India vs Australia: ఈ మూడు కారణాలతోనే సూర్యకుమార్ యాదవ్‌కు అవకాశం దక్కలేదు!

హైదరాబాద్: ఐపీఎల్‌లో గత రెండు, మూడు సీజన్లుగా సత్తా చాటుతున్నా.. ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్‌కు భారత జట్టులో అవకాశం దక్కడం లేదు. తాజాగా ఆస్ట్రేలియా పర్యటన కోసం ఎంపిక చేసిన మూడు జట్లలో కూడా ఈ ముంబై బ్యాట్స్‌మెన్‌కు నిరాశే ఎదురైంది. అయినా ఏ మాత్రం సహనం కోల్పోని స్కై(సూర్య కుమార్ యాదవ్).. తనదైన ఆటతో ఆకట్టుకుంటున్నాడు. వినూత్న షాట్లతో భారత 360గా ప్రశంసలు అందుకుంటున్నాడు.
ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన గత మ్యాచ్‌లో స్కై (43 బంతుల్లో 79 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. దాంతో ఈ ముంబై బ్యాట్స్‌మెన్‌ను భారత జట్టులోకి ఎందుకు తీసుకోలేదని అటు అభిమానులు, ఇటు మాజీ క్రికెటర్లు సెలెక్టర్లపై మండిపడ్డారు. అయితే ఓ మూడు కారణాలతో స్కైని సెలెక్టర్లు పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.

ఇండియా-ఏ టూర్‌లో విఫలం..
ఈ ఏడాది ప్రారంభంలో న్యూజిలాండ్‌లో పర్యటించిన ఇండియా-ఏ జట్టులో సూర్యకుమార్ యాదవ్ దారుణంగా విఫలమయ్యాడు. ఆ టూర్‌లో అన్ని మ్యాచ్‌ల్లోను ఆడిన సూర్య.. కేవలం 76 రన్స్ మాత్రమే చేశాడు. మూడు లిస్ట్-ఏ మ్యాచ్‌ల్లో 60 పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్ 30 మాత్రమే. ఈ పర్యటనలో చెలరేగి ఉంటే స్కైకి కరోనాతో ఆగిపోయిన సౌతాఫ్రికా సిరీస్‌లోనే అవకాశం దక్కేది. కానీ విఫలమవడంతో అతన్ని సెలెక్టర్లు ఆస్ట్రేలియా టూర్‌కు పరిగణలోకి తీసుకోలేదు.

సెలెక్షన్ ముందు నిలకడలేమి ఆట..
ఆస్ట్రేలియా పర్యటనకు జట్టును ప్రకటించడానికి ముందు సూర్య కుమార్ యాదవ్ ఐపీఎల‌్ 2020 సీజన్‌లో 17, 47, 0, 10, 27, 79*, 53, 10, 0లతో రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే చేశాడు. ఐదు మ్యాచ్‌ల్లో 20లోపే రన్స్ చేయగలిగాడు. ఈ నిలకడలేమి కారణంగా సంజూ శాంసన్ కొన్నేళ్లుగా భారత ఏ జట్టుకు ఆడుతున్న సీనియర్ జట్టులో అవకాశం దక్కించుకోలేదు. ఆఖరికి ధోనీ వారసుడిగా జట్టులోకి వచ్చిన రిషభ్ పంత్ కూడా ఈ సమస్యతోనే వన్డే, టీ20ల్లో చోటు కోల్పోయాడు. టీమ్ సెలెక్షన్‌కు ముందు కనుక సూర్య చెలరేగి ఉంటే అవకాశం దక్కేది.

టీమిండియాలో ఖాళీ లేకపోవడం..
సూర్యకుమార్ యాదవ్ ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగల సమర్థుడు. కానీ భారత జట్టులో ఐదుగురి కంటే ఎక్కువ ఓపెనర్లు, మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ ఉన్నారు. దాంతో అతని కోసం సరైన స్పాట్ లేదు. టీ20ల్లో రాహుల్, శిఖర్ ధావన్ ఓపెనర్లు బరిలో దిగే ఛాన్స్ ఉంది. వన్డేల్లో పోటీ తీవ్రంగా ఉండనుంది. తుది జట్టులోనే కాదు.. 15 మంది ఆటగాళ్లను ఎంపిక చేయడం కూడా కష్టంగా మారుతోంది. ఈ పరిస్థితుల్లో సూర్యకుమార్ చేయగలిగేది ఒకటే. సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు చేయడం, టీమిండియాలో చోటు దొరికే వరకు అవకాశం కోసం ఎదురు చూడటం.
ఆస్ట్రేలియా టూర్‌కు రోహిత్ శర్మ.. రేపే తుది నిర్ణయం: బీసీసీఐ
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications