న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Qualifier 2, DC vs SRH: ఢిల్లీతో హైదరాబాద్ ఢీ.. ఫైనల్ చెరేదెవరో.? తుది జట్లు ఇవే!

IPL 2020, DC vs SRH: Who will win Delhi Capitals vs Sunrisers Hyderabad Qualifier 2, teams prediction

అబుదాబి: ఐపీఎల్‌‌‌‌‌‌‌ 2020 సీజన్‌లో పడుతూలేస్తూ ముందుకు సాగి.. సరైన టైమ్‌‌లో పుంజుకున్న సన్‌‌రైజర్స్‌‌ హైదరాబాద్‌‌ రెండోసారి ఐపీఎల్‌ ఫైనల్‌ చేరడంపై గురి పెట్టింది. టాప్‌‌ గేర్‌‌లో టోర్నీని స్టార్ట్‌‌ చేసి చివర్లో తడబడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌‌తో నేడు జరిగే క్వాలిఫయర్‌‌-2లో అమీతుమీ తేల్చుకోనుంది. ఇటు డేవిడ్‌‌ వార్నర్‌‌.. అటు శ్రేయస్‌‌ అయ్యర్‌‌.. మెగా ఫైనల్‌‌ చేరడమే ఇద్దరి టార్గెట్‌‌. రెండోసారి చాంపియన్‌‌ అవ్వాలన్న సన్‌‌రైజర్స్‌‌ కల సజీవంగా ఉండాలన్నా.. తొలిసారి టైటిల్‌‌ సాధించాలనే క్యాపిటల్స్‌‌ ఆశ నెరవేరాలన్నా.. ఈ పోరులో గెలవడం ఒక్కటే దారి! మరి.. జోరు మీదున్న ఆరెంజ్‌‌ ఆర్మీ దూకుడు కొనసాగిస్తుందా.. బ్యాటింగ్‌‌ వైఫల్యంతో తప్పటడుగులేస్తున్న ఢిల్లీ ముందడుగు వేస్తుందా..? మెగా ఫైనల్‌‌కు చేరేదెవరు.. ముంబైని ఢీ కొట్టేదెవరు?

సన్‌రైజర్స్ సూపర్ ఫామ్‌

సన్‌రైజర్స్ సూపర్ ఫామ్‌

ఫామ్‌ ప్రకారం చూస్తే ఢిల్లీకంటే హైదరాబాద్‌ జోరు మీదుంది. ఒక దశలో తొలి 9 మ్యాచ్‌లలో 3 మాత్రమే గెలిచి ఏడో స్థానంలో ఉన్న సన్‌రైజర్స్‌ ఆ తర్వాత పుంజుకుంది. ఇప్పుడు వరుసగా నాలుగు మ్యాచ్‌లలో గెలిచి సత్తా చాటింది. తుది జట్టు విషయంపై రైజర్స్‌కు పూర్తి స్పష్టత వచ్చేసింది. ముఖ్యంగా బౌలింగే రైజర్స్‌ బలంగా మారింది. గత ఆరు మ్యాచ్‌లలో ఒక్కసారి మాత్రమే హైదరాబాద్‌ ప్రత్యర్థులు 150కు పైగా పరుగులు చేయగలిగారు. అయితే మిడిలార్డర్‌లో కొంత తడబాటు ఉందని ఎలిమినేటర్‌లో కూడా కనిపించింది. దీనిని జట్టు అధిగమించడమే కీలకం. సాహా గాయం నుంచి కోలుకోకపోవడంతో శ్రీవత్స్‌ని కొనసాగించే అవకాశం ఉంది. అయితే, ఈ వికెట్‌‌‌‌ కీపర్‌‌‌‌ బ్యాట్స్‌‌‌‌మన్‌‌‌‌ను ఏ ప్లేస్‌‌‌‌లో ఆడిస్తారో చూడాలి.

ముఖ్యంగా కెప్టెన్‌‌‌‌ వార్నర్‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌లో హిట్‌‌‌‌ అయితే హైదరాబాద్‌‌‌‌ భారీ స్కోరు చేయడం ఖాయం. మనీశ్‌‌‌‌ పాండే, కేన్‌‌‌‌ విలియమ్సన్‌‌‌‌ మంచి ఫామ్‌‌‌‌లో ఉండడం కలిసొచ్చే అంశం. ఇక, లీగ్‌‌‌‌ చివరి దశలో జట్టులోకి వచ్చిన ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌ జేసన్‌‌‌‌ హోల్డర్‌‌‌‌ ఇప్పుడు ప్రధాన ఆయుధంగా మారాడు. పేసర్‌‌‌‌ సందీప్‌‌‌‌ శర్మ అదిరిపోయే పెర్ఫామెన్స్‌‌‌‌ చేస్తుండగా.. నటరాజన్‌‌‌‌ తన మార్కు యార్కర్లతో చెలరేగుతున్నాడు. వీరంతా ఫామ్‌‌‌‌ కొనసాగిస్తే సన్‌‌‌‌రైజర్స్‌‌‌‌ ముందడుగు వేయడం ఖాయం.

ఒత్తిడిలో ఢిల్లీ​...

ఒత్తిడిలో ఢిల్లీ​...

