న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కుంబ్లే, అజయ్ జడేజాను కాదని గంగూలీని కెప్టెన్ చేయడానికి తెగకష్టపడ్డాం: మాజీ సెలెక్టర్

Indian Cricketers Association chief Ashok Malhotra Says How Sourav Ganguly beat odds to become India captain

న్యూఢిల్లీ: ఫిక్సింగ్ ఆరోపణలతో భారత్ జట్టు ఉక్కిరిబిక్కిరి అవుతున్న దశలో సౌరథ్య బాధ్యతలు అందుకున్న సౌరవ్ గంగూలీ టీమిండియాను అగ్రశ్రేణి జట్టుగా తీర్చిదిద్దాడు. తనదైన కెప్టెన్సీతో యువ ఆటగాళ్లకు అండగా నిలుస్తూ ఎన్నో విజయాలందించాడు. భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన సారథిగా గుర్తింపు పొందాడు. అయితే దాదాను సారథిగా ఎంపిక చేయడానికి తమ తల ప్రాణం తోకకు వచ్చిందని నాటి సెలెక్టర్, ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్ చీఫ్ అశోక్ మల్హోత్ర తెలిపాడు.

అయితే సచిన్ టెండూల్కర్ రాజీనామా తర్వాత దాదాను కెప్టెన్‌గా నియమించడానికి అందరిని ఒప్పించాల్సి వచ్చిందని, ఇక అంతకు ముందు వైస్ కెప్టెన్‌గా ఎంపికచేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని 'స్పోర్ట్స్ కీదా'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు.

వైస్ కెప్టెన్‌గా..

వైస్ కెప్టెన్‌గా..

‘గంగూలీని వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేయడం చాలా కష్టమైంది. కోల్‌కతాలో అనుకుంటా వైస్ కెప్టెన్‌గా అతని పేరు ప్రదిపాదించాం. అప్పటి కోచ్ దాదా కోక్ డ్రింక్స్ ఎక్కువ తాగుతాడని, సింగిల్స్ మాత్రమే తీస్తాడు. టూస్‌కు ప్రయత్నించడని ఇంకెన్నో చెప్పాడు. కానీ నేను మాత్రం అవి వైస్ కెప్టెన్ కావడానికి అడ్డుకావు కదా అన్నాను.

ఈ ఎంపికపై చాలా పెద్ద చర్చే చేసాం.

బీసీసీఐ బాస్ జోక్యం..

బీసీసీఐ బాస్ జోక్యం..

సెలెక్షన్ ప్యానెల్‌లో ఇద్దరు ముగ్గురు గంగూలీకి అనుకూలంగా ఓటేసారు. కానీ అప్పటి బీసీసీఐ ప్రెసిడెంట్..ఆయన పేరు నేను చెప్పను కానీ, బీసీసీఐ చరిత్రలోనే ఎన్నడు లేని విధంగా సెలెక్షన్ ప్రక్రియలో జోక్యం చేసుకున్నాడు. మరోసారి ఆలోచించండని మాకు సూచించాడు. ఆయన చెప్పినా మాలో ఇద్దరం మాత్రం దాదానే ఎంపిక చేయాలని పట్టుబట్టాం. కానీ ఓ సెలెక్టర్ ప్రెసిడెంట్ నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకుందామన్నాడు. దీంతో అప్పుడు దాదాను వైస్ కెప్టెన్ చేయలేకపోయాం. కానీ ఆ తర్వాత అందరిని ఒప్పించి వైస్ కెప్టెన్‌గా ఎంచుకున్నాం.

కుంబ్లే, జడేజాను ఒప్పించాం..

కుంబ్లే, జడేజాను ఒప్పించాం..

ఇప్పుడు దాదా ఓ దిగ్గజ, సక్సెస్‌ఫుల్ కెప్టెన్. కానీ అతను సారథి కావడానికి మేం చాలా కష్టపడాల్సి వచ్చింది. సచిన్ జట్టు నడిపిస్తుండటంతో సౌరవ్ గంగూలీ కెప్టెన్ అవుతాడని ఎవరం అనుకోలేదు. కానీ మాస్టర్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత.. రేసులో అప్పటి సీనియర్ ఆటగాళ్లు అనిల్ కుంబ్లే, అజయ్ జడేజా నిలిచారు. వారందరని ఒప్పించడానికి మేం కొంత కష్టపడాల్సి వచ్చింది'అని మల్హోత్ర గుర్తు చేసుకున్నాడు.

భారత్ జైత్ర యాత్ర..

భారత్ జైత్ర యాత్ర..

ఇక దాదా సారథ్యంలో టీమిండియా దూసుకెళ్లింది. ఆస్ట్రేలియా చేతిలో వరుస 16 టెస్ట్‌ల ఓటములకు 2001లో బ్రేక్ వేసింది. స్టీవ్ వా జట్టును స్వదేశంలో 2-1తో ఓడించింది. ఇంగ్లండ్ వేదికగా జరిగిన 2002 నాట్‌వెస్ట్ సిరీస్ గెలుచుకుంది. 2003 ప్రపంచకప్ ఫైనల్ చేరింది. 2004లో ఇంగ్లండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ సమం చేసుకుంది. పాకిస్థాన్‌లో టెస్ట్ సిరీస్ నెగ్గింది.

ఆ పాక్ క్రికెటర్ మైదానంలో వీధి రౌడీలా ప్రవర్తించేవాడు: భారత మాజీ క్రికెటర్

Story first published: Thursday, July 23, 2020, 14:00 [IST]
Other articles published on Jul 23, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X