్యాప్తంగా ధోనీకి ఎంతోమంది అభిమానులు ఉండగా అందులో బట్లర్‌ ఒకడు. ఈ విషయాన్ని ఈ ఇంగ్లండ్ క్రికెటర్ ఇప్పటికే పలుమార్లు తెలియజేశాడు.

ప్రైజ్ ట్యాగ్‌తో అనవసర ఒత్తిడి..

ప్రైజ్ ట్యాగ్‌తో అనవసర ఒత్తిడి..

ఇక ఐపీఎల్‌లో ప్రైజ్ ట్యాగ్ అనేది ఎప్పుడూ ఆటగాళ్లను ఒత్తిడిలోకి నెట్టేయడంతో పాటు భారీ అంచనాలను నెలకొనెలా చేస్తుందని బట్లర్ అభిప్రాయపడ్డాడు. ‘ప్రైజ్ ట్యాగ్‌ కారణంగా అంచనాలు ఎక్కువ అవుతాయి. తద్వారా ఒత్తిడి నెలకొంటుంది. ఈ పరిస్థితి అధిగమించడం మరో నైపుణ్యం. అయితే బెస్ట్ ప్లేయర్స్ దీన్ని పక్కన పెట్టి తమ ఆటపై దృష్టిసారించాలి. ఇక స్టోక్స్, నేను బ్యాటింగ్ చేసేటప్పుడు బంతిపైనే దృష్టిసారిస్తాం. బయటి పరిస్థితులను, అంచనాలను ఏ మాత్రం పట్టించుకోం. ఇక నేను ఒకే విధంగా బ్యాటింగ్ చేయను. పరిస్థితులకు తగ్గట్లు ఆడటానికి ప్రయత్నిస్తాను'అని జోస్ బట్లర్ చెప్పుకొచ్చాడు.

India vs Australia: ఈ మూడు కారణాలతోనే సూర్యకుమార్ యాదవ్‌కు అవకాశం దక్కలేదు!

Story first published: Saturday, October 31, 2020, 18:22 [IST]
Other articles published on Oct 31, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X