తొలి 9 మ్యాచ్‌లలో 7 గెలిచి అభేద్యంగా కనిపించిన ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆ తర్వాత కుప్పకూలింది. వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడింది. ఎట్టకేలకు ఆఖరి లీగ్‌లో బెంగళూరుపై గెలిచి ప్లే ఆఫ్స్‌కు చేరినా... టీమ్‌ ఆట మారలేదని తొలి క్వాలిఫయర్‌లో చెత్త ప్రదర్శన చూపించింది. జట్టు టాపార్డర్‌ మరీ పేలవం. ఎవరిని ఆడించాలో కూడా అర్థం కాని పరిస్థితి. రెండు సెంచరీలు చేసినా కూడా ధావన్‌ 4 డకౌట్‌లు నమోదు చేయగా... పృథ్వీ షా 3 సార్లు, రహానే 2 సార్లు సున్నాలకే వెనుదిరిగారు. ఈ మ్యాచ్‌ కోసం డేనియల్‌ స్యామ్స్‌ స్థానంలో బ్యాటింగ్‌కు బలంగా మార్చేందుకు హెట్‌మైర్‌ రావచ్చు.

టాపార్డర్‌‌‌‌‌‌‌‌ గాడిలో పడకుంటే ఢిల్లీ టైటిల్‌‌‌‌‌‌‌‌ ఫైట్‌‌‌‌‌‌‌‌ చేరడం కష్టం. కెప్టెన్‌‌‌‌‌‌‌‌ శ్రేయస్‌‌‌‌‌‌‌‌ అయ్యర్‌‌‌‌‌‌‌‌, మార్కస్‌‌‌‌‌‌‌‌ స్టోయినిస్‌‌‌‌‌‌‌‌ మంచి టచ్‌‌‌‌‌‌‌‌లో ఉండగా.. వికెట్‌‌‌‌‌‌‌‌కీపర్‌‌‌‌‌‌‌‌ బ్యాట్స్‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌ రిషబ్‌‌‌‌‌‌‌‌ పంత్‌‌‌‌‌‌‌‌ నుంచి టీమ్‌‌‌‌‌‌‌‌ మరింత ఆశిస్తోంది. స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ అక్షర్‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌కు బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌లోనూ మెరుస్తున్నాడు. బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో మాత్రం క్యాపిటల్స్‌‌‌‌‌‌‌‌ చాలా బలంగా ఉంది. పేసర్లు రబాడ(25 వికెట్లు), అన్రిచ్‌‌‌‌‌‌‌‌ నోకియా(20) సీజన్‌‌‌‌‌‌‌‌ ప్రారంభం నుంచి అదరగొడుతున్నారు. సీనియర్‌‌‌‌‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ అశ్విన్‌‌‌‌‌‌‌‌(13 వికెట్లు) స్థాయికి తగ్గ పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నాడు. ఓవరాల్‌‌‌‌‌‌‌‌గా టాపార్డర్‌‌‌‌‌‌‌‌ బ్యాట్స్‌‌‌‌‌‌‌‌మెన్‌‌‌‌‌‌‌‌ సక్సెస్‌‌‌‌‌‌‌‌పైనే ఢిల్లీ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.

ముఖా ముఖి/పిచ్ రిపోర్ట్

ముఖా ముఖి/పిచ్ రిపోర్ట్

ఈ సీజన్‌లో ఢిల్లీతో ఆడిన రెండు మ్యాచ్‌లలో కూడా హైదరాబాద్‌ గెలిచింది. తొలి మ్యాచ్‌లో 15 పరుగులతో నెగ్గిన రైజర్స్, రెండో పోరులో 88 పరుగులతో ఘన విజయం సాధించింది. అబుదాబిలో జరిగిన గత 9 మ్యాచ్‌లలో 8 సార్లు రెండోసారి బ్యాటింగ్‌ చేసిన జట్టే గెలిచింది. రెండో ఇన్నింగ్స్‌ సమయంలో మంచు ప్రభావం కూడా దీనికి కారణం కాబట్టి టాస్‌ కీలకం. అయితే శుక్రవారం జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో మంచు పెద్దగా ఇబ్బంది పెట్టలేదు.

తుది జట్లు (అంచనా)

తుది జట్లు (అంచనా)

సన్‌రైజర్స్‌ హైదరాబాద్: డేవిడ్ వార్నర్‌, గోస్వామి, మనీష్‌ పాండే, విలియమ్సన్‌, ప్రియమ్ గార్గ్‌, జాసన్‌ హోల్డర్‌, అబ్దుల్‌ సమద్‌, రషీద్‌ ఖాన్‌, నదీమ్‌, టీ నటరాజన్‌, సందీప్‌ శర్మ.

ఢిల్లీ: శిఖర్ ధావన్‌, అజింక్యా రహానె, శ్రేయాస్‌ అయ్యర్‌, రిషభ్ పంత్‌, మార్కస్ స్టొయినిస్‌, హెట్‌మయర్‌, అక్షర్‌ పటేల్‌, హర్షల్‌ పటేల్‌, అశ్విన్‌, కగిసో రబాడ, అన్రిచ్ నోర్జ్

Women's T20 challenge 2020: సూపర్ నోవాస్ గెలుపు.. ఫైనల్లో హర్మన్ X స్మృతి.. మిథాలీ ఔట్

Story first published: Sunday, November 8, 2020, 8:12 [IST]
Other articles published on Nov 8, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X