For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టెన్షన్ తగ్గడానికి వరల్డ్‌కప్ ఫైనల్లో సిగరేట్ తాగిన బెన్ స్టోక్స్!

Ben Stokes took a cigarette break to calm his nerves ahead of Super Over in 2019 WC final

లండన్: గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్ పోరు అధ్యాంతం ఉత్కంఠగా సాగిన విషయం తెలిసిందే. క్రికెట్ మక్కా లార్డ్స్ మైదానం వేదికగా ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య జరిగిన టైటిల్ ఫైట్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపించింది. ఆఖరి క్షణం వరకు నువ్వా-నేనా అన్నట్లు సాగి.. సూపర్ ఓవర్‌కు దారితీసింది. ఉత్కంఠకే ఊపిరందని ఈ మ్యాచ్‌లో అదృష్టం కలిసొచ్చి ఆతిథ్య ఇంగ్లండ్ విశ్వకప్‌ను తొలిసారి ముద్దాడింది.

స్టోక్స్ కీలక పాత్ర..

స్టోక్స్ కీలక పాత్ర..

ఇక ఇంగ్లండ్ విజయంలో ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ కీలక పాత్ర పోషించాడు. ముందుగా స్టార్ బ్యాట్స్‌మెన్ అంతా విఫలమైన వేళ 87 పరుగులతో అజేయంగా నిల్చొని మ్యాచ్‌ను టై చేశాడు. అనంతరం సూపర్ ఓవర్‌లో 8 పరుగులు చేసి జట్టుకు సూపర్ విక్టరీని అందించాడు. అయితే ఈ సూపర్ ఓవర్‌కు ముందు మైదానంలో నెలకొన్న నరాలు తెగేంత ఉత్కంఠను అధిగమించేందుకు స్టోక్స్ సిగరేట్ తాగినట్లు ‘మోర్గాన్ మెన్స్.. ది ఇన్ సైడ్ స్టోరీ ఆఫ్ ఇంగ్లండ్ వరల్డ్‌కప్ విన్నింగ్' పేరిట రచయితలు నిక్ హాల్ట్, స్టీమ్ జేమ్స్ రాసిన బుక్‌లో పేర్కొన్నారు.

స్థిత ప్రజ్ఞుడిగా ఉండటం కష్టం..

స్థిత ప్రజ్ఞుడిగా ఉండటం కష్టం..

‘27000 మంది ప్రేక్షకులతో కిక్కిరిసిన మైదానం..టీవీ కెమెరాలు.. ఎన్నో ఏళ్ల కళ సాకారమయ్యే క్షణం.. కొండంత బలమైన ప్రత్యర్థి. ఫలితం తేలకుండా సూపర్ ఓవర్‌కు దారితీసిన క్షణం. ఈ పరిస్థితుల్లో స్థిత ప్రజ్ఞుడిగా ఉండటం ఎవరికైనా చాలా కష్టం. కానీ బెన్ స్టోక్స్ లార్డ్స్‌లో చాలా సార్లు ఆడాడు. ఈ మైదానం గురించి అతనికి అణవణువు తెలుసు. ఇక ఉద్విగ్న క్షణంలో ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ డ్రెస్సింగ్ రూమ్‌లో తన వ్యూహాలను వివరిస్తూ సహచర ఆటగాళ్లలో టెన్షన్ తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు స్టోక్స్ తనదైన దారిలో ఉత్కంఠతను తగ్గించుకున్నాడు.

ఒక్క దమ్ము పీల్చి..

ఒక్క దమ్ము పీల్చి..

అప్పటికే రెండు గంటల 27 నిమిషాల పాటు బ్యాటింగ్ చేయడంతో అతని ముఖం దుమ్ము, చెమటతో నిండిపోయింది. ఈ స్థితిలో అతను డ్రెస్సింగ్ రూమ్‌లో షెవర్ కింద తల పెట్టి ఫ్రెష్ అయ్యాడు. అనంతరం వెనక్కు వెళ్లి ఓ సిగరెట్ దమ్ము పీల్చి టెన్షన్ తగ్గించుకున్నాడు.'అని రచయితలు నిక్ హాల్ట్, స్టీవ్ జేమ్స్ బుక్‌లో ప్రస్తావించారు. ఇక 2003 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో ఒత్తిడిని అధిగమించేందుకు సచిన్ టెండూల్కర్ కూడా ఐస్ క్రీమ్, అరటి పండు, మ్యూజిక్ విన్నట్లు తెలిపాడు.

మ్యాచ్ టై..

మ్యాచ్ టై..

ఇక టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు 241 పరుగలు చేసింది. హెన్రీ నికోలస్(55).. టామ్ లాథమ్(47) టాప్‌స్కోరర్లుగా నిలవగా.. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, లియమ్ ప్లంకెట్ మూడేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేజింగ్‌కు దిగిన ఇంగ్లండ్.. బెన్ స్టోక్స్(84 నాటౌట్) అజేయ పోరాటానికి జోస్ బట్లర్(59) సూపర్ ఇన్నింగ్స్ తోడవడంతో.. నిర్ణీత 50 ఓవర్లలో సరిగ్గా 241 పరుగులకే ఆలౌటైంది. దీంతో మ్యాచ్ టై అయి సూపర్ ఓవర్‌కు దారితీసింది. ఇక సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 15 పరుగులు చేసింది. తర్వాత న్యూజిలాండ్ కూడా అదే 15 పరుగులు చేయడంతో బౌండరీల నిబంధన ఆధారంగా ఇంగ్లండ్ విజేతగా నిలిచింది.

బ్లాక్‌బస్టర్ మూవీని తలపించిన ఆ ఉద్విగ్న క్షణానికి అప్పుడే ఏడాది!

Story first published: Tuesday, July 14, 2020, 16:22 [IST]
Other articles published on Jul 14, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+