న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీసేన ఆస్ట్రేలియా పర్యటన ఆలస్యం.. ఎందుకంటే?

India vs Australia T20Is could be scrapped for IPL 2020 and Test series may get delayed

ముంబై: ఇంగ్లండ్-వెస్టిండీస్ టెస్ట్ సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్ పున:ప్రారంభమైంది. ఫ్యాన్స్ జోష్ లేకపోయినా ఈ రెండు జట్లూ ప్రాణం పెట్టి ఆడిన ఫస్ట్ టెస్ట్ సూపర్ హిట్టవ్వడంతో మిగతా జట్లకూ దారి చూపినట్టయింది. ఇక శ్రీలంక, సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌లో క్రికెటర్లు ఔట్ డోర్ ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేశారు. ఓవరాల్‌గా ఓవర్ సీస్ క్రికెట్ బాగానే ఉన్నా.. మరి భారత్‌లో ఆట రీస్టార్ట్ ఎప్పుడనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. మార్చి నుంచి ఇళ్లకే పరిమితమైన భారత క్రికెటర్లలో షమీ, ఉమేశ్, పంత్ పుజారా, విహారీ మాత్రమే ఔట్ డోర్ ప్రాక్టీస్ మొదలుపెట్టగా.. కోహ్లీ బ్యాట్, బాల్ పట్టక చాలా రోజులవుతున్నది. ఆసీస్ పర్యటనతోనే టీమిండియా తన ఆట మళ్లీ మొదలుపెట్టాలనుకున్నా.. ఆ టూర్ ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అంతా తారుమారు..

అంతా తారుమారు..

కరోనా భయంతో మార్చి ఆరంభంలో అర్ధాంతరంగా దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ రద్దు కావడం మొదలు మళ్లీ ఆట జరగలేదు. ఇక ఇప్పుడు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఏదోలా క్రికెట్‌ను ప్రారంభించాలని భావిస్తోంది. అందుకు తగిన ప్రణాళికను రూపొందించుకునే ప్రయత్నంలో ఉంది. కరోనా వల్ల భారత క్రికెట్‌ 2020-21 సీజన్‌ షెడ్యూల్‌ అంతా తారుమారైంది. ఇందులో కొన్ని మార్పుచేర్పులతో క్రికెట్‌ కార్యకలాపాలు కొనసాగించాలని బోర్డు నిర్ణయించింది.

 శిక్షణా శిబిరం నిర్వహణ

శిక్షణా శిబిరం నిర్వహణ

బీసీసీఐ ప్రణాళికల్లో అన్నింటికంటే ముందుగా భారత సీనియర్‌ జట్టుకు శిక్షణా శిబిరం నిర్వహించడం కీలకంగా మారింది. ముందుగా జూలై మూడో వారంలో అనుకున్నా... దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో అది సాధ్యం కావడంలేదు. ఇప్పుడు ఆగస్టుకల్లా పరిస్థితి చక్కబడుతుందని బోర్డు ఆశిస్తోంది. అదే జరిగితే బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) సరైన వేదిక అని బోర్డు అధికారులు చెబుతున్నారు. లేదంటే మరో ప్రత్యామ్నాయంగా హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలను అనుకుంటున్నారు. అయితే ఇక్కడ వసతి, ఇతర సౌకర్యాల గురించి కొంత ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది.

ఐపీఎల్ జరిగితే..

ఐపీఎల్ జరిగితే..

మరోవైపు ఐపీఎల్‌ జరిగే అవకాశం ఉంటే ఆయా జట్ల ఆటగాళ్లు కనీసం 21 రోజుల ముందు తమ జట్లతో చేరాల్సి ఉంటుంది. ప్రేక్షకులను అనుమతించకపోయినా టీవీ వీక్షకుల కోసమే ఐపీఎల్‌ జరపాలని బోర్డు పట్టుదలగా ఉంది. పూర్తి స్థాయిలో లీగ్‌ నిర్వహిస్తే నవంబర్‌ చివరినుంచి ప్రారంభం కావాల్సిన ఆస్ట్రేలియా పర్యటన కనీసం వారం రోజులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది.

టీ20 సిరీస్ అవసరం లేదు..

టీ20 సిరీస్ అవసరం లేదు..

‘క్రికెట్‌ ఆస్ట్రేలియా విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం డిసెంబర్‌ 3 నుంచి తొలి టెస్టు జరగాలి. దానికి ముందు టీ20, వన్డే సిరీస్‌లు ఉన్నాయి. అయితే ప్రపంచకప్‌ కోసమే టీ20 సిరీస్‌ పెట్టారు. ఇప్పుడు వరల్డ్‌కప్‌ జరిగే అవకాశం లేదు కాబట్టి టీ20 సిరీస్‌ రద్దు చేసుకుంటే నష్టమేమీ లేదు. టెస్టు సిరీస్‌ కూడా వారం ఆలస్యం అవుతుంది' అని ఓ బోర్డు అధికారి వెల్లడించారు. ఈ పర్యటన తర్వాత ఇంగ్లండ్‌ జట్టు కూడా భారత్‌కు రావాల్సి ఉంది. ఈ సిరీస్‌ కూడా సహజంగానే ఆలస్యం కానుంది.

టెన్షన్ తగ్గడానికి వరల్డ్‌కప్ ఫైనల్లో సిగరేట్ తాగిన బెన్ స్టోక్స్!

Story first published: Wednesday, July 15, 2020, 8:05 [IST]
Other articles published on Jul 15, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X