ఆ పాక్ క్రికెటర్ మైదానంలో వీధి రౌడీలా ప్రవర్తించేవాడు: భారత మాజీ క్రికెటర్

న్యూఢిల్లీ: పాకిస్థాన్ దిగ్గజ క్రికెటర్ జావెద్ మియాందాద్ గొప్ప బ్యాట్స్‌మన్ అయినప్పటికీ, మైదానంలో మాత్రం విధీ రౌడీలా ప్రవర్తించేవాడని భారత మాజీ క్రికెటర్ దిలీప్ దోషి తెలిపాడు. భారత మాజీ క్రికెటర్ మురళీ కార్తీక్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మాజీ స్పిన్నర్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.1983లో పాక్ భారత పర్యటనకు రాగా.. బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో జావెద్ తన రూమ్ నెంబర్ ఎంతో చెబితే బంతిని అక్కడికి పంపిస్తానని బెదిరించాడని గుర్తు చేసుకున్నాడు. ఆఫ్‌ది ఫీల్డ్‌లో ఎంతో చనువుగా ఉండే మియాందాద్ మైదానంలో దిగితే మాత్రం పూర్తిగా మారిపోతాడని దిలీప్ దోషి చెప్పాడు.

ఆఫ్ ద ఫీల్డ్‌లో..
‘జావెద్ మైదానంలో వీధి రౌడీలా ప్రవర్తించేవాడు. నిజానికి అతనో అద్భుతమైన బ్యాట్స్‌మెన్. నేను బౌలింగ్ చేసిన వారిలో అత్యద్భుతమైన ఆటగాడు అతనే. ఓ ప్రత్యర్థిగా అతన్ని నేను చాలా గౌరవిస్తాను. అలాగే అతను నాకు మంచి స్నేహితుడు కూడా. ఆఫ్ ద ఫీల్డ్‌లో అతను చాలా బాగుంటాడు. కానీ మైదానంలో మాత్రం అతని ప్రవర్తన చాలా భిన్నంగా ఉంటుంది.'అని జావెద్ చెప్పుకొచ్చాడు.

అడ్డుకుంటే నోటికి పనిచెప్పేవాడని
ఇక జావెద్‌ను షాట్ల ఆడకుండా అడ్డుకుంటే నోటికి పనిచెప్పేవాడని, తన సూటి పోటీ మాటలతో బౌలర్లను రెచ్చగొట్టేవాడని దిలీప్ గుర్తు చేసుకున్నాడు. భారీ షాట్లు ఆడుతానని బెదిరింపులకు దిగేవాడన్నాడు. ‘బెంగళూరు వేదికగా జరిగిన నాటి మ్యాచ్‌లో నా రూమ్ నెంబర్ ఎంతని అడిగాడు. నేను వేసే బంతిని అక్కడికి హిట్ చేయాలనుందని చెప్పాడు. అయితే ఈ సంభాషణను చాలా మంది అనేక విధాలుగా చెప్పారు. మరింత కల్పించి చెప్పారు. కానీ ఆ రోజు మా మధ్య మాటల యుద్దం సరదాగానే జరిగింది'అని తెలిపాడు.

98 పరుగులకే..
ఇక జావెద్ ఆ మ్యాచ్‌లో చితక్కొట్టాడా? అని మురళీ కార్తీక్ ప్రశ్నించగా.. తన బౌలింగ్‌లో అతను పూర్తిగా తడబడ్డాడని, కనీసం బంతిని హిట్ కూడా చేయలేదని దిలీప్ సమాధానమిచ్చాడు. 98 పరుగులకే ఔటయ్యాడని చెప్పాడు. గుజరాత్‌కు చెందిన ఈ మాజీ క్రికెటర్ భారత్ తరఫున 33 టెస్టులు, 15 వన్డేలు ఆడి 136 వికెట్లు తీశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications