న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వారెవ్వా.. సూపర్ ఫీల్డింగ్‌తో సిక్సర్‌ను అడ్డుకున్న శాంసన్ (వీడియో)

India vs New Zealand 5th T20I : Sanju Samson Mind-blowing Fielding Effort
India vs New Zealand: Sanju Samson saves certain six with spectacular fielding effort

మౌంట్‌మాంగనీ: న్యూజిలాండ్‌తో జరిగిన ఆఖరి టీ20లో భారత్ 7 పరుగులతో గెలుపొంది 5-0తో సిరీస్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో భారత్ యువ క్రికెటర్ సంజూశాంసన్ అద్భుత ఫీల్డింగ్‌తో ఔరా అనిపించాడు. బ్యాటింగ్‌లో విఫలమైనా.. మైమరపించే ఫీల్డింగ్ విన్యాసంతో ఆకట్టుకున్నాడు.

India vs New Zealand 5th T20I: కివీస్‌ను క్లీన్ స్వీప్ చేసి చరిత్ర సృష్టించిన భారత్India vs New Zealand 5th T20I: కివీస్‌ను క్లీన్ స్వీప్ చేసి చరిత్ర సృష్టించిన భారత్

కళ్లు చెదిరే క్యాచ్

కళ్లు చెదిరే క్యాచ్

కివీస్ ఇన్నింగ్స్ సందర్భంగా శార్థుల్ ఠాకుర్ వేసిన 8వ ఓవర్‌ చివరి బంతిని రాస్ టేలర్ స్వీప్ చేస్తూ మిడ్ వికెట్‌ మీదుగా భారీ షాట్ ఆడాడు. ఆ షాట్ దాదాపు సిక్స్ అని అందరూ భావించారు. కానీ అక్కడే బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సంజూ.. సూపర్ మ్యాన్‌లా గాల్లోకి ఎగిరి బంతినందుకున్నాడు. అయితే బ్యాలెన్స్ కోల్పోయిన అతను బౌండరీ లైన్ బయట పడుతున్నానని గమనించి తన కాళ్ల సందులో నుంచి బంతి మైదానంలోకి విసిరేసాడు. దీంతో సిక్సర్ కాస్త రెండు పరుగులుగానే మారింది. ఇక శాంసన్ బంతి మైదానంలోకి విసిరినా ఫోరైనా కావచ్చని అందరూ భావించారు. కానీ రిప్లేలో చూసే సరికి శాంసన్ అద్భుత ఫీల్డింగ్ సంభ్రమాశ్చర్యానికి గురించేసింది.

శివమ్ దూబే చెత్త రికార్డు.. యువరాజ్ సిక్స్ సిక్సర్లకు బలైన స్టువర్ట్ బ్రాడ్ తర్వాత..

ప్రశంసల జల్లు..

ఈ అద్భుత ఫీల్డింగ్‌కు మైదానమంతా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. సహచర ఆటగాళ్ల అయితే శాంసన్ ఎఫర్ట్‌ను ప్రశంసిస్తూ చప్పట్లు కొట్టారు. ఇక కామెంటేటర్లు అయితే వాటే ఫీల్డింగ్ అంటూ.. స్టేడియం దద్దరిల్లేలా అరుస్తూ కేరళ బ్యాట్స్‌మన్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. శాంసన్ ఫీల్డింగ్‌కు ముగ్దులైన అభిమానులు సైతం సోషల్ మీడియా వేదికగా పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. అతని ఎఫర్ట్‌‌ను కొనియాడుతూ ఆ వీడియోను షేర్ చేస్తున్నారు.

సీఫెర్ట్, టేలర్ పోరాటం వృథా..

సీఫెర్ట్, టేలర్ పోరాటం వృథా..

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 163 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (60 రిటైర్డ్ హర్ట్) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. కేఎల్ రాహుల్ (45) తన ఫామ్‌ను కొనసాగించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో కుగ్లిన్ రెండు వికెట్లు తీయగా.. బెన్నెట్ ఒక వికెట్ తీశాడు. అనంతరం 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 156 పరుగులు చేసి ఓటమి పాలైంది టిమ్ సీఫెర్ట్(50), రాస్ టేలర్(52 ) అద్భుత ప్రదర్శన కనబర్చినా ఫలితం లేకపోయింది.

India vs New Zealand 5th T20I: ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన కేఎల్ రాహుల్‌

బూమ్ బూమ్ బుమ్రా..

బూమ్ బూమ్ బుమ్రా..

భారత బౌలర్లలో బుమ్రా (3/12) మూడు వికెట్లు తీయగా.. సైనీ, ఠాకుర్ రెండేసి వికెట్ల పడగొట్టారు. ఇక సుందర్‌కు ఒక వికెట్ దక్కింది. సిరీస్ ఆసాంతం ఆకట్టుకున్న కేఎల్ రాహుల్‌కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ వరించగా.. బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది. ఈ మ్యాచ్‌లో బుమ్రా నాలుగు ఓవర్లు వేసి కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతోనే భారత్ విజయం సాధించింది. ఇక 12 బంతుల్లో 24 పరుగులు చేయాల్సిన సమయంలో అద్భుతంగా బౌలింగ్ చేసిన బుమ్రా.. 18 ఓవర్లో ఒక వికెట్ తీసి మూడు పరుగులే ఇచ్చాడు.

Story first published: Sunday, February 2, 2020, 22:58 [IST]
Other articles published on Feb 2, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X